
'పీహెచ్‌సీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం'
యాదగిరిగుట్ట: రాష్ట్రంలో పీహెచ్‌సీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత చెప్పారు. యాదాద్రి జిల్లాలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పీహెచ్సీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించారని చెప్పారు.
యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సునీత, డీఎం అండ్ హెచ్‌ఓ డి.కె.చారిలు ఆదివారం ఉదయం మొక్కలు నాటారు. యాదగిరిపల్లె పీహెచ్‌సీని 16 పడకలతో 24 గంటల ఆస్పత్రిగా మారుస్తున్నామంటూ సౌకర్యాల మెరుగుకు కృషి చేసిన ఆస్పత్రి సిబ్బందిని ఆమె అభినందించారు.