
'టీడీపీ అంటే డిపాజిట్ దక్కని పార్టీ'
హైదరాబాద్ : కాంగ్రెస్, టీడీపీలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలుకు వరుస పరాజయాలతో మైండ్ బ్లాక్ అయిందని జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. రోడ్డుప్రమాదంలో మృతి చెందిన సత్యం అంశాన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నేనే కనుక ఆ ప్రమాదం చేయించినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని జీవన్రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అంటే తెలంగాణలో డిపాజిట్ దక్కని పార్టీ అని జీవన్రెడ్డి ఈ సందర్భంగా అభివర్ణించారు.
దొంగకే తాళం చెవి ఇచ్చినట్లుగా రేవంత్కు చంద్రబాబు పదవి ఇచ్చారని విమర్శించారు. తెలంగాణలో ఇక టీడీపీకి టు లెట్ బోర్డు పెట్టాల్సిందే అని వ్యంగ్యంగా ఆరోపించారు. వరుస వలసలతో టీడీపీకి మతి భ్రమించిందన్నారు. అందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారని జీవన్రెడ్డి అన్నారు.