
'రాష్ట్రం విడిపోయినా... సీమాంధ్రల ఆగడాలు ఆగలేదు'
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినప్పటికీ హైదరాబాద్ నగరంలోని సీమాంధ్రుల ఆగడాలు ఇంకా ఆగలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎస్. రామలింగారెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాజధానిని తక్షణమే సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన పాత అసెంబ్లీ హాల్ చారిత్రక భవనమని ఈ సందర్బంగా రామలింగారెడ్డి గుర్తు చేశారు. అలాంటి భవనానికి మరమ్మతులు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రామలింగారెడ్డి నిప్పులు చెరిగారు.