సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు ఒరిగేది ఏమీలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు గురువారం హైదరాబాద్లో వెల్లడించారు. వారి సమ్మెతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్బాగమని ఆయన స్పష్టం చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్టం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలోని కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఏపీఎన్జీవోలు డిమాండ్ చేశారు.
వారి రాజీనామాకు గడువును విధించింది. అయితే వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారించడంతో ఏపీఎన్జీవోలు తమ సమ్మెను ఉధృతాన్ని చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన బెదిరేదిలేదని ఆ సంఘం పేర్కొంది. అంతేకాకుండా వచ్చే నెలలో హైదరాబాద్ నగరంలో సమైక్యాంధ్ర బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఏపీఎన్జీవోల సంఘం వెల్లడించిన సంగతి తెలిసిందే.
అలాగే సమైక్య ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు నేటి నుంచి సమ్మెకు దిగారు. దాంతో ఆ ప్రాంతంలో ఒక్క పాఠశాల కూడా గురువారం తెరుచుకోలేదు. సీమాంధ్రలో ఉద్యోగుల సంఘం చేపట్టిన సమ్మెపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు గురువారం పై విధంగా స్పందించారు.