
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే గువ్వల, అధికారులు
అమ్రాబాద్ : సీఎం కేసీఆర్ ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుగా, మేనమామగా కుటుంబ బాధ్యత మోస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 18మంది మహిళలకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, రైతు పెట్టుబడి తదితర పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఎమ్మార్‌ఐ కృష్ణాజీ, జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment