Kalyana Lakshmi schemes
-
బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం! మంత్రి కొండా సురేఖ
వరంగల్: బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీగార్డెన్, రైల్వే గేట్ శాంతినగర్‌లోని రాజశ్రీగార్డెన్‌లో రెవెన్యూశాఖ, సీ్త్ర శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, విద్యార్థికి 4జీ మొబైల్, దివ్యాంగులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బలహీన వర్గాల ప్రజల మొహా ల్లో చిరునవ్వులు చూడటమే సీఎం రేవంత్‌రెడ్డి ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు ఇక్బాల్ అహ్మద్, బండి నాగేశ్వర్రావు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి శారద, కార్పొరేటర్లు, నేతలు కొత్తపెల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో భాగంగా ప్రైవేట్ ఆస్పత్రులు, అప్రూవల్, మెటర్నల్ డెత్ సర్వేలెన్స్ రిపోర్ట్‌పై బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాతృ, శిశుమరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భిణులు ఆస్పత్రుల్లో నమోదు చేసుకున్న వెంటనే వారికి నిరంతరం సేవలందించాలని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్‌రావు, డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ నిర్మల పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆ రెండింటి డీఎన్ఏ ఒక్కటే -
ఎంపీపీ వర్సెస్ జెడ్పీ చైర్పర్సన్.. ఆ మాత్రం తెలియదా..
సాక్షి, ఇల్లందకుంట(కరీనంగర్): ప్రొటోకాల్ పాటించకుండా జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షత వహిస్తూ చెక్కులు ఏ విధంగా పంపిణీ చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎంపీపీ పావని నిలదీసింది. దీంతో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ మధ్య కొంతసేపు మాటల యుద్ధం నడిచింది. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తుండగా ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో లబ్ధిదారులు ఆందోళన గురయ్యారు. అసలే చెక్కుల కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నామని, ఈ సమయంలో మీ గొడవలు ఏంటని ప్రశ్నించారు. చెక్కులు పంపిణీ చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న చెక్కుల పంపిణీని అడ్డుకోవడానికి ఈటల వర్గీయులు ఇలా మాట్లాడుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ ఆరోపించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదనలు పెరుగగా, ఆర్డీవో రవీందర్‌రెడ్డి కలుగజేసుకొని సముదాయించారు. అనంతరం సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చదవండి: ఫోన్‌కాల్ కలకలం: ‘నువ్వేమైనా కేసీఆర్వా.. లేక ఎర్రబెల్లివా?’ -
కల్యాణలక్ష్మి: బోగస్ పెళ్లిళ్లపై ఆరా
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం జిల్లాలో అభాసుపాలవుతోంది. కొందరు అక్రమార్కులు మండల అధికారులతో సంబంధం లేకుండా ఆయా తహసీల్దార్ల లాగిన్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు నేరుగా ఆర్డీవో కార్యాలయానికి పంపి పెళ్లి కానుక డబ్బులు దండుకున్నట్లు తేలింది. దీనిపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ మూడేళ్ల నుంచి వచ్చిన కల్యాణలక్ష్మి దరఖాస్తులన్నీ పరిశీలన చేసి రిపోర్టు చేయాలని ఆయా తహసీల్దార్లను ఆదేశించారు. గడిచిన మూడేళ్లలో కల్యాణలక్ష్మికి ఎవరు దరఖాస్తు చేసుకున్నారు? పెళ్లి ఎవరికి జరిగింది? చెక్కు ఎవరి పేరుతో వచ్చింది? ఎవరు ఏ బ్యాంకులో డబ్బులు డ్రా చేశారు? ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయాలను నిషితంగా పరిశీలించాలని ఎమ్మార్వోలకు సూచించారు. దీంతో అధికారులు మూడేళ్ల నుంచి వచ్చిన దరఖాస్తులను బయటకు తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులెవరనే విషయాన్ని నిర్ధారించిన అనంతరం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు బోగస్‌గా తేలిన వారి నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2016 నుంచి కల్యాణలక్ష్మి అమలు రాష్ట్ర ప్రభుత్వం 2016లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. పేదింటి ఆడబిడ్డల వివాహానికి నగదును సాయంగా అందించే ఈ పథకం కింద వధువు పేరిట లేదా వారి కుటుంబ సభ్యుల పేరిట నగదు బ్యాంకులో జమ చేస్తోంది. మొదట్లో పెళ్లి కానుక రూ.50,116 ఉండగా ప్రభుత్వం 2018 ఏప్రిల్‌లో రూ.1,00,116కు పెంచింది. ‘కల్యాణలక్ష్మి’ కావాలనుకునే వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు మ్యానువల్‌గా మూడు జతల దరఖాస్తు జిరా>క్స్ కాపీలను నేరుగా తహసీల్దార్ కార్యాలయంలోని సంబంధిత అధికారికి అప్పగించాలి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తు, నేరుగా అందిన దరఖాస్తుతో సరిపోల్చి అవసరమనుకుంటే సదరు అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తహసీల్దార్‌కు నివేదిస్తారు. అనంతరం తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీవో కార్యాలయానికి ఆన్లైన్ దరఖాస్తును పంపిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే లబ్ధిదారు పేరున ట్రెజరీకి పంపి నగదును బ్యాంకు ఖాతాలో వేస్తారు. పత్రాలు సక్రమంగా లేకపోతే ఆర్డీవో కార్యాలయంలో తిరస్కరిస్తారు. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. సహకరిస్తోంది ఎవరు? ఆయా మండలాల తహసీల్దార్ల లాగిన్ నుంచి కల్యాణలక్ష్మి దరఖాస్తులు ఆర్డీవో కార్యాలయానికి ఎలా వెళ్తున్నాయి? ఇందుకు సహకరిస్తున్న వారెవరు? ఇప్పటి వరకు అలా ఎన్ని దరఖాస్తులు వెళ్లాయి? డబ్బులు ఎవరికి వచ్చాయి? బోగస్ పత్రాలు సృష్టించి డబ్బులు ఎవరు తీసుకున్నారు? అనే విషయాలు త్వరలో బయటకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదంతా జరుగుతోందా? కేవలం ఐదారు మండలాల్లోనే ఈ దందా కొనసాగుతోందా? అనేది త్వరలో తేలనుంది. 2018లో కల్యాణలక్ష్మి మొత్తాన్ని ప్రభుత్వం రూ.1,00,116కు పెంచడంతో డబ్బులు ఎక్కువగా వస్తున్నాయనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పెళ్లి కానుక పెంపు నుంచి ఈ దందా కొనసాగుతుందని అంచనాకు వచ్చిన యంత్రాంగం మూడేళ్ల రికార్డులు పరిశీలించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అధికారులు మొదట బోథ్, గుడిహత్నూర్, బజార్హత్నూర్, నేరడిగొండ, మావల మండలాల్లో పరిశీలించి 87 దరఖాస్తులు బోగస్‌గా ఉన్నాయని గుర్తించారు. బోగస్ లబ్ధిదారులు, మధ్యవర్తుల బ్యాంకు ఖాతాలను వెంటనే నిలిపివేయాలని ఎల్డీఎంను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని మిగతా మండలాల్లో కూడా దరఖాస్తులు పరిశీలించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయానికి మ్యానువల్‌గా వచ్చిన దరఖాస్తులు పరిశీలించకపోవడం, కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలను పసిగట్టలేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణమైనట్లు గుర్తించారు. తతంగం జరిగిన పీరియడ్‌లో ఉన్న సంబంధిత మండల అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసినట్లు కలెక్టర్ ఇది వరకే తెలిపారు. -
కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ
-
కటాక్షించని ‘కల్యాణలక్ష్మి’!
బోథ్: పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కొంతకాలంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామందికి చెక్కులు అందడం లేదు. చాలా వరకు దరఖాస్తులు ఆయా తహసీల్దార్ కార్యాయాల్లోనే మూలుగుతున్నాయనీ, వాటిని పట్టించుకునే వారే లేకుండా పోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు మాత్రం పెళ్లి సమయంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ‘నవ్వ రాములు’లాగానే ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమకు ఆ చెక్కులేవో ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 18 మండలాలు, 467 పం చాయతీలు ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,146 మంది కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,053 మందికి చెక్కులు అందగా, 31 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 1062 మందికి ఇంకా చెక్కులు అం దలేదు. అలాగే, షాదీముబారక్ కోసం 989 మం ది దరఖాస్తు చేసుకోగా, 568 మందికి చెక్కులు అందాయి. 17 దరఖాస్తులు తిరస్కరణకు గురవగా, 404 మందికి ఇంకా చెక్కులు అందలేదు. ఆఫీసుల్లోనే పెండింగ్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం లబ్ధిదారులు ‘మీసేవా’ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటారు. ఈ దరఖాస్తులు మీ సేవా కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి చేరతాయి. ఇక్కడ అధికారులు పరి«శీలించిన తరువాత ఆర్డీఓ కార్యాలయానికి అప్రూవల్ కోసం పంపించాలి. కానీ, చాలా దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లోనే ఆగుతున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికలు రావడంతో అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ కారణంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల ప్రక్రియ నెమ్మదించింది. ఇప్పుడు కూడా అధికారులు లోక్‌సభ ఎన్నికల విధుల్లో తలమునకలై ఉన్నారు. దీంతో లబ్ధిదారులు వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇదిలా ఉంటే, నిధులు కొరత వల్లే చెక్కులు రావడం లేదని అధికారులు చెప్పారని లబ్ధిదారులు పేర్కొనడం గమనార్హం! కాగా, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించినట్లు తెలుసనీ, అధికారులు కూడా దరఖాస్తుల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే తమకు ఆసరాగా ఉంటుందని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆడబిడ్డలకు వరం ‘కల్యాణలక్ష్మి’
మొగుళ్లపల్లి : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.అలాగే వేములపల్లి గ్రామంలోని 83.92లక్షలతో మాటు పూడికతీత పనులును స్పీకర్ ప్రారంభించారు అనంతరం ఆయన ఆయన మాట్లాడుతూ తెలంగాన రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావిస్తున్నారని, వారి సంక్షేమం కోసం అమ్మఒడి, కేసీఆర్ కిట్టు, కల్యాణలక్ష్మి వంటి పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించాలని ఆయన కోరారు. ప్రభుత్వ వసతి గృహలలో చదువుకునే విద్యార్థులకు గతంలో దొడ్డు బియ్యంతో భోజనం పెట్టేవారని కాని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నారని అన్నారు. గత పాలకుల హయంలో కనీసం గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. కేసిఆర్ పాలనలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా మిషన్‌కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 338 చెరువుల పునరుద్ధరణకు రూ.124 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపీపీ నల్లబీం విజయలక్ష్మిమల్లయ్య , జెడ్పీటీసీ సభ్యురాలు సంపెల్లి వసంత, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ చదువు అన్నారెడ్డి, మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, దండ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీలు జమలాపురం లక్ష్మి, మంద స్వామి, రంగాపురం సర్పంచ్ సూరినేని స్వర్ణలతరవీందర్‌రావు, ముల్కలపల్లి సర్పంచ్ వేముల చంద్రమౌళి, మేదరమెట్ల సర్పంచ్ బాలవేని సుధీర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మోరె జయపాల్‌రెడ్డి,నర్సింహరెడ్డి, అరెల్లి రమేష్, భూమయ్య, ఆర్ఐ లెనిన్, సీనియర్ అసిస్టెంట్ జగన్, రమేష్, వీఆర్వోలు సురేష్, సందీప్ రాంమ్మూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా కేసీఆర్
అమ్రాబాద్ : సీఎం కేసీఆర్ ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుగా, మేనమామగా కుటుంబ బాధ్యత మోస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 18మంది మహిళలకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, రైతు పెట్టుబడి తదితర పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఎమ్మార్ఐ కృష్ణాజీ, జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
బాల్యానికి మూడుముళ్లు
బాల్యవివాహాలను అరికట్టేందుకు అధికారులు చర్యలెన్ని చేపడుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా.. తలెత్తే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నా చాటుమాటుగా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో 50 రోజుల వ్యవధిలో ఆరు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మరికొన్ని చాటుమాటుగా జరిగినట్లు తెలుస్తోంది. అభద్రత, నిరక్షరాస్యత, అజ్ఞానం, పేదరికం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. సాక్షి, యాదాద్రి : ప్రజల అజ్ఞానం, నిరక్షరాస్యత, బాలికలపై అభద్రతాభావంతో బాల్య వివాహాలు జిల్లాలో జరుగుతున్నాయి. 13, 14 ఏళ్ల వయసులోనే బాలికల వివాహం చేసి అత్తింటికి పంపిస్తున్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల కుటుంబాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు చోటు చేసుకున్న సంఘటనలు చూస్తే తెలుస్తోంది. అధికారులకు అందిన సమాచారం మేరకు కొంత మేరకు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రించలేక పోతున్నారు. జిల్లాలోని 16మండలాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. హైదరాబాద్ శివారులో గల అభివృద్ధి చెందుతున్న భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం, తుర్కపలి లాంటి మండలాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల కాలంలో పలు ఘటనలు బీబీనగర్ మండలంలోని రెండేళ్ల కాలంలో నాలుగు బాల్య వివాహాలను అధికారులు నిలిపివేయించారు. 2016లో జియాపల్లి తండా, 2017లో రుద్రవెళ్లి, కొండమడుగు, యాపగానితండాలో, మోత్కూరు మండలంలో తొమ్మది బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మోత్కూరు మండలం కొండగడప, దాచారంలో ఒక్కటి, అడ్డగూడూర్ మండలం కంచనపల్లిలో మూడు, అడ్డగూడూర్, హజీంపేట, మంగమ్మగూడెం, గట్టుసింగారం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున అడ్డుకుని వారి తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే రాజాపేట మండలం నెమిలో ఒకటి, సంస్థాన్ నారాయణపురం మండలంలో మూడు జరిగాయి. వీటిలో బాల్యవివాహాలలో రెండు ఘటనలు తండాల్లో జరిగినవి కాగా, ఒకటి ఉన్నత వర్గానికి చెందినది. వీటిని రెవెన్యూ, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, చైల్డ్‌కేర్ ప్రతినిధులు బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా అడ్డుకట్ట పడడం లేదు. గడిచిన 45 రోజుల్లో జిల్లాలో ఆరు బాల్య వివాహాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కల్యాణలక్ష్మికి దూరం ఆడ పిల్ల పెళ్లి కోసం పభుత్వం కల్యాణ లక్ష్మి పథ కం కింద ఆర్థిక సాయం అందజేస్తోంది. బాల్య వి వాహాలు చేస్తే ఈ పథకానికి అర్హులు కారు. అయి తే కొందరు అధికారులు కల్యాణలక్ష్మి పథకాన్ని బాల్య వివాహం చేసుకున్న వారికి కూడా వర్తింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు(ఎం) మండలంలో బాల్య వివాహం జరిగిన బాలిక కుటుంబానికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేశారు. ఈవిషయంలో అధికారులు విచారణ కూడా చేపట్టారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, 21 ఏళ్లు నిండిన యువకుడితో వివాహం జరిగితే కల్యాణ లక్ష్మి పథకంలో అర్హత సాధిస్తారని అధికారులు చెబుతున్నారు. నిరక్ష్యరాస్యత, పేదరికం గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరిగేందుకు నిరక్షరాస్యత, పేదరికం, ఆర్థిక భారం, ఆడపిల్లంటే అభద్రతాభావం ప్రధాన కారణాలని తెలుస్తోంది. కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెకు వివాహం చేయడానికి ఆర్థిక స్థోమత ఎక్కడ అడ్డువస్తుందోన ని చిన్న వయస్సులోనే పెళ్లి చేస్తున్నారు.ఆడపిల్ల ఏ దో ఒక రోజు బయటకు వెళ్లాల్సిందేనని, అదేదో వచ్చిన మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవా లని అని కూడా బాల్య వివాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి మార్చి 19 వరకు వెలుగుచూసినవి.. ఫిబ్రవరి 1న : తుర్కపల్లి మండలం ముల్కలపల్లి పంచాయతీ కిమ్యాతండా ఫిబ్రవరి 27న : తుర్కపల్లి మండలం గొల్లగూడెం పంచాయతీ పరిధిలో రామోజీనాయక్ తండాలో మార్చి 2న : వలిగొండ మండలం పహిల్వానర్పురంలో మార్చి 10న : సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్లో మార్చి 12 : తుర్కపల్లి మండలం దత్తాయపల్లిలో మార్చి 19 : భువనగిరి మండలం పచ్చబొర్లతండాలో 18వివాహాలు అడ్డుకున్నాం జిల్లాలో 18 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. జిల్లా ఆవిర్భావం తర్వాత ఆలేరు, మోత్కూర్, భువనగిరి, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో జరిగిన బాల్య వివాహాలపై స్పందించాం. వెంటనే అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాలను అడ్డుకున్నాం. బాల్య వివాహాలు చేస్తే ప్రభుత్వ పథకాలు అందవు. చట్టపరంగా శిక్షలు ఉంటాయి. –జిల్లా మహిళా సంక్షేమాధికారి శారద -
పెళ్లి సాయం పెరిగింది!
సాక్షి, కామారెడ్డి: ఆడపిల్లల పెళ్లిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా అందజేస్తున్న సాయాన్ని రూ.1,00,116 కు పెంచింది. సోమవారం శాసన సభలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. అప్పుడు కేవలం ఎస్సీ, ఎస్టీలకు వారికి రూ.51,116 అందజేసేవారు. తరువాత దీన్ని మైనారిటీలకు షాదీముబారక్ పేరుతో వర్తింపజేసి తరువాత అన్ని వర్గాల పేద కుటుంబాలకు వర్తింపజేయడంతో పాటు ఆర్థికసాయం మొత్తాన్ని రూ.రూ.75,116కు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ మొత్తాన్ని రూ.1,00,116 కు పెంచుతూ సీఎం ప్రకటన చేయడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మందికిపైగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రయోజనం పొందారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 18 ఏళ్లు పైబడిన వారికి వివాహ కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా సాయం అందిస్తారు. అయితే పథకం అమలులో అక్కడక్కడా అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని లింగంపేట మండలంలో రెండు, మూడు అక్రమాలు జరగగా, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. -
ఇక ‘కల్యాణలక్ష్మి’కి రూ.1,00,116
సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి అందజేస్తున్న సాయాన్ని ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.75,116గా ఉన్న మొత్తాన్ని రూ.1,00,116కు పెంచుతున్నట్టు ప్రకటించింది. సోమవారం ఈ మేరకు శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట అందజేస్తున్న సాయాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వారి ఆశీర్వాదమే కొండంత అండ ‘అత్యంత మంగళకరమైన ఈ పథకానికి సంబంధించి మరో శుభవార్తను ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే మొత్తాన్ని రూ.లక్షా నూట పదహార్లకు పెంచుతున్నట్టు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ఆడపిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచే కాకుండా.. సమాజహితం కోరే వారందరి నుంచి హర్షామోదాలు లభిస్తాయని విశ్వసిస్తున్నా. వారి ఆశీర్వాదమే కొండంత అండగా సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని సవినయంగా తెలియజేస్తున్నా’అని సీఎం పేర్కొన్నారు. ఇంటి మహాలక్ష్మిగా గౌరవించే ఆడపిల్లని.. గుండెల మీద కుంపటిగా భావించే మానసిక స్థితికి నిరుపేదలు మారుతున్నారని, కడుపులో ఉండగానే భ్రూణహత్యలకు పాల్పడుతున్న అమానుష సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని సభ దృష్టికి తెచ్చారు. ‘కొన్ని ఇళ్లల్లో ఆడపిల్లలు పెళ్లి లేకుండానే ఉండిపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కల్యాణలక్ష్మి పేరుతో పథకాన్ని ప్రారంభించాం. ఆడపిల్లల కన్నీరు తుడుస్తున్న ఈ పథకం వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది’అని వివరించారు. ఇప్పటిదాకా 3.60 లక్షల మందికి లబ్ధి ‘తొలుత కల్యాణలక్ష్మి పేరుతో ఎస్సీ, ఎస్టీలకు, షాదీముబారక్ పేరుతో మైనారిటీ వర్గాలకు రూ.51 వేలు అందించటం ప్రారంభించాం. ప్రజల అభ్యర్థన మేరకు సామాజిక వర్గంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపజేశాం. గతేడాది ఈ మొత్తాన్ని రూ.75,116 పెంచాం. ఇప్పటి వరకు 3.60 లక్షల మందికి లబ్ధి చేకూరింది’అని సీఎం తెలిపారు. ఈ పథకం ఇతర సామాజిక ప్రయోజనాలను కూడా సాధించిందని, లబ్ధి పొందేవారి అర్హత వయసు 18 ఏళ్లుగా నిర్ణయించినందున ఈ ప్రయోజనం పొందేందుకు ఆడపిల్లకు ఆ వయసు వచ్చే వరకు పెళ్లిచేయకుండా ఆపుతున్నారని కేసీఆర్ తెలిపారు. ఫలితంగా బాల్య వివాహాల నిరోధానికి దోహదపడుతోందని వెల్లడించారు. ఈ పథకం కింద జరిగే వివాహాలకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు చట్టబద్ధత లభిస్తోందని, ఇది పథకం సాధించిన మరో ప్రయోజనమన్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయగానే సభలోని అధికార పక్ష సభ్యులు పెద్దపెట్టున బల్లలు చరుస్తూ నినాదాలు చేశారు. -
‘లక్ష్మి’ వరించేదెప్పుడో.?
పెనుబల్లి : కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయం అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో సుమారు మూడు వందల మందికి గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా చెక్కులు మంజూరు కాలేదు. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు వాటికోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ పథకాల ద్వారా రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందన్న ఆశతో వధువు తల్లిదండ్రులు.. అప్పులు చేసి వివాహ వేడుకలను, లాంఛనాలను ఘనంగా నిర్వహించారు. దీని కోసం దొరికాడల్లా అప్పులు చేసి మరీ వివాహాలు జరిపించారు. ఇలా గత జనవరి నుంచి డిసెంబర్ వరకు మండలంలో సుమారు మూడు వందల మంది వరకు వివాహాలు చేసి ఆన్లైన్ ద్వారా కల్యాణ లక్ష్మి పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో సగం వరకు రెవెన్యూ అధికారులు విచారణ చేసి అర్హులైన వారికి మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. మరో 100 నుంచి 150 మంది వరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ఇంకా రెవెన్యూ అధికారులు విచారణ కూడా చేపట్టలేదు. విచారణ చేపట్టేదెప్పుడు, తమకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా చెక్కులు అందేదెప్పుడని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో తహసీల్దార్లు విచారణ చేపట్టి చెక్కు లు అందజేసే విధానం నుంచి స్థానిక ఎమ్మెల్యేను కూడా దీనిలో భాగాస్వామ్యం చేయడంతో కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యేకు సమన్వయం లోపించింది. దీంతో రెవెన్యూ అధికారులు తమ తప్పిదాన్ని ప్రజా ప్రతినిధులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కల్లూరు మండల రెవెన్యూ అధికారులు.. కల్యాణ లక్ష్మి చెక్కుల మంజూరులో ఎమ్మెల్యే జాప్యం చేస్తున్నారని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇటీవల కల్లూరు రెవెన్యూ కార్యాలయంలో అనుచరులు, లబ్ధిదారులతో కలిసి బైఠాయించారు. వెంటనే లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం చెక్కులు అందజేయాలని, తన వద్ద ఎటువంటి పెండింగ్ లేదని, రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే నిలదీశారు. ఏదీ ఏమైనా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలాన.. నెలల తరబడి కల్యాణ లక్ష్మి చెక్కుల కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. మే నుంచి చెక్కు రాలేదు.. మే నెలలో మమ్మాయి వివాహం చేశా. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు విచారణకు రాలేదు. మాకు సాయం అందేదెప్పుడో. - చీపి కృష్ణ, పెనుబల్లి ఆగస్టు నుంచి చెక్కు రాలేదు.. ఆగస్టులో అమ్మాయికి వివాహం చేశా. ఇంతవరకు అధికారులు విచారణకు రాలేదు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించాలి. విచారణ చేపట్టి న్యాయం చేయాలి. – నాగుల నాగేశ్వరరావు, పెనుబల్లి జాప్యం జరిగింది.. భూ ప్రక్షాళన విధుల కారణంగా జాప్యం జరిగింది. కొన్ని దరఖాస్తులను పరిశీలించి నివేదిక అందించాం. మరికొన్ని దరఖాస్తులను విచారిస్తున్నాం. త్వరగా విచారిస్తాం. – తూమాటి శ్రీనివాస్, తహసీల్దార్ -
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై నజర్
మొన్న మైనార్టీ, నిన్న ఎస్సీసంక్షేమశాఖలో ఏసీబీ తనిఖీలు పాలమూరు : పేద యువతుల పెళ్లిళ్లకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు జిల్లాలో పక్కదారి పడుతున్నాయన్న సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. పైరవీకారులు, అధికారులు కుమ్మక్కై అనర్హులకు ఈ రెండు పథకాలను వర్తింపజేస్తూ వారినుంచి వాటా తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ప్రభుత్వం ఈ పథకాలను సమర్థంగా అమలుచేసే విషయమై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో గతంలో మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఏసీబీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం గురువారం రోజు మైనార్టీ సంక్షేమశాఖలో ఏసీబీ అధికారులు షాదీముబారక్ పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అదే విధంగా శుక్రవారం ఎస్సీ అభివృద్ధిశాఖలో కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన రికార్డులను ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ పరిశీలించారు. ఏసీబీ తనిఖీల నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, అనర్హులకు వణుకు మొదలైంది. ఎస్సీ అభివృద్ధిశా ఖ పరిధిలో.. ఎస్సీ అభివృద్ధిశాఖ పరిధిలో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మొత్తం 6,633 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 5,279 మందికి ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.51వేల చొప్పున మంజూరు చేశారు. 516 దరఖాస్తులు కార్యాలయంలో 364 పరిశీలనలో పెండింగ్‌లో ఉన్నాయి. 474 రిజెక్టు అయ్యాయి. రిజెక్టు లిస్టులో ఎక్కువగా ముందుగా పెళ్లి చేసుకొని తర్వాత చేసుకున్నట్లుగా తప్పుడు ఆహ్వానపత్రికలు పెట్టి దరఖాస్తు చేసుకున్న వారు, వయస్సు తక్కువగా ఉన్నవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మైనారిటీ సంక్షేమశాఖ.. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న షాదీముబారక్ పథకానికి సంబంధించి ఏప్రిల్ 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,500 మంది మైనార్టీ యువతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 2037 మందికి రూ.51వేల చొప్పున మంజూరు చేశారు. 459 దరఖాస్తులు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. 4 దరఖాస్తులు రిజెక్టు అయినట్లు అధికారులు వెల్లడించారు. పైరవీకారులదే హవా... కల్యాణలక్ష్మి పథకంలో పైరవీ కారులదే హవా కొనసాగుతుంది. ప్రభుత్వం పారదర్శకంగా పథకాన్ని అమలు చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివాహ ఆహ్వాన పత్రికలో ఉన్న తేదీని తాజాగా పథకంలో అమల్లోకి వచ్చిన తేదీ నుంచి కొన్ని నెలల తర్వాతా వివాహం జరిగినట్లు మార్చి దరఖాస్తు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. లబ్ధిదారుల నుంచి పర్సెంటేజీలకు ఒప్పందం కుదుర్చుకొని పైరవీకారులు కల్యాణలక్ష్మి దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అధికారులు సైతం పైరవీకారులతో డబ్బులు తీసుకొని వాటిని జిల్లా కార్యాలయానికి పంపిస్తున్నారు. వెరిఫికేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కువశాతం కల్యాణలక్ష్మి దుర్వినియోగం అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ రంగప్రవేశంతో అధికారుల్లో వణుకు.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తుండటంతో అధికారుల్లో వణుకు మొదలైంది. గురువారం మైనార్టీ సంక్షేమశాఖలో, శుక్రవారం ఎస్సీ సంక్షేమశాఖలో ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ రికార్డులను పరిశీలించారు. ఎస్సీ సంక్షేమశాఖలో డీడీ శ్రీనివాసరావు, ఉద్యోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాందాస్‌తేజ విలేకరులతో మాట్లాడారు. చాలా మంది అక్రమంగా లబ్ధిపొందిన వారిపై ఫోన్‌ద్వారా సమాచారం వచ్చిందని, పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలించి క్షేత్రస్థాయిలోనూ పరిశీలిస్తామని వెల్లడించారు. దళారులపై కూడా చర్యలుంటాయని తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయని, అక్రమాలు చేసినట్లు గుర్తిస్తే పై అధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని అన్నారు. పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ వెల్లడించారు. ఎలాంటి అవినీతి ఉన్నా 94913 05609 నంబర్‌కు తెలియజేయాలని ఆయన కోరారు. ఏప్రిల్-2015 నుంచి వివరాలు కల్యాణలక్ష్మి మొత్తం దరఖాస్తులు 6,633 మంజూరైనవి 5,279 పెండింగ్ 880 రిజెక్ట్ 474 షాదీముబారక్ మొత్తం దరఖాస్తులు 2,500 మంజూరైనవి 2037 పెండింగ్ 459 రిజెక్ట్ 4