ఆడబిడ్డలకు వరం  ‘కల్యాణలక్ష్మి’ | Kalyana Lakshmi Scheme To be Extended All BPL Families Speaker | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డలకు వరం  ‘కల్యాణలక్ష్మి’

Published Fri, May 4 2018 8:02 AM | Last Updated on Fri, May 4 2018 8:02 AM

Kalyana Lakshmi Scheme To be Extended All BPL Families Speaker - Sakshi

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ  చేస్తున్న స్పీకర్‌ మధుసూదనాచారి

మొగుళ్లపల్లి : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరమని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.అలాగే వేములపల్లి గ్రామంలోని 83.92లక్షలతో మాటు పూడికతీత పనులును స్పీకర్‌ ప్రారంభించారు  అనంతరం ఆయన ఆయన మాట్లాడుతూ  తెలంగాన రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావిస్తున్నారని, వారి సంక్షేమం కోసం అమ్మఒడి, కేసీఆర్‌ కిట్టు, కల్యాణలక్ష్మి  వంటి పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.

తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించాలని ఆయన కోరారు. ప్రభుత్వ వసతి గృహలలో చదువుకునే విద్యార్థులకు గతంలో దొడ్డు బియ్యంతో భోజనం పెట్టేవారని కాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నారని అన్నారు. గత పాలకుల హయంలో కనీసం గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. కేసిఆర్‌ పాలనలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా మిషన్‌కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టం చాలా గర్వించదగ్గ విషయమన్నారు.

భూపాలపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 338 చెరువుల పునరుద్ధరణకు రూ.124 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు.   కార్యక్రమంలో తహసీల్దార్‌ సునీత, ఎంపీపీ నల్లబీం విజయలక్ష్మిమల్లయ్య , జెడ్పీటీసీ సభ్యురాలు సంపెల్లి వసంత, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ చదువు అన్నారెడ్డి, మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, దండ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీలు జమలాపురం లక్ష్మి, మంద స్వామి, రంగాపురం సర్పంచ్‌ సూరినేని స్వర్ణలతరవీందర్‌రావు, ముల్కలపల్లి సర్పంచ్‌ వేముల చంద్రమౌళి, మేదరమెట్ల సర్పంచ్‌ బాలవేని సుధీర్, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి మోరె జయపాల్‌రెడ్డి,నర్సింహరెడ్డి, అరెల్లి రమేష్, భూమయ్య, ఆర్‌ఐ లెనిన్, సీనియర్‌ అసిస్టెంట్‌ జగన్, రమేష్, వీఆర్వోలు సురేష్, సందీప్‌ రాంమ్మూర్తి,  కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement