spekar
-
‘పోలవరం, సుజల స్రవంతితో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం’
సాక్షి, విశాఖపట్నం: సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నవరత్నాలతో అన్నిరంగాల్లో ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కోవిడ్ నియంత్రణలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్, సుజల స్రవంతి పథకం ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం కానుందని తమ్మినేని అన్నారు. -
వైఎస్ జగన్ గొప్ప మానవతావాది
సాక్షిప్రతినిధి, శ్రీకాకుళం : ‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప మానవతావాది. ప్రజల కోసం ఎందాకైనా వెళ్తారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవ్వరూ తీసుకోని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం పరితపించే ముఖ్యమంత్రి ఆయన. 19 బిల్లులు ప్రవేశపెట్టడం, 14 చట్టాలు చేయడమంటే ఆషామాషీ కాదు. మానవతా దృక్పథంతో కూడిన బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఉద్వేగానికి లోనయ్యా ను. ఒకానొక సందర్భంలో కళ్లంట నీరు వచ్చేసింది. నా చిన్నతనం నుంచి అలాంటి బిల్లులు రావాలని చెప్పుకోవడం తప్ప అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాఖలాల్లేవు. ఎంతో విశిష్టత గల బి ల్లులు ఆమోదం పొందిన సభకు నేను సభాపతిని కావడం ఎంతో ఆనందం కలిగింది.’ అని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తన మనసులో మాటలను వ్యక్తపరి చారు. కొత్త ప్రభుత్వం పనితీరుపై తన మనోగతాన్ని ‘సాక్షి’ వద్ద ఆవిష్కరించారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... నా హయాంలో 19 బిల్లులు ప్రవేశ పెట్టడం అదృష్టం.. నేను స్పీకర్‌గా ఉన్న సమయంలో శాసన సభలో 19 బిల్లులు ప్రవేశపెట్టడం 14 బిల్లులు ఆమోదించడం అదృష్టంగా భావిస్తున్నాను. చరిత్రాత్మక బిల్లుగా 50 శాతం మహిళల రిజర్వేషన్ నిలిచిపోతుంది. నేను నిక్కర్లు వేసినప్పటి నుంచి మహిళా రిజర్వేషన బిల్లు తప్పనిసరిగా అమలుచేయాలని ప్రతిపాదనలు తప్ప ఏ ప్రభుత్వం అమలు చేయలేదు. నేను స్పీకర్‌గా ఉన్న సమయంలో ఇంతటి ఘన చరి త్ర ఉన్న బిల్లు ప్రవేశపెట్టడంతో చాలా సం తోషించాను. దీని వల్ల సామాజిక స్థితిగతులు మారుతాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడమే కాదు చేసి చూపిం చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మైనార్టీల్లో ఒక్కొక్కరిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా, మంత్రులుగా ఎంపిక చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మానవతావాది జగన్మోహన్రెడ్డి. బీసీ ల్లో సభాపతిగా నన్ను ఎంపిక చేసి రాజ్యాంగ వ్యవస్థకు పరిచయం చేసి గౌరవ ప్రదమైన స్థానంలో ఉంచారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు.. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత కోసం జ్యుడిషియల్ కమిషన్ వేసి పనుల్లో అవినీతి జరగకుండా చేయడం గొప్ప నిర్ణయం. కౌలుదార్ల చట్టం, భూ యజ మానులకు భరోసా ఇచ్చే చట్టం భూసర్వేకు సమగ్రంగా జరిగేందుకు నిర్ణయాలు తీసుకోవ డం అభినందనీయం. సామాజిక న్యాయం కోసం మాటలు విన్నా.. కానీ చట్టం చేసిన వ్యక్తి జగన్ మాత్రమే. బీసీలు, ఎస్సీ, ఎస్టీల కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలు నాకెంతో ఆనందం కల్గించాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు గొప్ప నిర్ణయం. దీని వల్ల నిరుద్యోగం తగ్గుతుంది. మహిళల రిజర్వేషన్ కోసం చాలా మంది తమ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. కానీ సీఎం జగన్మోహన్రెడ్డి ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా ప్రవేశపెట్టారు. ఎలాంటి గొప్పలకు పోలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి చీఫ్ మినిస్టర్ కంటే ముందు గొప్ప మానవతావాది అని చెప్పకతప్పదు. చక్కగా మాట్లాడారు.. జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. చక్కగా మాట్లాడారు. నేను కూడా అందుకు తగ్గ అవకాశాన్ని కల్పించాను. ఈ శాసన సభలో సుమారు 70మందికి పైగా కొత్త ఎమ్మెల్యేలున్నా రు. ముందుగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకే మాట్లాడే అవకాశం కల్పించి వారిని ముందుకు తీసుకెళ్లేలా సీఎం కూడా ప్రోత్సహించారు. చా లా మంది ఉన్నత చదువులు చదువుకున్న వారే. ప్రత్యేకంగా విషయాన్ని తర్ఫీదు చేసుకోవాల్సిన అవసరం వారికి రాలేదు. అందరూ తమ వాణి వినిపించారు. రాష్ట్రంలో సుగర్ ఫ్యాక్టరీలు తెరి పించేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. వాటికి మంచి రోజులొస్తాయి. అందులో ఎలాం టి సందేహం లేదు. స్పీకర్ కాక ముందు వరకు ప్రస్థానమిలా.. నేను కలలను నమ్మను. వాస్తవిక దృక్పథంతో రాజకీయాల్లో కొనసాగాలన్నదే నా లక్ష్యం. మూ డు సార్లు వరుసగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో ఉండకూడదు. కానీ ప్రజా జీవితంలో కొన్ని లక్ష్యాలు, ఆశయాల కోసం పనిచేయాలే తప్ప గెలుపోటములకు భయపడకూడదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే లక్ష్యం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడటమే నా స్టైల్. జనాలకు సేవ చేసేందుకే నాడు జగన్మోహన్రెడ్డి విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాను. రాజశేఖర్‌రెడ్డి బతికున్న సమయంలోనే పలు మార్లు పార్టీలో చేరాలని కోరితే సమయం వచ్చినప్పుడు చేరుతాం సార్ అని అన్నాను. నేనొక్కడినే కాదు సార్ నా వెంట ఉన్న కేడర్, బంధువులు, బలగం అంతా నిర్ణయం తీసుకోవాలి కదా అని చెప్పాను. సీతారాం చేరాడం టే ఓ స్థాయిలో ఉండాలన్నదే నా ధ్యేయం అని చెప్పా. అయితే ఆయన సరదాగా ఓ మాట అన్నారు. ‘రచ్చబండకి వచ్చేటప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తా అప్పుడు చేరాలి.... ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తా’నని జోక్ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగానే చనిపోయారు. ఆ మహానుభావుడు అడిగారు వెళ్లలేకపోయానని బాధపడేవాడిని. ఆయన బాటలోనే నడుస్తూ, ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటున్న వ్యక్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి అని నమ్మి పనిచేశాను. పార్టీలో చేరినప్పటి నుంచి జగన్ చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా చేశాను. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్రెడ్డి నన్ను పిలిచి శాసనసభాపతిగా ఉండాలని కోరితే సరేనని అంగీకరించాను. -
అర్హులకే డబుల్ బెడ్రూం ఇళ్లు
బాన్సువాడ రూరల్: అర్హులైన నిరుపేదలకే డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన బోర్లం క్యాంపుతో పాటు గ్రామంలో డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణాల కోసం ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించారు. బోర్లం క్యాంపు లోని దుర్గమ్మ గుడి ముందు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ స్థలానికి తోడు మరో ఎకరం పట్టా స్థలం కొని ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అలాగే బోర్లంలోని అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న స్థలంలో తొలివిడతలో 30 మందికి డబుల్ ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. గ్రామస్తులు ప్రభుత్వం ఇస్తున్న నిధులతో తామే సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటామని స్పీకర్ దృష్టికి తీసుకురాగా ఆయన సమ్మతించారు. అలాగే ఆదిబసవేశ్వర మందిరం సమీపంలో బీడీ కార్మికుల కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరో ఎకరం స్థలం కొనుగోలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 5.04 లక్షలు మంజూరు చేస్తుందని, లబ్ధిదారులు తిరిగి ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కో–ఆర్డినేటర్ అంజిరెడ్డి, సర్పంచ్ సరళ, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు పుట్టి లక్ష్మి, ఉపసర్పంచ్ మంద శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మోహన్‌నాయక్, నాయకులు మహ్మద్ ఎజాస్, నార్లసురేష్, కొత్తకొండ భాస్కర్, పాతబాలకృష్ణ, బన్సీనాయక్, బోడచందర్, నెర్రె నర్సింలు, దేవేందర్‌రెడ్డి, పుట్టి లక్ష్మణ్, గోపన్‌పల్లి సాయిలు, బసప్ప, జలీల్, రాజేశ్వర్‌గౌడ్, కృష్ణ నాగభూషణం, ఎర్రోల్లబాలు, జీవన్ పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: పఢాయి కైసే హోరహీ హై.. ఆప్ సబ్ ఇస్ స్కూల్సే సంతుష్ట్ హై.. అంటూ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మండలంలోని మైనారిటీ బాలిక గురుకుల పాఠశాల విద్యార్థినులతో ముచ్చటించారు. బోర్లం నుంచి గురువారం బాన్సువాడకు వెళ్తూ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారా..? బోధన ఎలా సాగుతోంది..? పౌష్టికాహారం అందిస్తున్నారా..? అంటూ విద్యార్థినులతో ముచ్చటించారు. నెలలో ఎన్నిసార్లు చికెన్, ఎన్ని సార్లు మటన్ పెడ్తున్నారు. ఈరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్ ఏం చేశారు అంటూ ఆరా తీశారు. ఎవరెవరు ఎక్కడెక్కడి వారు అంటూ పలువురిని ప్రశ్నించారు. మరోసారి తీరిగ్గా వస్తానని..చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. పఢాయి కైసే హోరహీ.. -
‘పోచారం’ కొత్త సవారీ!
ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. తన రాజకీయ జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. పలుమార్లు మంత్రిగా పని చేసిన ఆయన.. ప్రస్తుత అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. శుక్రవారం నుంచి జరగనున్న మొదటి బడ్జెట్ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించబోతున్నారు. పలు శాఖల బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి మెప్పించిన పోచారం.. శాసనసభాపతిగానూ రాణిస్తారని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కామారెడ్డి: పంచెకట్టు.. దానికి తగ్గట్టుగా హుందాతనం.. అన్నింటికీ మించి ముక్కుసూటితత్వం ఆయన సొంతం. ఎ దిగిన కొద్దీ ఒదిగే గుణం ఆయనను స్పీకర్ స్థాయికి చేర్చింది. ఆయనే పోచారం శ్రీనివాస్‌రెడ్డి. నాలుగు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఆయన ఒక్కో మెట్టు ఎదుగు తూ వచ్చారు. పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి ప్రభు త్వం తీసుకువచ్చిన ఎన్నో కార్యక్రమాల ను విజయవంతంగా నిర్వహించి సీఎం మెప్పు పొందారు. సీఎం ఆయనను చాలాసార్లు ‘లక్ష్మీపుత్రుడు’ అని సంబోధించారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సమర్థవంతుడిగా పేరు తెచ్చుకున్న పోచారం శ్రీ నివాస్‌రెడ్డి.. స్పీకర్‌గానూ అందని అభిమా నం సంపాదిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. కొత్త సవారీ.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నాలుగు ద శాబ్దాలుగా ఎన్నో పదవులను అలంకరించారు. తొలుత సింగిల్‌విండో చైర్మన్‌గా ప నిచేసిన పోచారం.. తొలిసారిగా 1994లో టీడీపీ అభ్యర్థిగా బాన్సువాడ నియోజకవర్గంనుంచి పోటీ చేసి గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొంతకాలానికే మంత్రి అయ్యారు. 1999లోనూ ఆయన విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. 2004లో మాత్రమే ఆయన పరాజయాన్ని పొందా రు. 2009నుంచి వెనుదిరిగి చూడలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీనుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన తరుణంలో ఆయన ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. 2011 లో జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయాలు సొంతం చేసుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్ సార«థ్యంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఆయన కీలకమైన వ్యవసా య శాఖ మంత్రిగా పనిచేశారు. రైతుల రుణమాఫీ నుంచి రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి పథకాల అమలు కోసం ఆయన నిరంతరం శ్రమించారు. మంత్రిగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రా«ధాన్య కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో తనదైన ముద్రవేశారు. మొన్నటి ఎ న్నికల్లో గెలుపొందిన తరువాత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారంను సీఎం కేసీఆర్ స్పీకర్‌గా ప్రతిపాదించారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఇంతకాలం మంత్రిగా వివిధ పోర్టుపోలియోలు నిర్వహించి శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన పోచారం.. ఇప్పుడు అసెంబ్లీలో సభ్యులకు, ప్రభుత్వానికి మధ్య ఇరుసుగా పనిచేయబోతున్నారు. స్పీకర్‌గా కొత్త పాత్ర పోషించనున్నారు. ‘ఆర్డర్ ఆర్డర్’ అంటూ సభను నియంత్రించనున్నారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. గత నెల 18న స్పీకర్ ఎన్నిక తరువాత గవర్నర్ ప్రసంగం, సభ్యుల ప్రసంగాలతో మూడు రోజులకే సభ ముగిసింది. అయితే శుక్రవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. తనకున్న అనుభవంతో స్పీకర్‌గా కూడా పోచారం సక్సెస్ అవుతారని ఆయన అనుచరులు అంటు న్నారు. రోజూ తన నియోజకవర్గంలో పర్యటించే పోచారం.. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు హైదరాబాద్‌కే పరిమితం కానున్నారు. -
ఆడబిడ్డలకు వరం ‘కల్యాణలక్ష్మి’
మొగుళ్లపల్లి : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.అలాగే వేములపల్లి గ్రామంలోని 83.92లక్షలతో మాటు పూడికతీత పనులును స్పీకర్ ప్రారంభించారు అనంతరం ఆయన ఆయన మాట్లాడుతూ తెలంగాన రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావిస్తున్నారని, వారి సంక్షేమం కోసం అమ్మఒడి, కేసీఆర్ కిట్టు, కల్యాణలక్ష్మి వంటి పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించాలని ఆయన కోరారు. ప్రభుత్వ వసతి గృహలలో చదువుకునే విద్యార్థులకు గతంలో దొడ్డు బియ్యంతో భోజనం పెట్టేవారని కాని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నారని అన్నారు. గత పాలకుల హయంలో కనీసం గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. కేసిఆర్ పాలనలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా మిషన్‌కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 338 చెరువుల పునరుద్ధరణకు రూ.124 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపీపీ నల్లబీం విజయలక్ష్మిమల్లయ్య , జెడ్పీటీసీ సభ్యురాలు సంపెల్లి వసంత, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ చదువు అన్నారెడ్డి, మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, దండ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీలు జమలాపురం లక్ష్మి, మంద స్వామి, రంగాపురం సర్పంచ్ సూరినేని స్వర్ణలతరవీందర్‌రావు, ముల్కలపల్లి సర్పంచ్ వేముల చంద్రమౌళి, మేదరమెట్ల సర్పంచ్ బాలవేని సుధీర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మోరె జయపాల్‌రెడ్డి,నర్సింహరెడ్డి, అరెల్లి రమేష్, భూమయ్య, ఆర్ఐ లెనిన్, సీనియర్ అసిస్టెంట్ జగన్, రమేష్, వీఆర్వోలు సురేష్, సందీప్ రాంమ్మూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కు’
హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారులతో కుమ్మక్కయ్యాయని అనుమానంగా ఉందని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..గత ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ మీద నెపం నెట్టడానికే సమీక్షలు చేస్తున్నారు తప్ప టీఆర్ఎస్ రైతుల కోసం చేసింది శూన్యమన్నారు.మద్దతు ధర కోసం రూ. 2 వేల కోట్లు పెడతామని తెరాస ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని తెలిపారు. కానీ ఒక్క బడ్జెట్లో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మండిపడ్డారు. 2008లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రైతుల కోసం 153 జీవో తెచ్చారని చెప్పారు. రూ.30 కోట్లు విడుదల చేసి, రూ.11 కోట్లు ట్రేడర్ మీద యాక్ట్ కోసం నిధులు ఇచ్చామని వివరించారు. రైతుల మీద ప్రేమకు అది నిదర్శనమన్నారు. మీరేం చేశారో చెప్పగలరా..? అని టీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎర్రజొన్న, పసుపు రైతుల కోసం 15 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు గిట్టుబాటు ధర కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. -
ఫిరాయింపుల కేసుపై కేసీఆర్ సమాలోచనలు
హైదరాబాద్: అనర్హత పిటిషన్ల వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విస్తృతంగా సమాలోచనలు జరిపారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావుతో ఆయన శుక్రవారం అడ్వకేటు జననర్ (ఏజీ) రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఈ నెల 8వ తేదీలోగా స్పీకర్ కౌంటర్ దాఖలు చేయాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముథోల్ ఎమ్మెల్యే గడ్డం విఠల్‌రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య, చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్లో చేరారు. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ శాసన సభాపక్షం (సీఎల్పీ) విప్ , అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సంపత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్టు ఈనెల ఎనిమిదో తేదీలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకుంటారో సమాధానం ఇవ్వాలని స్పీకర్‌కు సూచించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై చర్చించేందుకు, న్యాయ సలహా పొందేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఏజీని పిలిపించి చర్చించారని విశ్వసనీయంగా తెలిసింది. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే తలెత్తినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే పూర్తి విచక్షణాధికారం స్పీకర్‌కే ఉన్నా, న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఈ వ్యవహారంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ సమాధానం ఇవ్వాల్సిన అవసరంపైనే చర్చించారని సమాచారం. అదే మాదిరిగా.., అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం, సమావేశాలను ఎప్పటి నుంచి నిర్వహించాలి, ఆ తేదీలపై కూడా కేసీఆర్, మంత్రి హరీష్ చర్చించుకున్నారని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నవంబర్ చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. -
విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి చెందాలి
యాదగిరిగుట్ట: ప్రదేశాల్లో భక్తుల ఆకలి తీరుస్తున్న అన్నదాన సత్రాలు ఎంతో గొప్పవని, అన్ని దానాల కంటే.. అన్నదానం గొప్పదని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనచారి అన్నారు. యాదగిరిగుట్టలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న అన్నదాన సత్రానికి భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఇలాంటి అన్నదాన సత్రాలు నిర్మించి అన్నప్రసాదం అందించడంతో ఎంతో మంది భక్తులు, ప్రజలు గుర్తు చేసుకుంటారన్నారు. విశ్వ బ్రాహ్మణుల్లో అనైక్యతతో ప్రస్తుత కాలంలో వారికి డబ్బు, రాజ్యాధికారం లేదన్నారు. ఇకనైనా ఐక్యతతో ముందుకు సాగి అభివృద్ధి చెందాలన్నారు. విశ్వబ్రాహ్మణులకు అనేక రకాలుగా సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విశ్వబ్రాహ్మణులు పారిశ్రామికంగా సైతం ఎదగాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు కుందారం గణేషాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేములవాడ మధన్మోహన్, రాష్ట్ర కార్యదర్శి వడ్లోజు వెంకటేశ్, గౌరవ అధ్యక్షుడు శివకోటి వీరస్వామి, వడ్లోజు మన్మథాచారి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పసూనూరి బ్రహ్మనందచారి, మండల అధ్యక్షుడు చెన్నోజు భగవంతాచారి, కందోజు నర్సింహాచారి, శివకోటి భాస్కరాచారి, కందుకూరి నాగభూషణం, కోటగిరి విద్యాధర్‌చారి, జనగాం రత్నయ్యచారి ఉన్నారు.