స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. తన రాజకీయ జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. పలుమార్లు మంత్రిగా పని చేసిన ఆయన.. ప్రస్తుత అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. శుక్రవారం నుంచి జరగనున్న మొదటి బడ్జెట్ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించబోతున్నారు. పలు శాఖల బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి మెప్పించిన పోచారం.. శాసనసభాపతిగానూ రాణిస్తారని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, కామారెడ్డి: పంచెకట్టు.. దానికి తగ్గట్టుగా హుందాతనం.. అన్నింటికీ మించి ముక్కుసూటితత్వం ఆయన సొంతం. ఎ దిగిన కొద్దీ ఒదిగే గుణం ఆయనను స్పీకర్ స్థాయికి చేర్చింది. ఆయనే పోచారం శ్రీనివాస్‌రెడ్డి. నాలుగు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఆయన ఒక్కో మెట్టు ఎదుగు తూ వచ్చారు. పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి ప్రభు త్వం తీసుకువచ్చిన ఎన్నో కార్యక్రమాల ను విజయవంతంగా నిర్వహించి సీఎం మెప్పు పొందారు. సీఎం ఆయనను చాలాసార్లు ‘లక్ష్మీపుత్రుడు’ అని సంబోధించారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సమర్థవంతుడిగా పేరు తెచ్చుకున్న పోచారం శ్రీ నివాస్‌రెడ్డి.. స్పీకర్‌గానూ అందని అభిమా నం సంపాదిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు.
కొత్త సవారీ..
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నాలుగు ద శాబ్దాలుగా ఎన్నో పదవులను అలంకరించారు. తొలుత సింగిల్‌విండో చైర్మన్‌గా ప నిచేసిన పోచారం.. తొలిసారిగా 1994లో టీడీపీ అభ్యర్థిగా బాన్సువాడ నియోజకవర్గంనుంచి పోటీ చేసి గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొంతకాలానికే మంత్రి అయ్యారు. 1999లోనూ ఆయన విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. 2004లో మాత్రమే ఆయన పరాజయాన్ని పొందా రు. 2009నుంచి వెనుదిరిగి చూడలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీనుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన తరుణంలో ఆయన ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. 2011 లో జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయాలు సొంతం చేసుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్ సార«థ్యంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఆయన కీలకమైన వ్యవసా య శాఖ మంత్రిగా పనిచేశారు. రైతుల రుణమాఫీ నుంచి రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి పథకాల అమలు కోసం ఆయన నిరంతరం శ్రమించారు. మంత్రిగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రా«ధాన్య కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో తనదైన ముద్రవేశారు.
మొన్నటి ఎ న్నికల్లో గెలుపొందిన తరువాత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారంను సీఎం కేసీఆర్ స్పీకర్‌గా ప్రతిపాదించారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఇంతకాలం మంత్రిగా వివిధ పోర్టుపోలియోలు నిర్వహించి శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన పోచారం.. ఇప్పుడు అసెంబ్లీలో సభ్యులకు, ప్రభుత్వానికి మధ్య ఇరుసుగా పనిచేయబోతున్నారు. స్పీకర్‌గా కొత్త పాత్ర పోషించనున్నారు. ‘ఆర్డర్ ఆర్డర్’ అంటూ సభను నియంత్రించనున్నారు.
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు..
గత నెల 18న స్పీకర్ ఎన్నిక తరువాత గవర్నర్ ప్రసంగం, సభ్యుల ప్రసంగాలతో మూడు రోజులకే సభ ముగిసింది. అయితే శుక్రవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. తనకున్న అనుభవంతో స్పీకర్‌గా కూడా పోచారం సక్సెస్ అవుతారని ఆయన అనుచరులు అంటు న్నారు. రోజూ తన నియోజకవర్గంలో పర్యటించే పోచారం.. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు హైదరాబాద్‌కే పరిమితం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment