
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బుధవారం ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. కవితతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, బాజీరెడ్డి గోవర్థన్ తదితరులు స్పీకర్‌ను కలిశారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో... పోచారంను కలిసిన అనంతరం కవిత అక్కడ నుంచి నేరుగా నిజామాబాద్ బయల్దేరారు. (మండలి ‘స్థానిక’ అభ్యర్థిగా కవిత)
కాగా శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కవిత బుధవారం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. టీఆర్‌ఎస్ నుంచి పలువురు ఆశావహులు టికెట్ ఆశించినా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు.
Comments
Please login to add a commentAdd a comment