
సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
సాక్షి, విశాఖపట్నం: సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నవరత్నాలతో అన్నిరంగాల్లో ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కోవిడ్ నియంత్రణలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్, సుజల స్రవంతి పథకం ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం కానుందని తమ్మినేని అన్నారు.