నేను మొదటి నుంచీ రైతునే | i am farmer, says enugu ravinder reddy | Sakshi
Sakshi News home page

నేను మొదటి నుంచీ రైతునే

Published Thu, Apr 23 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

i am farmer, says enugu ravinder reddy

ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి


 సదాశివనగర్: ఇజ్రాయిల్ పర్యటనపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆరోపించారు. తాను మొదటి నుంచి రైతునేనని, తనకు 30 ఎకరాల సాగు భూమి ఉందని పేర్కొన్నారు. బుధవారం ఆయన సదాశివనగర్ మండలం కుప్రియాల్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఓర్వలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ఇజ్రాయిల్ పర్యటకు వెళ్తున్నారని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. గతంలోనూ మహారాష్ట్రలోని బారామతి, సాంగ్లీ ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న చెరుకు పంటను పరిశీలించామన్నారు. ఇప్పుడు  సాగు  విషయాలను తెలుసుకోవడానికే ఇజ్రాయిల్‌కు వెళ్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement