సాక్షి, హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 73 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది వీఆర్‌ఏలు మంగళవారం ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడానికి పెద్దఎత్తున తరలివచ్చారు. కానీ దీనికి అనుమతి లేకపోవడంతో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని వీఆర్‌ఏలను అరెస్ట్ చేశారు.
తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రోడ్డుపై బైఠాయించిన వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వాళ్లను బలవంతంగా అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
చదవండి: మునుగోడుకు రూ. 22 వేల కోట్లు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటాం
Comments
Please login to add a commentAdd a comment