vra protest
-
Telangana: వీఆర్ఏల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: 83 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని వీఆర్ఏలు నిర్ణయించారు. వీఆర్ ఏల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందని, ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల నియమావళి ఎత్తివేయగానే వారి డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. వీఆర్ఏలందరూ తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించారు. దీంతో గురువారం నుంచి విధులకు హాజరవుతామని వీఆర్ఏలు చెప్పారు. వీఆర్ఏల ప్రతినిధులు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులతో సోమేశ్‌కుమార్ బుధవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు తమ డిమాండ్లను సీఎస్‌కు విన్నవించారు. పే స్కేల్ వర్తింపు, సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు, సమ్మె కాలానికి వేతనం, కేసుల ఎత్తివేత, సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించడం, సమ్మెకాలంలో మరణించిన వీఆర్ఏల కుటుంబాలకు పరిహారం చెల్లింపు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం తదితర డిమాండ్లను వివరించారు. ఈ సమావేశంలో ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, వీఆర్ఏ జేఏసీ సెక్రెటరీ జనరల్ దాదే మియా, కన్వీనర్ డి.సాయన్న తదితరులు పాల్గొన్నారు. హామీ ఇచ్చారు: ట్రెసా అధ్యక్షులు రవీందర్ రెడ్డి ‘వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా నవంబరు 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వీఆర్ఏలు గురువారం నుంచి విధులకు హాజరవుతారు’అని సీఎస్‌తో చర్చల అనంతరం ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. చదవండి: Munugode Bypoll: తగ్గేదేలే..!.. ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు -
వీఆర్ఏలపై లాఠీ ఛార్జ్.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 73 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది వీఆర్ఏలు మంగళవారం ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడానికి పెద్దఎత్తున తరలివచ్చారు. కానీ దీనికి అనుమతి లేకపోవడంతో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని వీఆర్ఏలను అరెస్ట్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రోడ్డుపై బైఠాయించిన వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వాళ్లను బలవంతంగా అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చదవండి: మునుగోడుకు రూ. 22 వేల కోట్లు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటాం -
వీఆర్ఏలపై కేసీఆర్ ఆగ్రహం.. సమస్యలు వినే ఓపికలేని సీఎం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలు వినే ఓపికలేని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు వినతి పత్రం ఇస్తే.. దాన్ని వాళ్ల ముఖంపై పడేయడం సీఎం అహంకారానికి నిదర్శనమని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. వీఆర్ఏలు.. సీఎం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏలు) రాష్ట్రవ్యాప్తంగా 69 రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్ల సాధన కోసం నిర్విరామ నిరసన కార్యక్రమాలకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు శాసనసభలో ప్రకటించినట్టుగా పేస్కేల్ అమలు చేయాలని కోరుతున్నారు. చదవండి: దీక్ష వేదికపైనే బ్లేడ్‌తో గొంతు కోసుకుని వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం -
బ్లేడ్‌తో గొంతు కోసుకుని వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం
నెక్కొండ: రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలేదని ఓ వీఆర్ఏ మనస్తాపానికి గురై గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. గుండ్రపల్లి వీఆర్ఏ మహ్మద్ ఖాసీం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా 69 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఖాసీం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం నెక్కొండలో జరిగిన నిరాహార దీక్షలో పాల్గొన్న ఖాసీం బ్లేడ్‌తో గొంతు కోసుకున్నారు. దీంతో తోటి వీఆర్ఏలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సీ మాఫర్హీన్ ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇదీ చదవండి: అన్ని అనుకూలతలు ఉన్నా వెనుకబడే దుస్థితి ఎందుకు?: సీఎం కేసీఆర్ -
బాధ్యత నాది... సమ్మె విరమించండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘మీ డిమాండ్లు న్యాయమైనవే. ప్రభుత్వం కూడా మీ పట్ల సానుకూలంగా ఉంది. ప్రభుత్వానికి కొంత సమయం కావాల్సి ఉంటుంది. సీఎంతో మాట్లాడి మంత్రివర్గ ఆమోదం తీసుకుంటాం. ప్రస్తుతానికి సమ్మె విరమించండి. మీ సమస్యలను నేనే స్వయంగా చూసుకుంటా. బాధ్యత నాది. సమ్మె విరమించండి’అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. 58 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్ఏ జేఏసీ నేతలతో మంగళవారం మెట్రోభవన్‌లో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీకి సీఎస్ సోమేశ్‌కుమార్ కూడా హాజరయ్యారు. వీఆర్ఏ జేఏసీ కోకన్వీనర్ వంగూరి రాములుసహా 12 మంది జేఏసీ నేతలతో మంత్రి, సీఎస్‌లు అరగంటకుపైగా మాట్లాడారు. సమ్మె విరమించాలని, వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని, ఎవరికీ అన్యాయం జరగదని, గడువు చెప్పలేం కానీ, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఉన్నఫళంగా సమ్మె విరమణ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వీఆర్ఏలు వ్యక్తం చేశారు. ఈ సమ్మె కాలంలో పలువురు వీఆర్ఏలు ప్రాణాలు కోల్పోయారని మంత్రి, సీఎస్‌లకు గుర్తుచేశారు. ఏ నిర్ణయమైనా జేఏసీలో మాట్లాడి తీసుకుంటామని చెప్పారు. దీంతో ప్రభుత్వం, వీఆర్ఏ జేఏసీల చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. కాగా, మంత్రి కేటీఆర్ ప్రతిపాదనపై చర్చించేందుకు వీఆర్ఏ జేఏసీ నేడు(బుధవారం) సమావేశం కానుంది. సమావేశంలోనే సమ్మెను విరమించాలా లేక కొంతకాలంపాటు వాయిదా వేసి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి ముందుకెలా వెళ్లానేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
వీఆర్ఏల ఆందోళన.. తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ మరోసారి విఫలం అయింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ వీఆర్ఏల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. ఇంటెలిజెన్స్ ఛలో అసెంబ్లీని పసిగట్టలేకపోయింది. మంగళవారం ఏడు సంఘాలు ఒకేసారి అసెంబ్లీ ముట్టకి యత్నించాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక మంది వీఆర్ఏలు మూడు రోజుల ముందుగానే బంధువుల ఇళ్లకి చేరుకున్నారు. మంగళవారం విడతల వారీగా 6వేల మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం, కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడిలను కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది. ఇదిలా ఉంటే, వీఆర్ఏల అసెంబ్లీ ముట్టడి విషయం తెలుసుకున్న ఐటీ మంత్రి కేటీఆర్ వారితో సమావేశమయ్యారు. వీఆర్ఏ సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వీఆర్ఏలు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. చదవండి: (Telangana VRAs: ప్రభుత్వంతో ముగిసిన వీఆర్ఏల చర్చలు) -
ఆర్డీవో కార్యాలయం ఎదుట వీఆర్ఏల ఆందోళన
పార్వతీపురం: ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం వందలాది మంది వీఆర్ఏలు ధర్నాకు పూనుకున్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. కనీసం రూ.18వేల వేతనం చెల్లించాలని, మెడికల్ ఇన్వాలిడేషన్‌లో వారసుల వయో పరిమితిని సడలించాలని కోరారు. తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించవద్దని పేర్కొన్నారు. కార్యాలయం గేట్లు మూసేసి వారు నినాదాలు చేశారు.