
ఒక్కరోజు కార్మిక శాఖ జేసీఎల్‌గా విద్యార్థిని శ్వేత, జేసీఎల్ గంగాధర్, అప్సా సభ్యులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అప్సా ప్లాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో విద్యార్థిని శ్వేత ఒక్క రోజు జంటనగరాల సంయుక్త కార్మిక శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించింది. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలోని గుండా ఈశ్వరయ్య ప్రభుత్వ పాఠశాలలో శ్వేత 9వ తరగతి చదువుతోంది. తాను ఒక్క రోజు కమిషనర్‌గా విధులు నిర్వహించడం చాలా సంతోషానిచ్చిందని తెలిపింది. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతాధికారిగా స్థిరపడి ప్రజలకు సేవ చేస్తానని వివరించింది. జంటనగరాల సంయుక్త లేబర్ కమిషనర్ డాక్టర్ ఇ.గంగాధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగడానికి ఇలాంటి వారికి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఏఎల్‌ఓ స్థాయి అధికారులు ప్రభాకర్, పవన్, అప్సా పద్మ, బస్వరాజ్, గౌరి, శంకర్, పట్నాయక్, రాంప్రసాద్ పాల్గొన్నారు.
‘బాలానందం’ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
కాచిగూడ: ఆంధ్ర బాలానంద సంఘం 80వ వార్షికోత్సవం సందర్భంగా జంటనగరాల్లోని బాలబాలికలకు వివిధ అంశాల్లో ప్రతిభా పాట వ పోటీలు నిర్వహిస్తున్నామని ఆసక్తి గల బాల బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బాలానందం కార్యదర్శి జేవీ కామేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులన్నారు. వివరాలకు నారాయణగూడలోని బాలనంద సంఘం కార్యాలయంలో నేరుగా గాని, ఫోన్ నెంబర్ 040– 27561443లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment