International Day of the Girl Child
-
నేషనల్ గర్ల్ చైల్డ్ డే: ఒక్క చిరునవ్వు... కోటి కాంతులు
అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే.. కూతురు అమ్మకు అమ్మ అవుతుంది. నాన్న మనసుకు కష్టం కలిగితే.. కూతురు చేయి ఓదార్పు అవుతుంది. ఈ పదేళ్లలో ప్రభుత్వాలు, ప్రజలలోనూ బాలికలకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ పెరిగింది. ప్రపంచ వేదికపై బాలికలు తమ గళాన్ని వినిపించడానికి మరిన్ని అవకాశాలు పెరిగాయి. అయినప్పటికీ, బాలికల హక్కులపై అవగాహన పరిమితంగానే ఉంది. బాలికలు తమ సామర్థ్యాన్ని నెరవేర్చుకోవడానికి సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు వారి అడుగులకు మరింత ఊతాన్ని ఇవ్వాల్సిన తరుణమిది. ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందర్భంగా ఈ విషయంపై దృష్టి సారిద్దాం.. ‘కూతుళ్ళే మన భవిష్యత్తు’ అనే మాటని మన ప్రధాని నరేంద్రమోదీ వివిధ సందర్భాలలో చెప్పడం పదే పదే విన్నాం. వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తిస్తున్నాం. ఆడపిల్లల సాధికారతకు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. అయినా ‘ఆమె’ పురోగతి కి కుటుంబం, సమాజం చేయాల్సిన కృషి ఎంతో ఉంది. కుటుంబంలో స్కీమ్స్ ఒకప్పుడు కూతురు ఇంటి గుండె మీద కుంపటి. ఇప్పుడు కుటుంబ సమస్యలను ఓ దరిచేర్చగల చుక్కాని. అందుకే పుట్టేది ఆడపిల్లైనా, మగపిల్లవాడైనా ‘సరే’ అనే దిశకు కుటుంబం చేరుకుందనే చెప్పాలి. కానీ, ‘ఆమె’ పెరుగుదలలో ఇంటి నుంచే ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అందుకు తల్లితండ్రులే అమ్మాయిలను ప్రోత్సహించడానికి స్కీమ్స్ పెడుతుండాలి. ఆమె కలలకు, ఆశయాలకు మద్దతునివ్వాలి. ఎలాంటి సమస్య అయినా ‘పరువు’ అనే భయంతో కాకుండా బలమైన వెన్నుగా నిలవాలి. డిజిటల్ జనరేషన్, అవర్ జనరేషన్ ఈ నినాదం ఇప్పుడు బాలికలకు అత్యవసరమైనది. డిజటల్ యుగంలో ‘ఆమె’కు వాటి వినియోగంలోనూ పూర్తి అవగాహన అవసరం. ఇప్పటికే అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు డిజిటల్ పరికరాల వాడకంలో వెనకంజలో ఉన్నట్టు ప్రపంచవ్యాప్త అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా అమ్మాయిలను ప్రభావంతంగా మార్చే మానవ ఆసక్తి కథనాలు, బ్లాగ్లు, వీడియోలు, రీసోర్సింగ్ చేసే స్ఫూర్తిదాయకమైన నెట్‌వర్క్‌లు, సంస్థల గురించి తెలుసుకునే అవకాశాలను కల్పించాలి. చట్టం.. హక్కులు సమాజంలో ధైర్యంగా, శక్తిమంతంగా ఎదిగేందుకు ఆమె చుట్టూ ఉన్న రక్షణ, న్యాయ వ్యవస్థల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు కుటుంబంతోపాటు ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనది. నాయకత్వాన్ని పెంచుదాం అవగాహన ‘ఆమె’కు అవకాశాలను విస్తృతం చేస్తుంది. నాయకత్వాన్ని ఎంచుకునేలా ఎదగాలంటే .. ► మన ప్రాంతంలోని అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాల గురించి అవగాహన పెంపొందించడంలో, వాటిని పరిష్కరించడంలో ముందుండాలి. ► బాలికలకు అందాల్సిన సేవలను మరింతగా బలోపేతం చేయాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా వారి నాయకత్వం, చర్యలు, ప్రభావాన్ని సమష్టిగా విస్తరింపజేయాలి. ► ప్రపంచవ్యాప్తంగా బాలికలు లింగ అసమానత, వివక్షకు గురవుతున్నారనేది వాస్తవం. ఇవి బాలికలను ప్రతిచోటా వెనకడుగు వేయిస్తున్నాయి. అందుకే లైంగిక వేధింపులు, హింస, అసమానతలు, హక్కుల గురించి అవగాహన కల్పించడంలో వెనకంజ వేయకూడదు. ► విద్య, ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యతలను తెలియజేయడమే కాదు వాటిని అందించడంలోనూ ముందంజలో ఉండాలి. ► అమ్మాయిలు తమలోని ప్రతిభను కనబరచడమే కాకుండా పూర్తి స్వేచ్ఛతో జీవించే అవకాశాన్ని కల్పించాలి. ► చాలా ప్రాంతాలలో అమ్మాయిలను త్వరగా పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదు. అయినా, ఎలాంటి హింస జరిగినా ఆడపిల్లలకు తమ గొంతు వినిపించే హక్కు ఉంది. ఈ విషయాన్ని వారికి తప్పక తెలియజేయాలి. ► రోల్ మోడల్స్‌గా ఉన్నవారిని బాలికలకు పరిచయం చేయిస్తూ ఉండాలి. బాలికా నాయకత్వం పట్ల ప్రజలలో అవగాహనను పెంచాలి. ► అలజడులు, వలసలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో సామాజిక సహాయ సేవలను పొందుతున్నప్పుడు బాలికలు అనుభవించే అసమానతలను పరిష్కరించడానికి అధికారులు, విధాన నిర్ణేతలు మరింత గా దృష్టి సారించాలి. ఒక ఆడపిల్ల తన స్వచ్ఛమైన చిరునవ్వుతో ఇంటిని ప్రకాశవంతం చేస్తుంది. జీవితాన్ని ఎలా గడపాలో నేర్పేది ఆమె. కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేసే స్వచ్ఛమైన ఆత్మ. కాబట్టి ప్రతి ఇంటినీ తన నిస్వార్థ ప్రేమతో, ప్రకాశంతమైన కాంతితో నింపే ఆమె భవిష్యత్తును ఉజ్వలం చేద్దాం. సమాజంలో సమానమైన అవకాశాలను కల్పించడానికి ప్రయత్నిద్దాం. -
International Day of the Girl Child: భళారే.. బాలిక
ఆడపిల్ల..భూమ్మీద పడగానే.. పెదవి విరుపు..ఎదుగుతున్న ప్రతి దశలోనూ ఆటంకాలు..స్కూలు దూరంగా ఉంటే చదువు ఆపేయమంటారు. హైస్కూలు పూర్తవగానే ఈ చదువు చాలనేవారు కొందరు. డిగ్రీ చదువుదామంటే చదివి ఉద్యోగాలు చేయాలా అంటూ దీర్ఘాలు..పెళ్లి చేసేస్తే ఓ పనైపోతుందంటూ తన ఎదుటే చర్చలు..ఒంటరిగా వెళ్లాలంటే ఇబ్బందులు..ధైర్యంగా ముందడుగు వేద్దామంటే వెనక్కులాగేవారెందరో..మరోపక్క వేధింపులు..ఇలా పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛను హరించేవారే ఎక్కువ. ఇలాంటి నిరాశాపూరిత వాతావరణం అమ్మాయిల్లో చాలామందికి ఎదురవుతుంది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. తల్లితండ్రులు తమ ఆడబిడ్డలనూ చదివిస్తున్నారు. ఉద్యోగానికి పంపుతున్నారు. మరోపక్క ప్రభుత్వమూ అవకాశాల్లో ఆడపిల్లకు అగ్రాసనమేస్తోంది. జగన్ ప్రభుత్వంలో వీరికి పూర్తి ప్రోత్సాహం లభిస్తోంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... ప్రతిభకు పట్టుదల జత కలిసి.. కడియం: ఆస్తిపాస్తుల్లేవు.. ఇద్దరూ ఆడపిల్లలు.. తండ్రి చిరు సంపాదనే ఆధారం..ఇలాంటి నేపథ్యంలో ప్రతిభకు పట్టుదల తోడై అ అమ్మాయి విదేశీ విద్యను అభ్యసిస్తోంది. కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన మేణ్ణి లీలావిష్ణుజ్యోతి చిన్నప్పటి నుంచి చదువులో మేటి. పదిలో 9.7 గ్రేడు సాధించి, ట్రిపుల్ ఐటీకి ఎంపికై, బీటెక్ పూర్తి చేసింది. 2019లో ఆమెరికాకు చెందిన నాసా సంస్థ నిర్వహించే ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్‌కు ఎంపికైంది. ఈ సమ్మిట్‌కు 30వేల ప్రాజెక్టుల్లో 100 మాత్రమే ఎంపిక చేస్తారు. తన సోదరి తులసీశ్యామలతో విష్ణుజ్యోతి కలిసి రూపొందించిన ప్రాజెక్టు ఎంపికైంది. దీంతో ఆ సమ్మిట్‌లో పాల్గొనగలిగింది. ఇంటర్నేషనల్ ఇండో నార్డియాక్ సమ్మిట్ (ఐనాక్)లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించింది. గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్ఈ)లో 340కి 305 మార్కులు సాధించింది. ఇంటర్నేషనల్ ఇంగ్లి్లషు లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్)లో 9కి 6.5 పాయింట్లు సాధించింది. అమెరికాలోని న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేసే అవకాశం లభించింది. ఈమె ప్రతిభకు ముగ్దులైన దాతల తోడ్పాటుతో ప్రస్తుతం న్యూజెర్సీలో ఎంఎస్ చేస్తోంది. ప్రతిభకు ఏదీ అడ్డుకాదని నిరూపిస్తోంది. ఒంటరిగానే జాతీయ స్థాయికి... సాక్షి, అమలాపురం: పదేళ్ల క్రితం దురదృష్టవశాత్తూ నా న్న దూరమయ్యాడు. ఐదారేళ్ల క్రితం ఒక ప్రమాదంలో కాలికి బలమైన గాయమైంది. అయినా ఆ యువతి ఆ త్మవిశ్వాసం ముందు ఎదురైన సవాళ్లే చిన్నబోయాయి. ముమ్మిడివరానికి చెందిన యెండూరి లలితాదేవి తా ను మాత్రం చిన్నప్పుడు కలలుగన్నట్టు జాతీయ స్థా యి వాలీబాల్ క్రీడాకారిణిగా ఎంపికవుతోంది. ప్రసుత్తం రాజమ హేంద్రవరంలో ఉపాధి కోసం ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకున్న లలితా బీచ్ వాలీబాల్‌లో ఆంధ్రాజట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. 8వ తరగతి నుంచి తాను చదువుకున్న ముమ్మిడివరం ఉన్నత పాఠశాల లో వాలీబాల్ క్రీడ ఆరంభించిన లలితా దేవి తరువాత కాలంలో అంచెలంచెలుగా ఎదిగింది. తల్లి ప్రోత్సాహం.. కోచ్‌ల పర్యవేక్షణలో వాలీబాల్‌లో రాటుదేలింది. ఇప్పటి వరకు బీచ్ వాలీబాల్‌లో రెండుసార్లు జాతీయ పోటీలకు, వాల్‌బాల్‌లో తొమ్మిదిసార్లు జాతీయ పోటీలకు, రెండుసార్లు జాతీయ గేమ్స్‌కు ఎంపికైంది. ఆమె సాధిస్తున్న విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ‘వాలీబాల్ ఆడిన తొలి రోజుల్లో కష్టంగా అనిపించేది. ఒకసారి ఆ ఆటను ప్రేమించడం మొదలు పెట్టాక వెనుతిరిగి చూడలేదు. కాలికి గాయం అయినప్పుడు గేమ్‌కు దూరమవుతానని భయపడినా పట్టుదలతో సాధన చేసి గాయాన్ని అధిగమించాన’ని లలితాదేవి చెబుతోంది. కైవల్య ప్రతిభకు ఆకాశమే హద్దు నిడదవోలు : వ్యొమగామి కావడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతోందీ బాలిక. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మీ దంపతుల మొదటి సంతానం కైవల్య. ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా ఇటీవల తణుకులో నిర్వహించిన క్విజ్, వక్తృత్వం, సైన్స్ ఫెయిర్లలో ప్రథమ స్ధానాన్ని కైవసం చేసుకుంది. ఇస్రో, నాసాకు అనుబంధ సంస్థ స్పేస్ స్పోర్ట్స్ ఇండియా ఫౌండేషన్ (ఢిల్లీ) నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది. వచ్చే మే నెలలో జరగనున్న నాసా ఒలింపియాడ్ పరీక్షకు అర్హత సాధించింది. ఇటీవల విశాఖలో సముద్ర శాస్త్రవేత్తల సమావేశంలో సముద్రాల పరిరక్షణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఇచ్చింది. స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ (న్యూఢిల్లీ) అంబాసిడర్ బృంద సభ్యులుగా చిన్నతనంలోనే కైవల్యరెడ్డి ఎంపికైంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనమికల్ సెర్ప్ కొలబ్రేషన్ సహకారంతో నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఆస్టరాయిడ్‌ను గుర్తించింది. ఇష్టమైన రంగంలో కష్టపడాలి తుని: ప్రస్తుత సమాజంలో బాలికలు అన్ని రంగాల్లోనూ నైపుణ్యంతో దూసుకుపోతున్నారు. విద్య,ఉద్యోగ, క్రీడా రంగాల్లో తమదైన ముద్ర కనబరుస్తున్నారని చెస్ క్రీడాకారిణి బి.ప్రత్యూష అన్నారు. ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా ఆమె అనుభవాలను ఇలా వివరించారు... చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న చదరంగం మహిళా గ్రాండ్ మాస్టర్ స్థాయికి తీసుకువెళ్లింది. జాతీయ,అంతర్జాతీయ వేదికలపై ఎంతోమంది ప్రముఖ చెస్ క్రీడాకారులతో పోటీపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. ప్రతిభ ఉంటే ఏదైనా సాధించడం సాధ్యమని నా అనుభవం నేర్పింది. పాఠశాల విద్య నుంచి కళాశాల వరకు నా ప్రయాణం సాగింది. తల్లిదండ్రులు, గురువులు అందించిన çస్ఫూర్తి అంతర్జాతీయ మహిళా గ్రాండ్ మాస్టర్ స్థాయికి తీసుకువెళ్లింది. ప్రతి బాలికా తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి. తుని మండలం ఎస్.అన్నవరానికి చెందిన నేను ఇంతటి స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఒడిదొడుకులు చూశాను. ప్రస్తుతం అకాడమి ద్వారా ఎంతోమంది క్రీడాకారులకు చదరంగంలో శిక్షణ ఇస్తున్నాను’ అని వివరించారు. చిట్టితల్లి చదువుకు జగనన్న సాయం కపిలేశ్వరపురం/రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థ బాలికా విద్యలో నాణ్యతను పెంచేందుకు దోహదపడుతోంది. విద్యార్థుల డ్రాపౌట్లు, మధ్యాహ్న భోజనం తనిఖీ, ఆహార నాణ్యత, మరుగుదొడ్లలో పరిశుభ్రత, తదితర అంశాలను సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ పర్యవేక్షిస్తున్నారు. గ్రామ మహిళా పోలీస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరుతో సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈవ్ టీజింగ్, పోక్సో చట్టం, బాల్య వివాహాలు నిరోధక చట్టాలపై ప్రాధాన్యతను వివరిస్తున్నారు. డ్రాప్ అవుట్ల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా బడికి పంపుతున్న చిన్నారి తల్లి ఖాతాకు రూ.15వేలు సాయమందిస్తుంది. గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా చేరిన విద్యార్థుల్లో బాలికలే అధికం. ఆడపిల్లలను ఆదిలోనే అంతం చేసే లింగ నిర్ధారణ పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. కాకినాడలో 0–6 నెలల శిశువుల సంరక్షణ కోసం శిశుగృహ, రాజమహేంద్రవరంలో 6–12 సంవత్సరాల బాలల సంరక్షణ కోసం బాలసదన్ నిర్వహిస్తోంది. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ పర్యవేక్షణలోని పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని 84 హాస్టళ్లు బాలికలకు బాసటగా నిలుస్తున్నాయి. ఆడపిల్లలను ఆపదలో ఆదుకునే దిశ యాప్‌పై పోలీసు అనుబంధ శాఖల సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు మొబైల్స్‌లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. గడచిన ఆరునెలల్లో కాకినాడలో 4,75,005, తూర్పుగోదావరి జిల్లాలో 2,38,944, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 1,34,671 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. బహిర్గతం చేసుకోలేని సమస్యలను తెలిపేందుకు పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం బాక్సులు ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్ 1098 బాల్య వివాహాల కట్డడి బాలికా వికాసానికి దోహదపడుతోంది. ఇలాంటి సంఘటనపై సమాచారం అందించాలని ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్ 1098 ఏర్పాటు చేసింది. సంవత్సరం అడ్డుకున్న బాల్య వివాహాలు 2018–19 185 2019–20 162 2020–21 147 2021–22 63 -
మీరూ కావచ్చు.. ఒక్కరోజు బ్రిటిష్ హైకమిషనర్!
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ హైకమిషనర్‌గా పనిచేయాలని ఉందా?.. అయితే ఒక్క రోజు మాత్రమే. హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయం ఈ అవకాశం కలి్పస్తూ సోమవారం ప్రకటన జారీ చేసింది. దీనికి 18 నుంచి 23 ఏళ్ల వయసున్న యువతులు మాత్రమే అర్హులు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అర్హులైన యువతులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తుదారులు.. ‘యువజనం వాతావరణ మార్పుల్లాంటి సమస్యల పరిష్కారంలో ఏ రకంగా మెరుగైన మద్దతు ఇవ్వగలరు’అన్న అంశంపై నిమిషం నిడివి ఉన్న వీడియో తీసి ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రా మ్లో పోస్ట్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో@UKinIndiaMýకు ట్యాగ్ చేయడంతోపాటు # DayoftheGirl హ్యష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలి. సెప్టెంబర్ 28న విజేత వివరాలు వెల్లడి ‘భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలిక సాధికారతకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. యూకే ప్రభుత్వం ఇచ్చే ఛీవెనింగ్ ఫెలోషిప్‌లో 60 శాతం, స్కాలర్ షిప్‌ల్లో 52 శాతం మహిళలకు దక్కుతుండటం సంతోషదాయకం. ‘హై కమిషనర్ ఫర్ ఎ డే’ ద్వారా మహిళలు ఏదైనా సాధించగలరు అన్న అంశాన్ని చాటిచెప్పాలని నిర్ణయించాం’అని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ప్రకటనలో తెలిపారు. 2017 నుంచి బ్రిటిష్ హై కమిషన్ ‘హై కమిషనర్ ఫర్ ఎ డే’ను నిర్వహిస్తోందని, గత ఏడాది 18 ఏళ్ల చైతన్య వెంకటేశ్వరన్ దీనికి ఎంపికయ్యారని వివరించింది. దరఖాస్తుదారులందరి వివరాలను బ్రిటిష్ హైకమిషన్ నేతృత్వంలోని న్యాయనిర్ణేతలు పరిశీలించి ఒకరిని ఎంపిక చేస్తారని, సెప్టెంబర్ 28న విజేత వివరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తామని తెలిపారు. చదవండి: సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం ఒక్కొక్కరు ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలని, ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే ఆ వ్యక్తిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత వివరాలను వీడియోలో ఉంచరాదని పేర్కొన్నారు. విజేత ఒక రోజుపాటు ఢిల్లీలో బ్రిటిష్ హైకమిషనర్‌గా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన రవాణా, వసతి ఖర్చులను కమిషన్ భరించదు. విజేత ఇతర ప్రాంతాల వారైతే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఢిల్లీకి రావడం, బస చేయడం పూర్తిగా వారి బాధ్యతేనని ఎల్లిస్ స్పష్టం చేశారు. చదవండి: వైద్యుల తయారీలో అరవై ఏడు వసంతాలు -
హర్ ఎక్సెలెన్సీ: ఒకరోజు బ్రిటిష్ హై కమిషనర్
ఆడపిల్ల పుట్టింది. హర్ ఎక్సెలెన్సీ!! ఆకాశం పూలను వర్షించింది. మేఘాలు పల్లకీలయ్యాయి. లెఫ్ట్ రైట్.. లెఫ్ట్ రైట్.. దేశాల గౌరవ వందనం. ఎంబసీలకు విద్యుద్దీపాలు. గర్ల్ చైల్డ్.. సంతోషాల రాయబారి. స్నేహాల హై కమిషనర్. గోరు ముద్దల్లో కలిపి పెట్టేవి కావు జీవిత లక్ష్యాలు. పిల్లల్ని వీలైనన్ని కొత్త ప్రదేశాలకు తిప్పాలి. మనమేమీ చెయ్యి పట్టుకుని ప్రపంచ దేశాలు తిప్పక్కరలేదు. ప్రపంచంలో ఇలాంటివి ఉన్నాయని చెప్పి వదిలేస్తే వాళ్లే తెలుసుకుంటారు. అప్పుడే లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. చైతన్య ఢిల్లీ విద్యార్థిని. పద్దెనిమిదేళ్లు. ఈ మధ్యే కాలేజ్ చదువు పూర్తయింది. స్కాలర్‌షిప్‌తో అమెరికన్ యూనివర్సిటీలో (పేరే ‘అమెరికన్ యూనివర్సిటీ’, వాషింగ్టన్లో ఉంది) ఇక్కడి నుంచే డిగ్రీలో చేరింది. ‘ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్; సర్టిఫికెట్ ప్రోగ్సామ్స్ ఇన్ అడ్వాన్స్డ్ లీడర్షిప్ స్టడీస్; పొలిటికల్ థాట్’ అనే ఐదారు సబ్జెక్టులు కలిసిన డిగ్రీ. చిన్నప్పుడు వాళ్ల ఇంటి దగ్గరలో బ్రిటిష్ లైబ్రరీ ఉండేది. ఒకసారి ఆమె తండ్రి ఆ లైబ్రరీకి తీసుకెళ్లాడు. ఆ ప్రపంచం నచ్చింది చైతన్యకు. అప్పట్నుంచీ ఆమె బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లని రోజు దాదాపుగా లేనే లేదు. అయితే తను ఒకనాటికి బ్రిటిష్ హై కమిషనర్‌గా విధులను నిర్వహించబోతానని మాత్రం ఆమె ఊహించలేదు! ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయంలో మొన్న బుధవారం ‘ఒకరోజు హై కమిషనర్’ గా విధులు నిర్వహించింది చైతన్య. రోజూ ఉండే యాక్టింగ్ కమిషనర్ జాన్ థామ్సన్ ఆ ఒక్కరోజు చైతన్యకు డిప్యూటీగా వ్యవహరించారు. ఒక్కరోజులోనే చైతన్య చాలా పనులు చక్కబెట్టింది! (చక్కబెట్టారు అనాలేమో.. హై కమిషనర్ కదా). హై కమిషన్ కార్యాలయంలోని వివిధ విభాగాల ప్రధాన అధికారులలో చైతన్య సమావేశం అయ్యారు. సీనియర్ మహిళా పోలీసు అధికారులతో సంభాషించారు. ప్రెస్‌మీట్ పెట్టారు. యువతుల కోసం ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. తెలంగాణ, మధ్యప్రదేశ్ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ‘ఆనందబజార్’ పత్రిక ఎడిటర్‌తో ముచ్చటించారు. బ్రిటన్ ఆహార వస్తూత్పత్తుల గొలుసు విక్రయ దుకాణాల సంస్థ ‘మార్క్స్ అండ్ స్పెన్సర్’ ఇండియా టీమ్‌తో కూర్చున్నారు. క్షణం తీరిక లేకుండా చైతన్య చురుగ్గా బాధ్యతలను నిర్వర్తించడం చూసి ఆశ్చర్యపోయిన జాన్ థామ్సన్.. డ్యూటీ టైమ్ ముగిశాక చైతన్యను అభినందించారు. ఈ ‘వన్ డే హై కమిషనర్’ అవకాశం కోసం దేశవ్యాప్తంగా 215 మంది యువతులు పోటీపడ్డారు. ‘ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో లైంగిక సమానత్వానికి అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్లు, కలిసొచ్చే అవకాశాలు ఎలా ఉంటాయని మీరు భావిస్తున్నారు?’ అనే ప్రశ్నకు చైతన్య ఇచ్చిన వీడియో ప్రెజెంటేషన్ ఎక్కువ మార్కులు సాధించి, ఆమెను విజేతను చేసింది. అయినా.. ఒక రోజుకు హై కమిషనర్‌గా ఉంటే ఏమౌతుంది అనే ఆలోచన రానివ్వకండి. మహిళలకు అధికారాన్ని ఇచ్చేందుకు ప్రపంచాన్ని సిద్ధం చెయ్యడం ఇది. స్త్రీ పురుష సమానత్వ సాధన కోసం. మానవాళి మేలు కోసం. చక్కగా మాట్లాడగలగాలి ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం వరల్డ్ ‘గర్ల్ చైల్డ్’ డే (అక్టోబర్ 11) సందర్భంగా 2017 నుంచి 18–23 సంవత్సరాల వయసు గల యువతులకు ఏటా ఒక రోజు హై కమిషనర్‌గా ఉండే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఒక నిముషం నిడివి మించని సెల్ఫ్ వీడియో ప్రెజెంటేషన్ రూపంలో ఎంట్రీలు ఆహ్వానిస్తోంది. ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్‌ని బట్టి వీడియోలో చక్కగా మాట్లాడగలగాలి. ప్రారంభ సంవత్సరంలో రుద్రాళీ పాటిల్ విజేతగా నిలిచింది. రుద్రాళీ నోయిడా ‘లా’ విద్యార్థిని. ‘బాలికల హక్కులు–సమాజంలో మార్పు తెచ్చేందుకు రెండు పరిష్కార మార్గాలు’ అనేది ఆ ఏడాది అంశం. 45 మందితో పోటీ పడి రుద్రాళీ ఆ అవకాశం దక్కించుకుంది. 2018లో ఈషా బహాల్ గెలుపొందింది. ‘స్త్రీ, పురుష సమానత్వం అంటే మీ దృష్టిలో ఏమిటి?’ అనే అంశంలో 58 మంది పోటీదారులను ఈషా నెగ్గుకొచ్చింది. ఆమెది కూడా నోయిడానే. డిగ్రీ విద్యార్థిని. 2019లో ఈ అవకాశం ఆయేషా ఖాన్‌కు లభించింది. ఆమెది గోరఖ్‌పూర్, పీజీ విద్యార్థిని. ‘లైంగిక సమానత్వం అవసరం ఏమిటి?’ అనే అంశంపై ఆయేషా దాదాపు వందమంది ప్రత్యర్థులను దాటి హై కమిషనర్ అయ్యే అవకాశం సాధించింది. -
శ్వేత.. వన్డే కమిషనర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అప్సా ప్లాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో విద్యార్థిని శ్వేత ఒక్క రోజు జంటనగరాల సంయుక్త కార్మిక శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించింది. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలోని గుండా ఈశ్వరయ్య ప్రభుత్వ పాఠశాలలో శ్వేత 9వ తరగతి చదువుతోంది. తాను ఒక్క రోజు కమిషనర్‌గా విధులు నిర్వహించడం చాలా సంతోషానిచ్చిందని తెలిపింది. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతాధికారిగా స్థిరపడి ప్రజలకు సేవ చేస్తానని వివరించింది. జంటనగరాల సంయుక్త లేబర్ కమిషనర్ డాక్టర్ ఇ.గంగాధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగడానికి ఇలాంటి వారికి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఏఎల్ఓ స్థాయి అధికారులు ప్రభాకర్, పవన్, అప్సా పద్మ, బస్వరాజ్, గౌరి, శంకర్, పట్నాయక్, రాంప్రసాద్ పాల్గొన్నారు. ‘బాలానందం’ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం కాచిగూడ: ఆంధ్ర బాలానంద సంఘం 80వ వార్షికోత్సవం సందర్భంగా జంటనగరాల్లోని బాలబాలికలకు వివిధ అంశాల్లో ప్రతిభా పాట వ పోటీలు నిర్వహిస్తున్నామని ఆసక్తి గల బాల బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బాలానందం కార్యదర్శి జేవీ కామేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులన్నారు. వివరాలకు నారాయణగూడలోని బాలనంద సంఘం కార్యాలయంలో నేరుగా గాని, ఫోన్ నెంబర్ 040– 27561443లో సంప్రదించాలని సూచించారు. -
మమల్ని బతకనివ్వండి ప్లీజ్!
మగపిల్లవాడు ప్లస్ ఆడపిల్ల మైనస్. ఇదే భావన తరాలు మారుతున్న చాలా మంది మెదళ్లలో తిరుగాడుతునే ఉంది. అందుకే హైటెక్ యుగమైన ఇంతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆడబిడ్డ అయినందుకు అమ్మ కడుపులోనే అంతమవక తప్పడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న కష్టాలను ఈ వీడియోలో చూద్దాం. -
ఒక్క రోజు బ్రిటిష్ హై కమిషనర్‌గా భారత విద్యార్థిని
న్యూఢిల్లీ : ఒకే ఒక్కడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక్క రోజు సీఎంగా విధులు నిర్వర్తిస్తాడు. ఆ సీన్ దాదాపు అందరికి గుర్తుండేఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజ జీవితంలో చోటుచేసుకుంది. ఓ భారతీయ విద్యార్థిని ఒక్క రోజు బ్రిటీష్ హై కమిషనర్ గా పాటు విధులు నిర్వర్తించింది. ఆమె పేరు ఈషా బహల్. ప్రస్తుతం ఈషా.. నోయిడా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ విభాగంలోని కోర్సు చేస్తోంది. కాగా.. అనుకోకుండా ఆమె ఒక్కరోజు బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అదెలా అంటారా.. అంతర్జాతీయ బాలికల దినోత్సవం(అక్టొబర్ 11) పురస్కరించుకొని బ్రిటీష్ హై కమిషన్ 18నుంచి 23ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిలకు ఓ పోటీని నిర్వహించారు. మీ దృష్టిలో లింగ సమానత్వానికి అర్థం ఏమిటి.. అనే ప్రశ్నకి సమాధానంగా ఓ చిన్న వీడియో రూపొందించాలని పంపాలని ప్రకటించింది. అందులో గెలిచినవారికి ఒక్కరోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు.ఈషాతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 58మంది అమ్మాయిలు వీడియోలను పంపించారు. కాగా.. అలా పంపిన వీడియోల్లో ఈషా విజయం సాధించింది. దీంతో ఆమెకు ఒక్క రోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశం లభించింది. దీనిపై ఈషా మాట్లాడుతూ..‘ బ్రిటీష్ హైకమిషనర్ గా ఒక్కరోజు పనిచేయడం చాలా గొప్పగా అనిపించింది. ఇది ఒక అరుదైన అనుభూతి. దీని వల్ల యూకేకీ భారత్ కి మధ్యగల సంబంధాల గురించి కొంత తెలుసుకోగలిగాను. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొంది. ఇక వాస్తవ భారత బ్రిటీష్ హైకమిషనర్ డొమినిక్ ఆస్కిత్ మాట్లాడుతూ.. భారత మహిళ హక్కుల చర్చకు ఈ పోటీ ఓ వెదికగా ఉందని నమ్ముతున్నారు. విద్యార్థినీలు పంపిన వీడియోలు చాలా బాగున్నాయి. ఈషా పంపిన వీడియో ఆకర్షనీయంగా, ఆలోచించే విధంగా ఉన్నాయి. ఆ వీడియో బాలిక హక్కుల గురించి చక్కగా వివరించింది. ఒక్కరోజు బ్రిటిష్ హై కమిషనర్‌గా ఎన్నికైన ఈషాకి శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. -
'లింగ వివక్షకు అంతం పలకండి'
న్యూఢిల్లీ: ఇప్పటికైనా లింగ వివక్ష మానుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మంగళవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆయన జాతి యావత్తుకు సందేశాన్ని ఇచ్చారు. బాలికల విషయంలో చిన్నచూపును మానుకోవాలని ఉపదేశించారు. 'చదువుల నుంచి క్రీడల వరకు ప్రతి చోట అమ్మాయిలు తమ ముద్ర వేస్తున్నారు. వారు చేస్తున్న సేవలకు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నా వందనాలు. లింగ వివక్ష లేని సమాజం కోసం మనమంతా కలిసి కట్టుగా ముందుకు సాగాలి. బాలికలు కూడా అన్ని రంగాల్లో దూసుకెళ్లేందుకు అవకాశాలున్న నేటి రోజుల్లో లింగం ఆధారంగా వారిపై వివక్ష చూపకుండా మనమంతా కలిసి నడవాలి' అని మోదీ చెప్పారు.