న్యూఢిల్లీ : ఒకే ఒక్కడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక్క రోజు సీఎంగా విధులు నిర్వర్తిస్తాడు. ఆ సీన్ దాదాపు అందరికి గుర్తుండేఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజ జీవితంలో చోటుచేసుకుంది. ఓ భారతీయ విద్యార్థిని ఒక్క రోజు బ్రిటీష్ హై కమిషనర్ గా పాటు విధులు నిర్వర్తించింది. ఆమె పేరు ఈషా బహల్.
ప్రస్తుతం ఈషా.. నోయిడా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ విభాగంలోని కోర్సు చేస్తోంది. కాగా.. అనుకోకుండా ఆమె ఒక్కరోజు బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అదెలా అంటారా..
అంతర్జాతీయ బాలికల దినోత్సవం(అక్టొబర్ 11) పురస్కరించుకొని బ్రిటీష్ హై కమిషన్ 18నుంచి 23ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిలకు ఓ పోటీని నిర్వహించారు. మీ దృష్టిలో లింగ సమానత్వానికి అర్థం ఏమిటి.. అనే ప్రశ్నకి సమాధానంగా ఓ చిన్న వీడియో రూపొందించాలని పంపాలని ప్రకటించింది.
అందులో గెలిచినవారికి ఒక్కరోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు.ఈషాతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 58మంది అమ్మాయిలు వీడియోలను పంపించారు. కాగా.. అలా పంపిన వీడియోల్లో ఈషా విజయం సాధించింది. దీంతో ఆమెకు ఒక్క రోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశం లభించింది.
దీనిపై ఈషా మాట్లాడుతూ..‘ బ్రిటీష్ హైకమిషనర్ గా ఒక్కరోజు పనిచేయడం చాలా గొప్పగా అనిపించింది. ఇది ఒక అరుదైన అనుభూతి. దీని వల్ల యూకేకీ భారత్ కి మధ్యగల సంబంధాల గురించి కొంత తెలుసుకోగలిగాను. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొంది.
ఇక వాస్తవ భారత బ్రిటీష్ హైకమిషనర్ డొమినిక్ ఆస్కిత్ మాట్లాడుతూ.. భారత మహిళ హక్కుల చర్చకు ఈ పోటీ ఓ వెదికగా ఉందని నమ్ముతున్నారు. విద్యార్థినీలు పంపిన వీడియోలు చాలా బాగున్నాయి. ఈషా పంపిన వీడియో ఆకర్షనీయంగా, ఆలోచించే విధంగా ఉన్నాయి. ఆ వీడియో బాలిక హక్కుల గురించి చక్కగా వివరించింది. ఒక్కరోజు బ్రిటిష్ హై కమిషనర్‌గా ఎన్నికైన ఈషాకి శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment