dominic asquith
-
పెరగనున్న బ్రిటన్ వీసాలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: భారతీయులకు లభించే బ్రిటన్ వీసాలు పెరిగి భారత్–యూకే వ్యాపార, విద్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాల లక్ష్యంతో సరిగ్గా ఏడాది కింద రెండు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందపు కార్యాచరణ ప్రారంభమైందని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ అశ్క్విత్ తెలిపారు. మరిన్ని వీసాల లభ్యత, సాంకేతిక క్లస్టర్ల ఏర్పాటు వంటివి ఈ దిశలో ఒక ముందడుగు కాగలవని అన్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ)లో ఇప్పటికే ఇక్కడున్న చొరవ దృష్ట్యా, ఈ భాగస్వామ్యాన్ని మరింత ఫలవంతం చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన అశ్క్విత్ తనను కలిసిన పాత్రికేయులతో కాసేపు ఇష్టాగోష్ఠి జరిపారు. ఏడాది కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ లండన్ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సాంకేతిక సహకారం–వాణిజ్య విస్తరణతో ఉభయ దేశాల పరస్పర ప్రయోజనం ఇందులో ప్రాధాన్యతాంశమని అశ్క్విత్ పేర్కొన్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రవాణా వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యాల్ని భారత్‌లో విస్తరించడానికి ఇప్పటికే బ్రిటన్ వ్యాపార–వాణిజ్య సంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తాము కాల్టెక్ హబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా, ఇక్కడ వినూత్న తరహాలో వచ్చిన అంకుర సంస్థల(స్టార్టప్స్)తో భాగస్వామ్యాలకు బ్రిటన్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. దక్షిణాదిలో హైదరాబాద్ మరింత ప్రయోజనకారి కాగలదని అంచనా వేశారు. బ్రిటన్ నైపుణ్యాల్ని, సాంకేతిక సహకారాన్ని గరిష్టంగా వినియోగించుకునేలా ఇక్కడి స్టారప్స్‌తో అనుసంధానించే నైపుణ్య మానవ వనరుల్ని సమకూర్చడం ద్వారా తెలంగాణ ‘టీ–హబ్’కీలక పాత్రదారి కానుందని అభిప్రాయపడ్డారు. చమురు కోసం సముద్ర గర్భాన్ని తొలిచే సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో బ్రిటన్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చమురు–సహజవాయు రంగంలో పనిచేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లోనూ పెరగనున్న వీసాలు ఐరోపా సంఘం (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగుతున్న నేపథ్యంలో కొత్త వలసల విధానం రూపుదిద్దుకుంటోందని అశ్క్విత్ తెలిపారు. దాంతో భాగస్వామ్య వృద్ధిలో, విద్య–ఉద్యోగావకాశాల్లో భారత్ వంటి దేశాలకు మున్ముందు చక్కని అవకాశాలుం టాయని అన్నారు. ఐటీ, వైద్య రంగంలో భారత్ దృఢంగా ఉందని వ్యాఖ్యానించారు. భారత్ నుంచి యూకేలో ఉన్నత విద్యకు వెళ్లే వారిప్పుడు 37 శాతం పెరిగారని చెప్పారు. గత సంవత్సరం ఈ వృద్ధి రేటు 17 శాతంగా ఉందన్నారు. ప్రతి 10 మందిలో 9 మంది విద్యార్థులకు వీసాలు లభించే పరిస్థితి ఉందన్నారు. యూకే విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని భారత విద్యార్థులు గరిష్టంగా వినియోగించుకోవాలన్నదే తమ కోరికని, పెరుగుతున్న సంఖ్యే దానికి నిదర్శనమన్నారు. వాణిజ్య, విద్య, ఉద్యోగ వీసాల్లో వృద్ధి వల్ల బ్రిటన్ సందర్శించే భారతీయుల సంఖ్య పెరుగుతుందని, ఇది పరస్పర వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల్ని మెరుగుపరుస్తుందని అన్నారు. రానున్న క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగా కూడా బ్రిటన్‌కు భారతీయ సందర్శకులు పెరుగుతారని అభిప్రాయపడ్డారు. 2018లో భారత్‌కు చెందిన నైపుణ్యం గల ఉద్యోగులు, సిబ్బందికి 55,000 బ్రిటన్ వీసాలు లభించాయని, మిగతా అన్ని దేశాలకు కలిపి దాదాపు ఇన్నే లభించాయని గుర్తు చేశారు. -
‘స్టార్టప్స్‌తో భాగస్వామ్యాలకు బ్రిటన్ సంస్థల ఆసక్తి’
(ఆర్. దిలీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సాక్షి): భారతీయులకు లభించే బ్రిటన్ వీసాలు పెరిగి భారత్–యూకే వ్యాపార, విద్య, సాంస్కతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాల లక్ష్యంతో సరిగ్గా ఏడాది కింద రెండు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందపు కార్యాచరణ ప్రారంభమైందని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ అశ్క్విత్ తెలిపారు. మరిన్ని వీసాల లభ్యత, సాంకేతిక క్లస్టర్ల ఏర్పాటు వంటివి ఈ దిశలో ఒక ముందడుగు కాగలవని ఆయన పేర్కొన్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ)లో ఇప్పటికే ఇక్కడున్న చొరవ దష్ట్యా, ఈ భాగస్వామ్యాన్ని మరింత ఫలవంతం చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన అశ్క్విత్ తనను కలిసిన పాత్రికేయులతో కాసేపు ఇష్టాగోష్ఠి జరిపారు. ఏడాది కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ లండన్ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే! సాంకేతిక సహకారం–వాణిజ్య విస్తరణతో ఉభయదేశాల పరస్పర ప్రయోజనం ఇందులో ప్రాధాన్యత అంశమని అశ్క్విత్ అన్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రవాణా వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యాల్ని భారత్‌లో విస్తరించడానికి ఇప్పటికే బ్రిటన్ వ్యాపార–వాణిజ్య సంస్థలు సంసిద్దంగా ఉన్నాయన్నారు. తాము కాల్టెక్ హబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా, ఇక్కడ వినూత్న తరహాలో వచ్చిన అంకుర సంస్థల(స్టార్టప్స్)తో భాగస్వామ్యాలకు బ్రిటన్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. దక్షిణాదిలో హైదరాబాద్ మరింత ప్రయోజనకారి కాగలదని అంచనా వేశారు. బ్రిటన్ నైపుణ్యాల్ని, సాంకేతిక సహకారాన్ని గరిష్టంగా వినియోగించుకునేలా ఇక్కడి అంకుర సంస్థలతో అనుసంధానించే నైపుణ్య మానవవనరుల్ని సమకూర్చడం ద్వారా తెలంగాణ ‘టీ–హబ్’ కీలకపాత్రదారి కానుందన్నారు. చమురు కోసం సముద్ర గర్భాన్ని తొలిచే సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో బ్రిటన్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చమురు–సహజవాయు రంగంలో పనిచేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విద్య–ఉద్యోగ రంగంలోనూ పెరగనున్న వీసాలు ఐరోపా సంఘం (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగుతున్న నేపథ్యంలో కొత్త వలసల విధానం రూపుదిద్దుకుంటోందన్నారు. దాంతో, భాగస్వామ్య వృద్ధిలో, విద్య–ఉద్యోగావశాల్లో భారత్ వంటి దేశాలకు మున్ముందు చక్కని అవకాశాలుంటాయని హైకమిషనర్ అశ్క్విత్ అన్నారు. ఐటీ, వైద్య రంగంలో భారత్ ధృడంగా ఉందని పేర్కొన్నారు. భారత్ నుంచి యూకేలో ఉన్నత విద్యకు వెళ్లే వారిప్పుడు 37 శాతం పెరిగారన్నారు. గత సంవత్సరం ఈ వద్ధి రేటు 17 శాతమన్నారు. ప్రతి 10 మందిలో 9 మంది విద్యార్థులకు వీసాలు లభించే పరిస్థితి ఉందన్నారు. యూకే విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని భారత విద్యార్థులు గరిష్టంగా వినియోగించుకోవాలన్నదే తమ కోరికని, పెరుగుతున్న సంఖ్య దానికి నిదర్శనమని పేర్కొన్నారు. వాణిజ్య, విద్యా, ఉద్యోగ వీసాల్లో వృద్ధి వల్ల బ్రిటన్ సందర్శించే భారతీయుల సంఖ్య పెరుగుతుందని, ఇది పరస్పర వాణిజ్య, సాంస్కతిక సంబంధాల్ని మెరుగుపరుస్తుందన్నారు. రానున్న క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా కూడా బ్రిటన్‌కు భారతీయ సందర్శకులు పెరుగుతారన్నారు. 2018లో భారత్‌కు చెందిన నైపుణ్యంగల ఉద్యోగులు–సిబ్బందికి 55,000 బ్రిటన్ వీసాలు లభించాయని, మిగతా అన్ని దేశాలకు కలిపి దాదాపు ఇన్నే లభించాయని గుర్తు చేశారు. -
ఒక్క రోజు బ్రిటిష్ హై కమిషనర్‌గా భారత విద్యార్థిని
న్యూఢిల్లీ : ఒకే ఒక్కడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక్క రోజు సీఎంగా విధులు నిర్వర్తిస్తాడు. ఆ సీన్ దాదాపు అందరికి గుర్తుండేఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజ జీవితంలో చోటుచేసుకుంది. ఓ భారతీయ విద్యార్థిని ఒక్క రోజు బ్రిటీష్ హై కమిషనర్ గా పాటు విధులు నిర్వర్తించింది. ఆమె పేరు ఈషా బహల్. ప్రస్తుతం ఈషా.. నోయిడా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ విభాగంలోని కోర్సు చేస్తోంది. కాగా.. అనుకోకుండా ఆమె ఒక్కరోజు బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అదెలా అంటారా.. అంతర్జాతీయ బాలికల దినోత్సవం(అక్టొబర్ 11) పురస్కరించుకొని బ్రిటీష్ హై కమిషన్ 18నుంచి 23ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిలకు ఓ పోటీని నిర్వహించారు. మీ దృష్టిలో లింగ సమానత్వానికి అర్థం ఏమిటి.. అనే ప్రశ్నకి సమాధానంగా ఓ చిన్న వీడియో రూపొందించాలని పంపాలని ప్రకటించింది. అందులో గెలిచినవారికి ఒక్కరోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు.ఈషాతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 58మంది అమ్మాయిలు వీడియోలను పంపించారు. కాగా.. అలా పంపిన వీడియోల్లో ఈషా విజయం సాధించింది. దీంతో ఆమెకు ఒక్క రోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశం లభించింది. దీనిపై ఈషా మాట్లాడుతూ..‘ బ్రిటీష్ హైకమిషనర్ గా ఒక్కరోజు పనిచేయడం చాలా గొప్పగా అనిపించింది. ఇది ఒక అరుదైన అనుభూతి. దీని వల్ల యూకేకీ భారత్ కి మధ్యగల సంబంధాల గురించి కొంత తెలుసుకోగలిగాను. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొంది. ఇక వాస్తవ భారత బ్రిటీష్ హైకమిషనర్ డొమినిక్ ఆస్కిత్ మాట్లాడుతూ.. భారత మహిళ హక్కుల చర్చకు ఈ పోటీ ఓ వెదికగా ఉందని నమ్ముతున్నారు. విద్యార్థినీలు పంపిన వీడియోలు చాలా బాగున్నాయి. ఈషా పంపిన వీడియో ఆకర్షనీయంగా, ఆలోచించే విధంగా ఉన్నాయి. ఆ వీడియో బాలిక హక్కుల గురించి చక్కగా వివరించింది. ఒక్కరోజు బ్రిటిష్ హై కమిషనర్‌గా ఎన్నికైన ఈషాకి శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. -
చంద్రబాబుతో బ్రిటిష్ హైకమిషనర్ భేటీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బ్రిటిష్ హైకమిషనర్ డొమ్నిక్ ఆస్కిత్ గురువారం విజయవాడలో భేటీయ్యారు. ఈ భేటీలో అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులపై బ్రిటిష్ బృందం సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీ ట్రాన్స్పోర్ట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు డొమ్నిక్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.