British High Commissioner
-
‘బ్రిటిష్ హైకమిషనర్’గా 19 ఏళ్ల అమ్మాయి..!
19 సంవత్సరాల గౌతమ్ నిధి బ్రిటిష్ హైకమిషనర్ హోదాలో గంభీరంగా ఉపన్యసించింది. పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది. శాస్త్రవేత్తల నుంచి నవీన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. ఇది సరే, 19 సంవత్సరాల అమ్మాయి ‘బ్రిటిష్ హైకమిషనర్’ ఏమిటి! అని ఆశ్చర్య΄ోతున్నారా... అవును... ఇది అక్షరాల నిజం... అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ‘హై కమిషనర్ ఫర్ ఏ డే’ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీ కోసం దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన అమ్మాయిల నుంచి 140 అప్లికేషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం కర్ణాటకకు చెందిన గౌతమ్ నిధి(19) ‘భారత్‌లో ఒకరోజు బ్రిటిష్ హైకమిషనర్’గా ఎంపికైంది. గౌతమ్ నిధి ఢిల్లీలోని మిరాండ హౌజ్ కాలేజీలో హిస్టరీ, జాగ్రఫీలలో బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తోంది. స్కెచ్చింగ్, పద సంపద, సాంస్కృతిక దౌత్యం, విదేశాంగ విధానాలపై గౌతమ్‌కు ఆసక్తి. బ్రిటిష్ హైకమిషనర్‌గా గౌతమ్ నిధి ఒకరోజంతా తీరికలేనంత కార్యక్రమాలతో గడిపింది.యూకే–ఇండియా ద్వైపాక్షిక సంబంధాల వివరాల గురించి మాట్లాడడం ద్వారా ఆమె తొలి కార్యక్రమం మొదలైంది. దిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ని, సందర్శించిన గౌతమ్ దివ్యాంగులకు ఉపకరించే కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. ఆ తరువాత ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ’కి వెళ్లి మన దేశంలో వ్యాక్సిన్ల అభివృద్ధికి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంది. ప్రభుత్వ అధికారులు, పరిశ్రమలకు చెందిన వ్యక్తులతో రోజాంతా అనేక సమావేశాలు నిర్వహించింది.‘బ్రిటిష్ హైకమిషనర్ ఫర్ ఏ డే’గా ఉండడం మరచిపోలేని అద్భుతమైన జ్ఞాపకం. సోలార్ ఎనర్జీ నుంచి బయోటెక్నాలజీ వరకు సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన చేసుకునే అదృష్టం దక్కింది. సామాజిక ప్రయోజనాలకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది’ అంటుంది గౌతమ్ నిధి. ‘ఈరోజు నిధి నుండి నేర్చుకోవడం అద్భుతంగా ఉంది. యూకే–ఇండియాలలోని నవీన సాంకేతిక పరిజ్ఞానం నుంచి గ్లోబల్ చాలెంజ్‌లను స్వీకరించి దూసుకెళుతున్న యువతుల వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం’ అంటుంది మన దేశంలోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరూన్.(చదవండి: తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..) -
యూకే వీసా 15 రోజుల్లోనే: బ్రిటిష్ హైకమిషనర్ గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: భారతీయులకు యూకే తీపి కబురు చెప్పింది. వీసా నిరీక్షణ సమయాన్ని కూడా తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా 15 రోజుల్లో వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించనుంది. వీసాల జారీపై భారీ జాప్యం, ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరంతో పోల్చితే భారతీయ విద్యార్థుల సంఖ్య 89 శాతం పెరిగిందని భారతదేశంలోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ (అక్టోబర్ 18) ట్విటర్లో వెల్లడించారు. విజిటర్ వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడంపై దృష్టి సారించామని ట్విటర్లో షేర్ చేసిన ఒక వీడియోద్వారా తెలిపారు. అలాగే ఐటీ నిపుణుల వర్క్ వీసాల ఆలస్యాన్ని నివారించడం తోపాటు, జారీ ప్రక్రియను మరింత వేగంగా ప్రాసెస్ చేయనున్నామన్నారు. ఈ నిర్ణయం ఐటీ నిపుణుల తోపాటు, చాలామంది భారతీయులకు ఊరటనిస్తోంది. దీంతో పలువురు హర్షం ప్రకటిస్తున్నారు. 15 రోజుల టైమ్‌లైన్ చాలా ఉపశమనం కలిగిస్తుందని ఒక ట్విటర్ యూజర్ కమెంట్ చేశారు. షార్ట్ టర్మ్ స్టడీ విజిటర్ వీసా కోసం అప్లై చేసి 9 వారాలు అయినా ఇంకా రాలేదని మరో యూజర్ ఫిర్యాదు చేశారు. వీసా రాని కారణంగా యూనివర్సిటీలో ఫిజికల్ హాజరు గడువు దాటిపోవడంతో స్టడీని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇపుడిక మంచి జరుగుతుందని భావిస్తున్నారు. We are on track to get back to processing 🇮🇳 to 🇬🇧 #visa applications within our standard of 15 days. 👉 Student numbers ⬆️ by 89% since last year. 👉 Skilled workers visas bring processed faster 👉 Focus on improving visitor visa processing times. A long way come, more to go. pic.twitter.com/cjX26mRxs8 — Alex Ellis (@AlexWEllis) October 18, 2022 -
ఎమ్మెల్సీ కవితను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
సాక్షి, హైదరాబాద్: బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గారెత్ విన్ ఓవెన్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత, పలు అంశాలను చర్చించారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి, అభివృద్ధి అవకాశాలతో పాటు, పలు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చదవండి: (నాకు మాత్రమే తెలుసు ఎందుకుపోతున్నానో.. మరో జన్ముంటే మళ్లీ కలుద్దాం) -
మీరూ కావచ్చు, బ్రిటిష్ హైకమిషనర్!
సాక్షి, హైదరాబాద్: భారతీయ యువతుల్లారా.. ఒకరోజు కోసమైనా సరే, బ్రిటిష్ హైకమిషనర్ హోదాను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. అంతర్జాతీయ బాలికల దినోత్సవాల్లో భాగంగా భారతీయ మహిళకు ఒకరోజుపాటు హైకమిషనర్ హోదా కల్పించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడం, వేర్వేరు వర్గాలవారితో చర్చలు జరపడం, భారత్ –యూకే భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలగడం ఈ కార్యక్రమం ప్రత్యేకతలు. ఈ పోటీలో పాల్గొనేందుకు 18– 23 మధ్య వయసు గల యువతులు అర్హులు. ‘‘హైకమిషనర్ ఫర్ ద డే’’పోటీలో పాల్గొనదలచినవారు ‘ప్రజాజీవితంలో మీకు స్ఫూర్తినిచ్చే మహిళ ఎవరు? అందుకు కారణాలేమిటి?’’అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఒక నిమిషం వీడియో ద్వారా తెలపాల్సి ఉంటుంది. వీడియోను ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో @UKinIndia"‘ను ట్యాగ్ చేస్తూ ‘# DayoftheGir‘ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ షేర్ చేయాలి. ఆసక్తి కలవారు సెప్టెంబర్ రెండోతేదీ వరకూ వీడియోలను పంచుకోవచ్చు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’జరుపుకుంటున్న ఈ తరుణంలో ఒక భారతీయ యువతిని ఒకరోజు హైకమిషనర్‌గా నియమించే అవకాశం దక్కడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం యునైటెడ్ కింగ్డమ్తోపాటు భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రా«థమ్యాల్లో ఒకటి. ఈ దేశ యువతులు సత్తాచాటేందుకు ఇదో మంచి అవకాశం. దేశం నలుమూలల నుంచి యువతులు ఈ పోటీలో పాల్గొంటారని ఆశిస్తున్నా’’అని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఇల్లిస్ పేర్కొన్నారు. -
కోవిషీల్డ్‌కు యూకే ఓకే!
లండన్: కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నా సరే భారత్ నుంచి బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది. వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో భారత్ పేరును చేర్చింది. తాజా నిబంధనల ప్రకారం అక్టోబర్ 11 నుంచి యూకే వచ్చే భారత ప్రయాణికులు కోవిïÙల్డ్(లేదా బ్రిటన్ అనుమతించిన ఏదైనా టీకా) పూర్తి డోసులు తీసుకున్నట్లైతే క్వారంటైన్ తప్పనిసరి కాదు. భారత్, పాక్‌తో కలిపి 37 దేశాల పేర్లను వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో యూకే చేర్చింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న యూకే పౌరులతో సమానంగా ఈ దేశాల నుంచి వచ్చే అర్హులైన ప్రయాణికులను(టీకా డోసులు పూర్తి చేసుకున్నవారు) పరిగణిస్తారు. సదరు ప్రయాణికులు బ్రిటన్ ప్రయాణానికి పదిరోజుల ముందు యూకే ప్రకటించిన రెడ్ లిస్ట్ జాబితాలోని దేశాలను సందర్శించి ఉండకూడదు. అలాగే ప్రయాణానికి కనీసం 14 రోజుల ముందు నిరి్ధష్ట టీకా డోసులు పూర్తి చేసుకొని ఉండాలి. వీరికి క్వారంటైన్ మినహాయింపుతో పాటు యూకేలో కాలుమోపాక చేసే తప్పనిసరి టెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుంది. భారత టీకా సరి్టఫికేషన్‌ను యూకే అక్టోబర్ 11 నుంచి గుర్తించనుందని, ఇరు దేశాల మంత్రిత్వశాఖల చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ తెలిపారు. ఈ అంశంపై నెలరోజులుగా సహకారమందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
అక్కడికి వెళ్తే ఈ స్వీట్ తినడం మాత్రం మర్చిపోకండి.. అద్భుతం.!
ఢిల్లీకి వెళ్తే చోలే భచూరా రుచి చూడకుండ ఉండలేరు. చెన్నై మురుకులు, హైదరాబాద్ దమ్ బిర్యానీ తినందే అక్కడి నుంచి కదలరు భోజనప్రియులు. ఇంకా బెనారస్ లస్సీ, అమృత్సర్ జిలేబీ, అహ్మదాబాద్ డోక్లా, ముంబాయ్ వడాపావ్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. అలాగే దేశీ వంటకాల్లో కలకత్తా రసగుల్లా కూడా చాలా ఫేమస్ అండీ! ఇటీవల బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్ కోల్‌కతా సందర్శించారు. ఇంకేముంది అక్కడి ఫేమస్ స్వీట్లలో ఒకటైన రసగుల్లాను రుచి చూసేశారు. రసగుల్లాకి ఫిదా అయిపోయారు. దీని రుచిని గురించి తెల్పుతూ ట్విటర్లో పోస్ట్ కూడా పెట్టారు. ‘ఇండియాలోనే స్వీటెస్ట్ సిటీ అయిన కలకత్తాలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. కేసీ దాస్ ఔట్‌లెట్‌లోని ఫేమస్ స్వీట్లలో ఒకటైన రసగుల్లాను రుచిచూశాను’ అని బెంగాళీ భాషలో రాశారు. ముఖం మీద చిరునవ్వుతో మట్టిపాత్రలోని రసగుల్లాను తింటున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ స్వీట్‌ను రుచి చూడమనని రిఫర్ చేశారు కూడా. ఈ పోస్ట్‌ను చూసిన ఫాలోవర్లు, అభిమానులు మాత్రం కామెంట్ల రూపంలో తమ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది కోల్‌కతాలోని ఇతర ప్రసిద్ధ వంటకాలు, స్వీట్లను కూడా రుచి చూడమని కోరారు. తాజాగా ప్రముఖ పారిశ్రమిక వేత్త హర్ష్ గొయెంకా కూడా దేశంలోనే కోల్‌కతా స్ట్రీట్ ఫుడ్ బెస్ట్ అని ట్విటర్లో పేర్కొనడం విశేషం. చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!! ভারতের সবথেকে মিষ্টি শহর কলকাতায় এসে বড়োই আনন্দিত আমি। এখানকার এসপ্লানেডের কে. সি. দাসের আউটলেটে আমি চেখে দেখলাম দারুণ স্বাদের "বাংলার রসগোল্লা"। pic.twitter.com/m2tirphBML — Alex Ellis (@AlexWEllis) September 26, 2021 -
మీరూ కావచ్చు.. ఒక్కరోజు బ్రిటిష్ హైకమిషనర్!
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ హైకమిషనర్‌గా పనిచేయాలని ఉందా?.. అయితే ఒక్క రోజు మాత్రమే. హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయం ఈ అవకాశం కలి్పస్తూ సోమవారం ప్రకటన జారీ చేసింది. దీనికి 18 నుంచి 23 ఏళ్ల వయసున్న యువతులు మాత్రమే అర్హులు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అర్హులైన యువతులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తుదారులు.. ‘యువజనం వాతావరణ మార్పుల్లాంటి సమస్యల పరిష్కారంలో ఏ రకంగా మెరుగైన మద్దతు ఇవ్వగలరు’అన్న అంశంపై నిమిషం నిడివి ఉన్న వీడియో తీసి ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రా మ్లో పోస్ట్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో@UKinIndiaMýకు ట్యాగ్ చేయడంతోపాటు # DayoftheGirl హ్యష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలి. సెప్టెంబర్ 28న విజేత వివరాలు వెల్లడి ‘భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలిక సాధికారతకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. యూకే ప్రభుత్వం ఇచ్చే ఛీవెనింగ్ ఫెలోషిప్‌లో 60 శాతం, స్కాలర్ షిప్‌ల్లో 52 శాతం మహిళలకు దక్కుతుండటం సంతోషదాయకం. ‘హై కమిషనర్ ఫర్ ఎ డే’ ద్వారా మహిళలు ఏదైనా సాధించగలరు అన్న అంశాన్ని చాటిచెప్పాలని నిర్ణయించాం’అని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ప్రకటనలో తెలిపారు. 2017 నుంచి బ్రిటిష్ హై కమిషన్ ‘హై కమిషనర్ ఫర్ ఎ డే’ను నిర్వహిస్తోందని, గత ఏడాది 18 ఏళ్ల చైతన్య వెంకటేశ్వరన్ దీనికి ఎంపికయ్యారని వివరించింది. దరఖాస్తుదారులందరి వివరాలను బ్రిటిష్ హైకమిషన్ నేతృత్వంలోని న్యాయనిర్ణేతలు పరిశీలించి ఒకరిని ఎంపిక చేస్తారని, సెప్టెంబర్ 28న విజేత వివరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తామని తెలిపారు. చదవండి: సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం ఒక్కొక్కరు ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలని, ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే ఆ వ్యక్తిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత వివరాలను వీడియోలో ఉంచరాదని పేర్కొన్నారు. విజేత ఒక రోజుపాటు ఢిల్లీలో బ్రిటిష్ హైకమిషనర్‌గా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన రవాణా, వసతి ఖర్చులను కమిషన్ భరించదు. విజేత ఇతర ప్రాంతాల వారైతే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఢిల్లీకి రావడం, బస చేయడం పూర్తిగా వారి బాధ్యతేనని ఎల్లిస్ స్పష్టం చేశారు. చదవండి: వైద్యుల తయారీలో అరవై ఏడు వసంతాలు -
100 నగరాలు కన్నా.. విశాఖే మిన్న
-
Visakhapatnam: 100 నగరాలు కన్నా.. విశాఖే మిన్న
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ పాలనా తీరులో సమూల మార్పులు తెచ్చిందని, అందులోనూ మహిళల భాగస్వామ్యం పెరిగిందని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. విద్య, వైద్య రంగాల్లో అమలవుతున్న నాడు–నేడు కార్యక్రమం సీఎం వైఎస్ జగన్ దార్శనికతకు అద్దం పడుతోందన్నారు. విశాఖకి ‘గ్లోబల్ పొటెన్షియాలిటీ’ ఉందని, పెట్టుబడులకు ఎంతో అనుకూల నగరమని చెప్పారు. అభివృద్ధికి విశాఖలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఆండ్రూ ఫ్లెమింగ్ మూడు రోజుల రాష్ట్ర పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళుతూ ఎంపిక చేసిన కొద్దిమంది మీడియా ప్రతినిధులతో గురువారం ముచ్చటించారు. ఒకసారి విశాఖను సందర్శిస్తే మళ్లీమళ్లీ రావాలనే భావన ఎవరికైనా కలుగుతుందని, తనకూ అదే భావన కలిగిందని ఫ్లెమింగ్ తెలిపారు. మనుషులను ఆకర్షించే గుణం ఉన్న నగరానికి అభివృద్ధి సహజసిద్ధంగానే వచ్చి చేరుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 నగరాల్లో పర్యటించిన తాను విశాఖతో ప్రేమలో పడిపోయానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేసుకోవడం అభివృద్ధికి, నగర విస్తరణకు దోహదం చేస్తుందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే రాష్ట్రాభివృద్ధికి విశాఖ చుక్కానిలా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. విశాఖ గురించి ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. నివాసయోగ్యం.. క్వాలిటీ లైఫ్ నివాసయోగ్యమైన నగరంగా విశాఖకు మంచి మార్కులు పడతాయి. జీవన వ్యయం కూడా తక్కువే. యూనివర్సిటీలు ఉండటం వల్ల మెరుగైన విద్యావకాశాలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యం ఉన్న వర్క్‌ఫోర్స్ దొరుకుతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఉన్న కంపెనీలు తమ సిబ్బందిని విశాఖకు మారుస్తామంటే వెళ్లడానికి ముందుంటారు. నగరంలో క్వాలిటీ లైఫ్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా చూస్తే విశాఖ పెద్ద నగరం. మరోవైపు మిగతా వాటితో పోలిస్తే జనాభా తక్కువ. అభివృద్ధికి, విస్తరణకు బాగా అవకాశం ఉంది. స్పెయిన్‌లో రిసార్టులకు ప్రసిద్ధి చెందిన శాన్ సెబాస్టియన్, బ్రెజిల్‌లోని రియో డీజనీరియో నగరాలను విశాఖ పోలి ఉంది. సకాలంలో వైద్య చికిత్స.. వైద్య రంగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నాడు -నేడు ద్వారా మౌలిక వసతులు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడం, రోగాన్ని సకాలంలో గుర్తించి చికిత్సను గ్రామీణ ప్రాంతంలోనే సకాలంలో అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. పెట్టుబడులపై.. గత ఆర్థిక సంవత్సరంలో బ్రిటీష్ కంపెనీలు తెలుగు రాష్ట్రాల్లో 50 మిలియన్ పౌండ్ల మేర పెట్టుబడులు/లావాదేవీలు చేశాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు బ్రిటన్‌లో దాదాపు 70 మిలియన్ పౌండ్ల లావాదేవీలు/పెట్టుబడులు పెట్టాయి. ప్రజల జీవితాలు, జీవనోపాధులను మెరుగుపరచడం లక్ష్యంగా ‘2030 విజన్’ రూపొందించాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వచ్చా. మూడు రోజుల పర్యటన ఫలవంతంగా సాగింది. విద్య, వైద్యం, అగ్రిటెక్, ఎనర్జీ, వాతావరణ మార్పులు.. తదితరాల్లో పరిస్థితులను అర్థం చేసుకోవడం, అవకాశాలను పరిశీలించడానికి నా పర్యటన దోహదం చేసింది. యూకేపై భారతీయ విద్యార్థుల ఆసక్తి.. యూకేలో చదువుకోవడానికి భారతీయ విద్యార్థుల ఆసక్తి చూపిస్తున్నారు. వీసాల జారీలో బ్రిటన్ ‘రిజిడ్’గా ఉంటుందనే ఆరోపణ నిజం కాదు. ఇప్పుడు చదువు ముగిసిన తర్వాత రెండేళ్లు యూకేలో ఉండటానికి అవకాశం కల్పించారు. చదువు పూర్తి చేశాక ఉద్యోగం/పని అనుభవం సంపాదించడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి కుమార్తె కూడా యూకేలో చదువుకున్నారు. మహిళా సాధికారతలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పరిశీలించాం. స్థానిక సంస్థలు, పలు ప్రభుత్వ సంస్థలు, కంపెనీల్లో మహిళలు నాయకత్వ స్థానాల్లో స్వతంత్రంగా పనిచేస్తున్న తీరు ఆకట్టుకుంది. ఇంధన రంగంలో అపార అవకాశాలు.. ఇంధన రంగంలోనూ ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాం. క్లీన్ ఎనర్జీ పట్ల ఆసక్తిగా ఉన్నాం. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శితోనూ చర్చించాం. మరింత క్షుణ్నంగా చర్చలు జరిగితే పెట్టుబడుల విషయంలో స్పష్టత వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. రవాణా వ్యయాన్ని చౌకగా మార్చేందుకు ఈ వాహనాలు అవసరం. సుదీర్ఘ మన్నిక, నాణ్యత ఉన్న బ్యాటరీల తయారీపై ఇంకా రీసెర్చ్ జరగాలి. ఈ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం ఎంతో ఉపయోగం.. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లి్లష్ మీడియం ప్రవేశపెట్టడం కూడా విప్లవాత్మక మార్పు. టీచర్ల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మా వంతు సహకారం అందిస్తాం. ఇంగ్లీషులో టీచింగ్ స్కిల్స్ పెంచుకోవడం అసాధ్యం ఏమీ కాదు. విద్యార్థులు ఇంగ్లీషు నేర్చుకోవడం వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. రంగులు పులమడం కాకుండా.. నేను పరిశీలిస్తున్న అంశాల్లో ‘జెండర్’ కూడా ఉంది. విద్యా సంస్కరణల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలను మార్చేసింది. సంస్కరణలంటే కేవలం రంగులు పులిమి కలర్ఫుల్గా తయారు చేయడం కాకుండా అన్ని స్కూళ్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. బాలికలు స్కూళ్లకు దూరం కావటానికి బడి ఆవరణలో టాయిలెట్ లేకపోవడం కూడా ప్రధాన కారణమని ఇప్పటికే గుర్తించారు. అన్ని స్కూళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేయడం వల్ల బాలికల డ్రాపౌట్స్ దాదాపుగా ఉండవు. ఇలాంటి పలు విషయాలను ఏపీలో మేం గమనించాం. విద్యారంగంలో సహకారం అందిస్తాం.. విద్యారంగంలో బ్రిటీష్ కౌన్సిల్ ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తోంది. విద్యా సంస్కరణలతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న మార్పులు, వాస్తవ పరిస్థితులకు మధ్య అంతరాన్ని (గ్యాప్స్) గుర్తించి అధిగమించేందుకు యూకే విద్యాసంస్థలు సహకారం అందిస్తాయి. ముఖ్యమంత్రి జగన్ ఆశయాల సాధనలో మా సహకారం అవసరం ఎక్కడ ఉంటుందో పరిశీలిస్తాం. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ యూనివర్సిటీలు భారత్‌లో కార్యకలాపాలు సాగించడంపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చర్యలు చేపడతాయి. విద్యారంగంలో మార్పులు చేపట్టడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో మా దేశ (బ్రిటన్) విద్యావ్యవస్థ అనుభవం, ఆలోచనలు ఉపకరిస్తాయేమో చూడాలి. ముఖ్యమంత్రి జగన్ దార్శనికుడు.. విద్య, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెస్తున్న సంస్కరణలు ముఖ్యమంత్రి జగన్ దార్శనికతకు నిదర్శనం. సమూల మార్పు కోసం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమం బాగుంది. ఈ రంగాల్లో కలసి పనిచేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఉమ్మడిగా వర్కింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వానికి ప్రతిపాదించా. వైద్య రంగంలో అంబులెన్స్ ప్రాజెక్టు(108 అంబులెన్స్‌లు)లో ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాం. మరిన్ని అంశాల్లో కలసి పనిచేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినప్పుడు.. తాను చేపట్టనున్న కార్యక్రమాలు, తన సంకల్పం, ఆశయాలను వివరించారు. ఇప్పుడు ఆ దిశగా వేసిన అడుగులు కనిపించాయి. -
దుర్గం చెరువు అందాలు.. ఎన్నోన్నో వర్ణాలు
-
దుర్గం చెరువు బ్రిడ్జి... ఈ వీడియో చూశారా ?
హైదరాబాద్ నగరానికి ఐకాన్ చార్మినార్... ఆ తర్వాత కాలంలో ఆ స్థాయి సైబర్ టవర్స్‌కి దక్కింది. ఇప్పుడు వాటి సరసన చేరేందుకు సిద్ధమవుతోంది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. స్థానికులకే కాదు విదేశీయులను సైతం అబ్బురపరుస్తోంది. బ్రిటీష్ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఇటీవల దుర్గం చెరువుపై నుంచి ప్రయాణించారు. చక్కని సాయంత్రం వేళ భారీ భవంతుల చాటున అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు తీగల వంతెన మీద ప్రతిబింబిస్తోంది. ఈ మనోహర దృశ్యాన్ని మొబైల్లో షూట్ చేసి ట్విట్టర్లో మనతో ఆండ్రూ ఫ్లెమింగ్ పంచుకున్నారు. మీరు ఓ సారి ఆ వీడియో చూడండి . -
లక్కీ.. బ్రిటీష్ హై కమిషనర్‌గా ఛాన్స్!
న్యూఢిల్లీ: భారత్‌లో బ్రిటీష్ హైకమిషనర్ పదవి గొప్ప పేరు ప్రఖ్యాతులు, బాధ్యత గలది. అంతటి హై ఫ్రొఫైల్ ఉద్యోగం 18 ఏళ్ల యువతి చైతన్య వెంకటేశ్వరన్‌ను వరించింది. అవును, భారత్‌లో బ్రిటీష్ హై కమిషనర్‌గా ఆమె గత బుధవారం ఒక రోజు సేవలందించారు. 2017 నుంచి బ్రిటీష్ హై కమిషన్ భారత్‌లో.. ‘ఒక రోజు హై కమిషనర్’ అనే పోటీని నిర్వహిస్తోంది. 18 నుంచి 23 ఏళ్ల యువతులు ఈ పోటీకి అర్హులు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, స్త్రీ సాధికారతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఒకరోజు హైకమిషన్‌గా అవకాశం రావడం పట్ల చైతన్య ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు లభించిన సువర్ణ అవకాశమని అన్నారు. మహిళా సాధికారత కోసం పాటుపడతానని చెప్పుకొచ్చారు. (చదవండి: ఆధునిక బానిసత్వంలో ‘ఆమె’) ప్రపంచ బాలికల దినోత్సవం (అక్టోబర్ 11) సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రస్తుత బ్రిటీష్ హైకమిషర్ జాన్ థాంప్సన్ తెలిపారు. చైతన్య ఉన్నత భావాలు గల అమ్మాయి అని చెప్పారు. హై కమిషనర్‌గా ఆమె చక్కని పనితీరు కనబర్చిందని మెచ్చుకున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ పోటీలు తనకెంతో ఇష్టమని చెప్పారు. భారత్, బ్రిటన్ మహిళల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటేందుకు చేస్తున్న కృషికి ఈ కార్యక్రమం నిదర్శనమని థాంప్సన్ పేర్కొన్నారు. కాగా, చైతన్య విధుల్లో ఉండగా.. థాంప్సన్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఒకరోజు హైకమిషనర్ పోటీలకు 215 ఎంట్రీలు కాగా.. చైతన్యకు అవకాశం లభించింది. ఒకరోజు హైకమిషనర్‌గా పనిచేసిన వారిలో చైతన్య నాలుగో వ్యక్తి. (చదవండి: కరోనా ఉందని మర్చేపోయాను!) -
ఏపీలో టెస్టులు, ట్రేసింగ్ భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 నివారణకు తీసుకుంటున్న చర్యలను బ్రిటిష్ తాత్కాలిక హైకమిషనర్ జాన్ థాంప్సన్ ప్రశంసించారు. ఏపీలో జరుగుతున్న టెస్టులు, ట్రేసింగ్ చర్యలను ఆమె కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి భారత్‌లో బ్రిటిష్ తాత్కాలిక హైకమిషనర్ జాన్ థాంప్సన్, డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్ నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాన్ థాంప్సన్ ఏమన్నారంటే.. ► ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. ► కరోనా మరణాలు అదుపులో ఉండడం అభినందనీయం. వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటోంది. ► ఏపీ మెడ్‌టెక్ జోన్‌తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. కోవిడ్ నివారణ కోసం వాడే వైద్య పరికరాల తయారీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ► ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) భాగస్వామ్యం 108, 104 లాంటి అంబులెన్స్‌ల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు, టెక్నాలజీలకు దారితీస్తుంది. కాగా, కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాక బ్రిటన్ రావాల్సిందిగా సీఎం జగన్‌ను బ్రిటిష్ హైకమిషనర్ ఆహ్వానించారు. సగటున రోజుకు 62వేల పరీక్షలు చేస్తున్నాం : సీఎం జగన్ ► రాష్ట్రంలో సగటున రోజుకు 62వేల కరోనా పరీక్షలు చేస్తున్నాం. ► మరణాలు రేటు దేశం సగటుతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువ. ► కోవిడ్‌కు వ్యాక్సిన్ వచ్చేంత వరకూ మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. ► 10వేలకు పైగా రెమిడెసివర్ ఇంజక్షన్లతో చాలామందికి మెరుగైన వైద్యాన్ని అందించాం. ► ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టిపెట్టాం. నాడు–నేడు ద్వారా అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. ► 16 కొత్త మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు తీసుకువస్తున్నాం. గ్రామ, వార్డుల వారీగా క్లినిక్స్ నిర్మిస్తున్నాం. ► ఆక్స్ఫర్డ్ తయారుచేసిన వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ► బ్రిటన్ సహకారం మా రాష్ట్రానికి చాలా అవసరం. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం. -
శ్రీసిటీలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు
సాక్షి, తడ: శ్రీసిటీ పారిశ్రామికవాడలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పెట్టుబడులకు ఎంతో ఈ ప్రాంతం అనుకూలమని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెవిుంగ్ కితాబిచ్చారు. మంగళవారం శ్రీసిటీ పర్యటనకు వచ్చిన ఆయనకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీసిటీ మౌలిక సదుపాయాలు, ప్రత్యేకతలు, అభివృద్ధిని వివరించారు. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన రోటోలోక్, ఎంఎండీతో సహా 7 సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తి కేంద్రాలను శ్రీసిటీలో ఏర్పాటు చేశాయని వివరించారు. అనంతరం డాక్టర్ ఆండ్రూ ఫ్లెవిుంగ్ మాట్లాడుతూ.. శ్రీసిటీ యాజమాన్యం ధార్శినికత, అభివృద్ధి తమకెంతో నచ్చాయన్నారు. శ్రీసిటీలో 7 బ్రిటిష్ పరిశ్రమలు ఏర్పాటుకావడం సంతోషదాయకమన్నారు. యూకే ప్రభుత్వ అంతర్జాతీయ వాణిజ్యాన్ని విస్తృతపరిచే దిశగా శ్రీసిటీ పర్యటనకు వచ్చామన్నారు. త్వరలో మరిన్ని బ్రిటిష్ కంపెనీలు శ్రీసిటీకి రానున్నాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతంషగా భారతదేశం అవతరించిందన్నారు. మన దేశంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్న ఐరోపా దేశాలలో యూకే అగ్రస్థానంలో ఉందన్నారు.అనంతరం శ్రీసిటీ వ్యాపార వాణిజ్య కేంద్రంలో ఇరువురి మధ్య పరస్పర చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో శ్రీసిటీ గురించి వివిధ అంశాలపై డాక్టర్ ఫ్లెవిుంగ్ ఆరా తీశారు. వీరి వెంట ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్ మాలీ, దక్షిణ భారతదేశం ఇన్వర్డ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ సిద్ధార్థ్ విశ్వనాథన్, లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ సీనియర్ ట్రేడ్ అడ్వైజర్ హర్‡్ష ఇంద్రారుణ్, పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్, ప్రెస్, కమ్యూనికేషన్స్ హెడ్ పద్మజా కొనిశెట్టి, హెచ్ఆర్ ఆఫీసర్ నిధి శ్రీవాస్తవ ఉన్నారు. -
విద్యతోపాటే వర్క్ పర్మిట్
సాక్షి, హైదారాబాద్ : బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త! తమ దేశంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేసిన వారికి ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా అక్కడే పనిచేసేందుకు రెండేళ్ల వర్క్ వీసా ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం భారత్‌తోపాటు ఇంగ్లండ్‌లో పైచదువులు చదవాలనుకున్న ఇతర దేశస్తులకు శుభవార్త అంటున్నారు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆండ్రూ ఫ్లెమింగ్. టైర్–4 వీసాలో ఇటీవల ఇంగ్లండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దాని వల్ల భారత విద్యార్థులకు ఒనగూరే ప్రయోజనాల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రూ వెల్లడించారు. సాక్షి: విద్యార్థులకు జారీచేసే టైర్–4 వీసాల్లో ఇంగ్లండ్ తాజా నిర్ణయం వల్ల భారతీయులకు ఎలాంటి లాభం కలుగుతుంది? ఆండ్రూ: ఇది తప్పకుండా భారతీయ విద్యార్థులకు లాభించేదే. గతంలో వీసాల మంజూరులో కాస్త సంక్లిష్టత ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థులు ఉన్నత విద్య తరువాత రెండేళ్ల వరకు అక్కడే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాక్షి: విద్యార్థులందరికీ ఈ వెసులుబాటు ఉంటుందా? ఆండ్రూ: తప్పకుండా! టైర్–4 వీసా ద్వారా మా దేశంలో ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థుల్లో ప్రతిభావంతులకి ఈ వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాక్షి: ఎప్పటి నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది? ఆండ్రూ: ఈ నిబంధన 2020–21లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు వర్తిస్తుంది. ఈలోపు గ్రాడ్యుయేషన్ పూర్తయిన విద్యార్థులకు అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. సాక్షి: ఈ ఆకస్మిక నిర్ణయం వెనక కారణాలేంటి? ఆండ్రూ: వాస్తవానికి ఇది ఆకస్మిక నిర్ణయమేం కాదు. 2030 నాటికి 6 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు మా దేశానికి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ రంగంలో మేము 34 బిలియన్ పౌండ్లు మార్కెట్ సాధించాలన్నది మా ప్రణాళిక. సాక్షి: లండన్‌లో ఉన్నత విద్యకు అనుకూలించే అంశాలేంటి? ఆండ్రూ: ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వర్సిటీలు ఉన్నాయి. టాప్–10లో 3 వర్సిటీలు. టాప్–100లో 48 వర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ విద్యా సదస్సులోనూ మా దేశానికి చెందిన 16 వర్సిటీలు పాల్గొన్నాయి. మా వద్ద ఇండియన్ సెటిలర్లు అధికం. ప్రస్తుతం 15 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. కాబట్టి, కొత్త ప్రాంతంలో ఉన్నా.. పెద్దగా హోమ్ సిక్ ఉండదు. సాక్షి: భారత్ నుంచి ఏ కోర్సులు చదివేందుకు వస్తున్నారు? ఇంతవరకు ఎన్ని వీసాలు మంజూరు చేసారు? ఆండ్రూ: 2019 జూన్ వరకు బ్రిటన్‌లో ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 22,000గా ఉంది. 2008–09 నుంచి 2019 వరకు బ్రిటన్‌లో ఉన్న త విద్యను అభ్యసించిన విద్యార్థుల సంఖ్య 1,30,000కు చేరింది. వీరిలో అధికశాతం సైన్స్ విద్యార్థులే ఉండటం గమనార్హం. వీరినే సంక్షిప్తంగా స్టెమ్ (ఎస్టీఈఎమ్)గా లేదా ఎస్=సైన్స్, టీ=టెక్నాలజీ, ఈ= ఇంజినీరింగ్, ఎమ్= మేథమేటిక్స్గా వ్యవహరిస్తారు. ఇప్పటిదాకా 5 లక్షల మంది భారతీయులకు విజిటింగ్ వీసాలు మంజూరయ్యాయి. 56,000 మంది నైపుణ్యం కలిగిన ఇండియన్లకు వర్క్ వీసాలు ఇచ్చాం. సాక్షి: వర్క్ వీసా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆండ్రూ: ఇక్కడున్న ఉన్నత విద్యతోపాటు, ఉద్యోగానుభవం చాలా విలువైంది. ఇక్కడ పనిచేసిన అనుభవంతో వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుంది. తిరిగి ఇక్కడే పనిచేయాలనుకుంటే.. మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పకుండా వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. సంఖ్య పెరుగుతోంది.. బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇది చక్కటి అవకాశం. మూడేళ్లుగా మా దేశంలో విద్యనభ్యసించే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కేవలం 2018లోనే విద్యార్థుల సంఖ్య 42 శాతం వృద్ధి నమోదవడమే ఇందుకు నిదర్శనం. తాజాగా మా ప్రభుత్వం తీసుకున్న రెండేళ్ల వర్క్ పర్మిట్ నిబంధన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను మరింత పెంచుతుంది. – ఇండియాలో బ్రిటిష్ హై కమిషనర్ డొమినిక్ ఆస్క్విత్ -
నిజాం నిధులెవరికి?
సాక్షి, హైదరాబాద్: నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాచుకున్న భారీ నగదు వివా దం త్వరలో తేలిపోనుంది. హైదరాబాద్‌పై సైనిక చర్యకు కొన్ని రోజుల ముందు పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్‌కు బదిలీ అయిన మొత్తం రూ.వందల కోట్లకు చేరటంతో భారత్, పాకిస్తాన్‌తో పాటు నిజాం వారసుల్లోనూ కదలిక మొదలైంది. హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసే దిశగా భారత సైన్యాలు వస్తున్నాయన్న సమాచారంతో ఆరో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1948లో 1.7 లక్షల పౌండ్లను పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్‌కు బదిలీ చేశారు. అయితే ఈ నిధులపై అప్పటి నుంచి భారత్, పాకిస్తాన్‌లు న్యాయ పోరాటం చేస్తుండగా, ఇందులో నిజాం వారసులు ముకర్రంజ, ముఫకంజ కూడా నిధులు తమకే చెందుతాయంటూ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న బ్రిటన్ హైకోర్టు వచ్చే నెలలో తీర్పు ఇవ్వనుందని నిజాం వారసులు పేర్కొంటున్నారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌లో బ్యాంక్‌లో జమ అయిన నిధులు.. ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.304 కోట్లకు చేరాయి. ఈ నిధులు మావంటే, మావేనని ఇరు దేశాలు నాలుగున్నర దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాయి. కుమారుడు ఆజంజా, కోడలు దుర్రేషెవార్, మనుమలు ముకర్రం, ముఫకంజాలతో ఉస్మాన్ అలీఖాన్. చిత్రంలో అప్పటి గవర్నర్ భీంసేన్ సచార్ ఆయుధాల కోసమన్న పాకిస్తాన్.. హైదరాబాద్ విలీనానికి ముందు ఉస్మాన్ అలీఖాన్ వద్ద ప్రధానమంత్రిగా ఉన్న లాయక్ అలీ నగదును పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్‌కు బదిలీ చేశారు. దేశ విభజన అనంతరం లాయక్ అలీ పాకిస్తాన్ పౌరసత్వం పొందటంతో ఈ నిధులు తమకే చెందుతాయని పాకిస్తాన్ వాదించింది. దీనికి తోడు భారత్ దాడిని ఎదుర్కొనేందుకు ఉస్మాన్ అలీఖాన్ ఆయుధాల సరఫరా కోసం ఆ మొత్తాన్ని తమకు పంపాడని కూడా పేర్కొంది. తీర్పు భారత్, నిజాం వారసులకు అనుకూలంగా వస్తే ఎవరి వాటా ఎంత అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. నిజాం అసలు వారసులతో పాటు మరో 4 వేల మంది వరకు క్లెయిమ్ చేసుకుంటున్నారని నిజాం పాలనపై పరిశోధన చేసిన ఇజాస్ ఫారుఖీ ‘సాక్షి’కి తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయవాది వెంకటరమణ మాట్లాడుతూ.. హైదరాబాద్ రాష్ట్ర ప్రజల ఆస్తినే నిజాం పంపారని పేర్కొన్నారు. అందుకే ఈ మొత్తాన్ని తెలంగాణకు వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముకర్రంజ పరివారం: భార్యలు: ఎస్త్రా(టర్కీ)హెలెన్, మనోలియా ఒనూర్, జమీల (మొరాకో), ఒర్చిడ్ (టర్కీ), వీరందరికీ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరంతా ఇప్పుడు టర్కీ, ఆస్ట్రేలియా, లండన్‌లో స్థిరపడ్డారు. ముఫకంజ: భార్య ఏసెస్(టర్కీ), పిల్లలు: రఫత్ జా, ఫర్హత్ జా వీరు కాకుండా నిజాం వారసులుగా మరో 3,600 మంది చలామణి అవుతున్నారు. ప్రస్తుతం ముకర్రంజ ఆస్ట్రేలియా, టర్కీలలో, ముఫకంజ లండన్, హైదరాబాద్‌లలో నివసిస్తున్నారు. -
‘స్టార్టప్స్‌తో భాగస్వామ్యాలకు బ్రిటన్ సంస్థల ఆసక్తి’
(ఆర్. దిలీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సాక్షి): భారతీయులకు లభించే బ్రిటన్ వీసాలు పెరిగి భారత్–యూకే వ్యాపార, విద్య, సాంస్కతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాల లక్ష్యంతో సరిగ్గా ఏడాది కింద రెండు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందపు కార్యాచరణ ప్రారంభమైందని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ అశ్క్విత్ తెలిపారు. మరిన్ని వీసాల లభ్యత, సాంకేతిక క్లస్టర్ల ఏర్పాటు వంటివి ఈ దిశలో ఒక ముందడుగు కాగలవని ఆయన పేర్కొన్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ)లో ఇప్పటికే ఇక్కడున్న చొరవ దష్ట్యా, ఈ భాగస్వామ్యాన్ని మరింత ఫలవంతం చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన అశ్క్విత్ తనను కలిసిన పాత్రికేయులతో కాసేపు ఇష్టాగోష్ఠి జరిపారు. ఏడాది కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ లండన్ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే! సాంకేతిక సహకారం–వాణిజ్య విస్తరణతో ఉభయదేశాల పరస్పర ప్రయోజనం ఇందులో ప్రాధాన్యత అంశమని అశ్క్విత్ అన్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రవాణా వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యాల్ని భారత్‌లో విస్తరించడానికి ఇప్పటికే బ్రిటన్ వ్యాపార–వాణిజ్య సంస్థలు సంసిద్దంగా ఉన్నాయన్నారు. తాము కాల్టెక్ హబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా, ఇక్కడ వినూత్న తరహాలో వచ్చిన అంకుర సంస్థల(స్టార్టప్స్)తో భాగస్వామ్యాలకు బ్రిటన్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. దక్షిణాదిలో హైదరాబాద్ మరింత ప్రయోజనకారి కాగలదని అంచనా వేశారు. బ్రిటన్ నైపుణ్యాల్ని, సాంకేతిక సహకారాన్ని గరిష్టంగా వినియోగించుకునేలా ఇక్కడి అంకుర సంస్థలతో అనుసంధానించే నైపుణ్య మానవవనరుల్ని సమకూర్చడం ద్వారా తెలంగాణ ‘టీ–హబ్’ కీలకపాత్రదారి కానుందన్నారు. చమురు కోసం సముద్ర గర్భాన్ని తొలిచే సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో బ్రిటన్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చమురు–సహజవాయు రంగంలో పనిచేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విద్య–ఉద్యోగ రంగంలోనూ పెరగనున్న వీసాలు ఐరోపా సంఘం (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగుతున్న నేపథ్యంలో కొత్త వలసల విధానం రూపుదిద్దుకుంటోందన్నారు. దాంతో, భాగస్వామ్య వృద్ధిలో, విద్య–ఉద్యోగావశాల్లో భారత్ వంటి దేశాలకు మున్ముందు చక్కని అవకాశాలుంటాయని హైకమిషనర్ అశ్క్విత్ అన్నారు. ఐటీ, వైద్య రంగంలో భారత్ ధృడంగా ఉందని పేర్కొన్నారు. భారత్ నుంచి యూకేలో ఉన్నత విద్యకు వెళ్లే వారిప్పుడు 37 శాతం పెరిగారన్నారు. గత సంవత్సరం ఈ వద్ధి రేటు 17 శాతమన్నారు. ప్రతి 10 మందిలో 9 మంది విద్యార్థులకు వీసాలు లభించే పరిస్థితి ఉందన్నారు. యూకే విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని భారత విద్యార్థులు గరిష్టంగా వినియోగించుకోవాలన్నదే తమ కోరికని, పెరుగుతున్న సంఖ్య దానికి నిదర్శనమని పేర్కొన్నారు. వాణిజ్య, విద్యా, ఉద్యోగ వీసాల్లో వృద్ధి వల్ల బ్రిటన్ సందర్శించే భారతీయుల సంఖ్య పెరుగుతుందని, ఇది పరస్పర వాణిజ్య, సాంస్కతిక సంబంధాల్ని మెరుగుపరుస్తుందన్నారు. రానున్న క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా కూడా బ్రిటన్‌కు భారతీయ సందర్శకులు పెరుగుతారన్నారు. 2018లో భారత్‌కు చెందిన నైపుణ్యంగల ఉద్యోగులు–సిబ్బందికి 55,000 బ్రిటన్ వీసాలు లభించాయని, మిగతా అన్ని దేశాలకు కలిపి దాదాపు ఇన్నే లభించాయని గుర్తు చేశారు. -
ఒక్క రోజు బ్రిటిష్ హై కమిషనర్‌గా భారత విద్యార్థిని
న్యూఢిల్లీ : ఒకే ఒక్కడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక్క రోజు సీఎంగా విధులు నిర్వర్తిస్తాడు. ఆ సీన్ దాదాపు అందరికి గుర్తుండేఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజ జీవితంలో చోటుచేసుకుంది. ఓ భారతీయ విద్యార్థిని ఒక్క రోజు బ్రిటీష్ హై కమిషనర్ గా పాటు విధులు నిర్వర్తించింది. ఆమె పేరు ఈషా బహల్. ప్రస్తుతం ఈషా.. నోయిడా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ విభాగంలోని కోర్సు చేస్తోంది. కాగా.. అనుకోకుండా ఆమె ఒక్కరోజు బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అదెలా అంటారా.. అంతర్జాతీయ బాలికల దినోత్సవం(అక్టొబర్ 11) పురస్కరించుకొని బ్రిటీష్ హై కమిషన్ 18నుంచి 23ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిలకు ఓ పోటీని నిర్వహించారు. మీ దృష్టిలో లింగ సమానత్వానికి అర్థం ఏమిటి.. అనే ప్రశ్నకి సమాధానంగా ఓ చిన్న వీడియో రూపొందించాలని పంపాలని ప్రకటించింది. అందులో గెలిచినవారికి ఒక్కరోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు.ఈషాతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 58మంది అమ్మాయిలు వీడియోలను పంపించారు. కాగా.. అలా పంపిన వీడియోల్లో ఈషా విజయం సాధించింది. దీంతో ఆమెకు ఒక్క రోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశం లభించింది. దీనిపై ఈషా మాట్లాడుతూ..‘ బ్రిటీష్ హైకమిషనర్ గా ఒక్కరోజు పనిచేయడం చాలా గొప్పగా అనిపించింది. ఇది ఒక అరుదైన అనుభూతి. దీని వల్ల యూకేకీ భారత్ కి మధ్యగల సంబంధాల గురించి కొంత తెలుసుకోగలిగాను. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొంది. ఇక వాస్తవ భారత బ్రిటీష్ హైకమిషనర్ డొమినిక్ ఆస్కిత్ మాట్లాడుతూ.. భారత మహిళ హక్కుల చర్చకు ఈ పోటీ ఓ వెదికగా ఉందని నమ్ముతున్నారు. విద్యార్థినీలు పంపిన వీడియోలు చాలా బాగున్నాయి. ఈషా పంపిన వీడియో ఆకర్షనీయంగా, ఆలోచించే విధంగా ఉన్నాయి. ఆ వీడియో బాలిక హక్కుల గురించి చక్కగా వివరించింది. ఒక్కరోజు బ్రిటిష్ హై కమిషనర్‌గా ఎన్నికైన ఈషాకి శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. -
చంద్రబాబుతో బ్రిటిష్ హైకమిషనర్ భేటీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బ్రిటిష్ హైకమిషనర్ డొమ్నిక్ ఆస్కిత్ గురువారం విజయవాడలో భేటీయ్యారు. ఈ భేటీలో అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులపై బ్రిటిష్ బృందం సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీ ట్రాన్స్పోర్ట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు డొమ్నిక్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. -
జానా, షబ్బీర్లతో బ్రిటిష్ హైకమిషనర్ భేటీ
♦ రాష్ట్ర ఏర్పాటు, అనంతర పరిణామాలపై చర్చ ♦ రాజకీయ అవసరాల కోసం జిల్లాలు వద్దు: జానా సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీలతో బ్రిటిష్ హైకమిషనర్ సర్ డొమినిక్ యాష్‌క్విత్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బుధవారం అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, వంశీ చంద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం, ప్రజల కోరికకు కారణాలు, రాష్ట్ర ఏర్పాటు అనంతర పరిణామాలపై చర్చ జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడం వల్లే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని బ్రిటిష్ ప్రతినిధులకు జానా, షబ్బీర్ వివరించారు. భేటీ అనంతరం వివరాలను జానారెడ్డి మీడియాకు వెల్లడించారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగడంపై ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. బ్రిటన్ ఈయూలో ఉండాలా వద్దా అని బ్రిటిష్ ప్రతినిధులు తమను అడిగారని, ఈయూ లో ఉండాలని తాము చెప్పామన్నారు. ఇక కాంగ్రెస్‌లో అంతర్గతంగా జరిగే యువజన కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియను బ్రిటిష్ ప్రతినిధులు ఆసక్తిగా తెలుసుకున్నారని చెప్పారు. బ్రిటిష్ వారు తమను సలహా అడిగారని.. కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాలు ఏర్పాటు చేస్తే మంచిదని, రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. జిల్లాల ఏర్పాటులో ప్రజల సెంటిమెంటు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. యాదగిరిగుట్టను జిల్లాగా చేయాలని కోరారు. బయ్యారం గనుల కోసమే ప్రతిపాదిత మహబూబాబాద్ జిల్లాలో బయ్యా రం, గార్ల మండలాలను కలిపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో గెలిపిస్తే ఇస్తాంబుల్ చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని అడిగారు. న్యాయవాదుల అరెస్టు సరికాదు: పొన్నం న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న న్యాయవాదులను అరెస్టు చేయడాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో ఖండించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన న్యాయవాదులను అరెస్టు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సిగ్గుచేటని విమర్శించారు. న్యాయవాదులు, విద్యార్థులు, ఆర్టీసీ కార్మిక సంఘాలను అణచివేస్తే కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుం దని హెచ్చరించారు. -
సానుకూలతను బట్టి పెట్టుబడులు పెట్టాలి
బ్రిటిష్ హైకమిషనర్‌తో భేటీలో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల కోసం దేశాన్ని ఓ యూనిట్‌గా చూడకుండా... ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, సౌకర్యాలు, విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని బ్రిటీష్ హైకమిషనర్ (ఇండియా) డొమినిక్ యాష్క్విత్కు మంత్రి కె.తారక రామారావు సూచించారు. వ్యాపారాన్ని సరళం చేయడం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ప్రస్తుతం తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సెన్సైస్, ఏరోస్పేస్ వంటి వాటిని ప్రాధాన్య రంగాలుగా ఎంచుకున్నామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో డొమినిక్ యాష్‌క్విత్ బృందంతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పారిశ్రామిక, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేం దుకు సిద్ధంగా ఉన్నామని.. రాష్ట్రంలో స్మార్ట్‌సిటీల నిర్మాణంలో సహకరిస్తామని ఈ సందర్భంగా బ్రిటీష్ హైకమిషనర్ పేర్కొన్నారు. టీఎస్ఐపాస్ విధానాన్ని అభినందించారు. టీ-హబ్ ద్వారా పరిశోధనలకు ఊతం లభిస్తుందని చెప్పారు. బ్రిటన్‌లోని స్టార్టప్ ఈకో సిస్టంతో భాగస్వామ్యానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఐటీ, పారిశ్రామిక కార్యక్రమాలు, రూపొందించిన పాలసీలను కేటీఆర్ వివరించారు. ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడుల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నామని.. పెట్టుబడి పెట్టే కంపెనీలకు సహకరిస్తున్నామని తెలిపారు. బోయింగ్, టాటా కంపెనీల భాగస్వామ్యంలో హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్వయంగా తాను కృషి చేసినట్లు వివరించారు. ఐటీలో టాప్: ఐటీ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని టాప్-4 కంపెనీలు తమ అతిపెద్ద క్యాంపస్‌లను ఇక్కడ నిర్మిస్తున్నాయన్నారు. త్వరలో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్లీన్టెక్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని బ్రిటిష్ హైకమిషనర్ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. పెట్టుబడులకు అవకాశాలు పెంచేందుకు ఇండో-బ్రిటిష్ బిజి నెస్ కౌన్సిల్‌ను క్రియాశీలం చేస్తామన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’పై త్వరలో నిర్వహించే ఇండో-బ్రిటిష్ వర్క్‌షాప్‌కు హాజ రవాలని కేటీఆర్‌ను ఆహ్వానించారు. బ్రిట న్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న స్టేట్ డెస్క్ ఆలోచనను అభినందించారు. దాంతో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలు పెరుగుతాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు. -
ఇండో-బ్రిటిష్ వర్క్‌షాప్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం
హైదరాబాద్: బ్రిటిష్ హైకమిషనర్ బృందం బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఇండో-బ్రిటిష్ వర్క్‌షాప్‌కు మంత్రి కేటీఆర్ రావల్సిందిగా బ్రిటీష్ హైకమిషనర్ డోమినిక్ అస్క్విత్ ఆహ్వానం అందించారు. హైకమిషన్ బృందం టీఎస్ ఐపాస్, ఐటీ, ఇండస్ట్రీ పాలసీలను అభినందించింది. తెలంగాణలో స్మార్ట్ సిటీల నిర్మాణంలో భాగస్వామ్యానికి బ్రిటిష్ బృందం ఆసక్తి చూపించింది. మంత్రి కేటీఆర్‌తో డొమినిక్ వివిధ అంశాల మీద గంటన్నర పాటు చర్చించారు. భారత దేశంలో పెట్టుబడులకి దేశాన్ని ఒక యూనిట్‌గా కాకుండా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు, సౌకర్యాలు, పాలసీల అధారంగా చూడాలని మంత్రి కోరారు. తమ ప్రభుత్వానికి ఐటి, ఫార్మ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పెస్ వంటి రంగాలు ప్రాధాన్యత రంగాలన్నారు. ఏరో స్సేస్ రంగంలో పెట్టుబడులకోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నామని తెలిపారు. పెట్టుబడుల కోసం ముందుకు వచ్చే కంపెనీలకు అన్ని విధాలుగా సహకరిస్తామని, ఇక ఐటి రంగంలో తమ రాష్ట్రం పెట్టుబడులకి అకర్షణీయ గమ్యస్ధానంగా మారిందని మంత్రి తెలిపారు. ప్రపంచంలోని టాప్ 4 కంపెనీలు తమ అతిపెద్ద క్యాంపస్‌లను ఇక్కడ నిర్మిస్తున్నాయని హైకమిషన్‌కి మంత్రి తెలిపారు. ఇక బ్రిటన్ లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న స్టెట్ డెస్క్ అలోచనను డోమినిక్ అభినందించారు. దీంతో ఇరు ప్రాంతాల మధ్య మరిన్ని వ్యాపార వాణిజ్య సంబంధాలు పెరుగుతాయన్నారు. ఈ సమావేశంలో మంత్రితోపాటూ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్ ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ని కలసిన బ్రిటీష్ హైకమీషనర్