మీరూ కావచ్చు, బ్రిటిష్‌ హైకమిషనర్‌! | Here Is Chance Become The British High Commissioner To India For Day | Sakshi
Sakshi News home page

మీరూ కావచ్చు, బ్రిటిష్‌ హైకమిషనర్‌!

Published Wed, Aug 17 2022 2:18 AM | Last Updated on Wed, Aug 17 2022 2:18 AM

Here Is Chance Become The British High Commissioner To India For Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ యువతుల్లారా.. ఒకరోజు కోసమైనా సరే, బ్రిటిష్‌ హైకమిషనర్‌ హోదాను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. అంతర్జాతీయ బాలికల దినోత్సవాల్లో భాగంగా భారతీయ మహిళకు ఒకరోజుపాటు హైకమిషనర్‌ హోదా కల్పించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడం, వేర్వేరు వర్గాలవారితో చర్చలు జరపడం, భారత్‌ –యూకే భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలగడం ఈ కార్యక్రమం ప్రత్యేకతలు.

ఈ పోటీలో పాల్గొనేందుకు 18– 23 మధ్య వయసు గల యువతులు అర్హులు. ‘‘హైకమిషనర్‌ ఫర్‌ ద డే’’పోటీలో పాల్గొనదలచినవారు ‘ప్రజాజీవితంలో మీకు స్ఫూర్తినిచ్చే మహిళ ఎవరు? అందుకు కారణాలేమిటి?’’అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఒక నిమిషం వీడియో ద్వారా తెలపాల్సి ఉంటుంది. వీడియోను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో @UKinIndia"‘ను ట్యాగ్‌ చేస్తూ ‘# DayoftheGir‘ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ షేర్‌ చేయాలి. ఆసక్తి కలవారు సెప్టెంబర్‌ రెండోతేదీ వరకూ వీడియోలను పంచుకోవచ్చు.

‘‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’జరుపుకుంటున్న ఈ తరుణంలో ఒక భారతీయ యువతిని ఒకరోజు హైకమిషనర్‌గా నియమించే అవకాశం దక్కడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం యునైటెడ్‌ కింగ్‌డమ్‌తోపాటు భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రా«థమ్యాల్లో ఒకటి. ఈ దేశ యువతులు సత్తాచాటేందుకు ఇదో మంచి అవకాశం. దేశం నలుమూలల నుంచి యువతులు ఈ పోటీలో పాల్గొంటారని ఆశిస్తున్నా’’అని భారత్‌లో బ్రిటిష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఇల్లిస్‌ పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement