labour commissioner
-
హత్య వెనుక ప్రేమ వ్యవహారం
సాక్షి, కాజీపేట: ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్, జనగామ జిల్లాకు చెందిన మోకు ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారి పింగిళి ప్రదీప్‌రెడ్డితో పాటు డ్రైవర్ రమేష్ హన్మకొండ పోలీసులకు శనివారం చిక్కారు. ఈ మేరకు వివరాలను హన్మకొండ ఇన్స్పెక్టర్ పి.దయాకర్ సాయంత్రం వెల్లడించారు. హన్మకొండ గోపాలపురంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పింగిళి ప్రదీప్‌రెడ్డి, డ్రైవర్ నిగ్గుల రమేష్ ఇన్నోవా క్రిస్టా వాహనంలో వెళ్తుండడాన్ని గుర్తించారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. (లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య) గత నెల 7న హత్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా రామారం అడవుల్లోని గట్టమ్మ గుడి వద్ద గత నెల 7వ తేదీన ఆనంద్‌రెడ్డిని పింగిళి ప్రదీప్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, శివరామకృష్ణ, శంకర్, మధుకర్, రమేష్ కలిసి హత్య చేసిన విషయం విదితమే. అదే నెల 8వ తేదీన ఆనంద్‌రెడ్డి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 11వ తేదీన ముగ్గురు నిందితులు శివరామకృష్ణ, మధుకర్, శంకర్‌ను అరెస్ట్ చేశారు. మిగిలిన వారిలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌రెడ్డితో పాటు విక్రమ్‌రెడ్డి, రమేష్ హైదరాబాద్‌కు పారిపోయినట్లు గుర్తించి గాలింపు చేపట్టారు. ఇందులో విక్రమ్‌రెడ్డిని మార్చి 28న అరెస్టు చేయగా.. ఇప్పుడు ప్రదీప్‌రెడ్డి, రమేష్‌ను కూడా అరెస్టు చేయడంతో ఘటనలో నిందితులందరూ పట్టుబడినట్లయింది. హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఆనంద్‌రెడ్డి – ప్రదీప్‌రెడ్డి నడుమ ఇసుక వ్యాపారంలో లావాదేవీలు కొనసాగాయని తొలుత ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆనంద్‌రెడ్డికి ప్రదీప్‌రెడ్డి రూ.80లక్షల మేర బాకీ పడడంతో హత్య చేసినట్లు అందరూ భావించారు. కానీ పోలీసుల విచారణలో కొత్త కోణం బయటపడింది. కరీంనగర్‌కు చెందిన ఓ యువతితో ప్రదీప్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి వేర్వేరుగా ప్రేమ వ్యవహరం నడపగా.. ఆమెను దక్కించుకునే క్రమంలో వచ్చిన విబేధాలతో ఆనంద్‌రెడ్డిని హతమార్చినట్లు ప్రదీప్‌రెడ్డి ఒప్పుకున్నాడని ఇన్స్పెక్టర్ దయాకర్ తెలిపారు. -
ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అదృశ్యం
-
రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దు
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం... కార్మికులంతా సంఘటితంగా ఉద్యమించి డిమాండ్ల సాధనకు దీక్షగా సమ్మెలో పాల్గొన్నారు. విధుల్లో చేరండంటూ ముఖ్యమంత్రి మూడు సార్లు పిలిచినా స్పందించకుండా కార్మిక సంఘ నేతల సూచనలకే పెద్ద పీట వేశారు. ఇప్పుడు తీరు మారిపోయింది. రెండేళ్ల వరకు తమ కార్మిక సంఘాలకు ఎన్నికలే వద్దంటూ ఇప్పుడు ఆ కార్మికుల సంతకాలతోనే మూకుమ్మడి లేఖలు లేబర్ కమిషనర్‌కు అందుతున్నాయి . గత ఆదివారం సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో, రెండేళ్ల వరకు యూనియన్లే అవసరం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిపోల వారీగా ఓ నిర్దేశిత పత్రం సిద్ధం చేసి దానిపై కార్మికుల సంతకాలు తీసుకుని లేబర్ కమిషనర్ కార్యాలయానికి పంపుతున్నారు. దీనిపై మళ్లీ కార్మిక సంఘాల జేఏసీ స్పందించింది. ఇది వేధించటమేనని పేర్కొంటూ నిరసనగా శుక్రవారం డిపోల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది. ‘వెల్ఫేర్ కౌన్సిళ్లపై నమ్మకం ఉన్నందునే...’ డిపో స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం వెల్ఫేర్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని ఆత్మీయ సమ్మేళనంలో సీఎం సూచించారు. ప్రతి డిపో నుంచి ఇద్దరు చొప్పున ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, ఆ కమిటీలే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయన్నారు. రెండేళ్ల వరకు ఇక కార్మిక సంఘాలతో పని ఉండదని, అప్పటి వరకు గుర్తింపు సంఘం ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన పనిలేదని ఆయన వివరించారు. రెండేళ్ల తర్వాత యూనియన్లు అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైతే అప్పుడు చూద్దామని ముక్తాయించారు. దీనికి అనుగుణంగా అధికారులు చర్య లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి లేఖల కార్యక్రమం మొదలైంది. కార్మికుల సమస్యను తక్షణం పరిష్కరించేందుకు ‘వెల్ఫేర్ కౌన్సిళ్లు’కృషి చేస్తాయన్న నమ్మకం తమకు ఉందని, రెండేళ్ల వరకు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు అవసరం లేదని ఏ డిపోకు ఆ డిపోగా ఓ నమూనా సిద్ధం చేసి కార్మికులందరితో సంతకాలు తీసుకుంటున్నారు. జేఏసీ నేతలు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కార్మికులకు ఇష్టం లేకపోయినా, అధికారులు బలవంతంగా వారితో సంతకాలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
శ్వేత.. వన్డే కమిషనర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అప్సా ప్లాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో విద్యార్థిని శ్వేత ఒక్క రోజు జంటనగరాల సంయుక్త కార్మిక శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించింది. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలోని గుండా ఈశ్వరయ్య ప్రభుత్వ పాఠశాలలో శ్వేత 9వ తరగతి చదువుతోంది. తాను ఒక్క రోజు కమిషనర్‌గా విధులు నిర్వహించడం చాలా సంతోషానిచ్చిందని తెలిపింది. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతాధికారిగా స్థిరపడి ప్రజలకు సేవ చేస్తానని వివరించింది. జంటనగరాల సంయుక్త లేబర్ కమిషనర్ డాక్టర్ ఇ.గంగాధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగడానికి ఇలాంటి వారికి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఏఎల్ఓ స్థాయి అధికారులు ప్రభాకర్, పవన్, అప్సా పద్మ, బస్వరాజ్, గౌరి, శంకర్, పట్నాయక్, రాంప్రసాద్ పాల్గొన్నారు. ‘బాలానందం’ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం కాచిగూడ: ఆంధ్ర బాలానంద సంఘం 80వ వార్షికోత్సవం సందర్భంగా జంటనగరాల్లోని బాలబాలికలకు వివిధ అంశాల్లో ప్రతిభా పాట వ పోటీలు నిర్వహిస్తున్నామని ఆసక్తి గల బాల బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బాలానందం కార్యదర్శి జేవీ కామేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులన్నారు. వివరాలకు నారాయణగూడలోని బాలనంద సంఘం కార్యాలయంలో నేరుగా గాని, ఫోన్ నెంబర్ 040– 27561443లో సంప్రదించాలని సూచించారు. -
‘ఎంపీ కేశినేని నానిపై చర్యలు తీసుకోండి’
-
‘ఎంపీ కేశినేని నానిపై చర్యలు తీసుకోండి’
విజయవాడ: కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. పది నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం కార్మికశాఖ కమిషనర్‌ను కలిశారు. జీతాలు చెల్లించమని అడిగితే తమపై దాడి చేశారని వారు ఈ సందర్భంగా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన మొత్తం ఇప్పించి, ఎంపీ కేశినేని నానిపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెప్పాపెట్టకుండా ట్రావెల్స్‌ను మూసివేసి తమకు జీతాలు చెల్లించకుండా ముఖం చాటేశారన్నారు. ఏడాదిగా జీతాల్లేక అప్పులపాలయ్యామని, ఇంకా తమకు అన్యాయం చేయొద్దంటూ కేశినేని ట్రావెల్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బకాయిలతోసహా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేశినేని ట్రావెల్స్ డ్రైవర్లు, సిబ్బంది ప్రత్యక్ష పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. గతవారం విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయాన్ని ముట్టడించారు. ఏపీ, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది కార్మికులు విజయవాడలోని ఎంపీ కేశినేని కార్యాలయం వద్దకు తరలివచ్చి తమ నిరసన తెలిపారు. అప్పటి నుంచి కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కార్మికశాఖ కమిషనర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. -
అక్టోబర్‌లో గుర్తింపు ఎన్నికలు
డిప్యూటీ సీఎల్సీకి లేఖ రాసిన డెరైక్టర్ (పా) గోదావరిఖని : సింగరేణి గుర్తింపు ఎన్నికలు వచ్చే అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది. 2012 జూన్ 28న ఎన్నికలు జరగగా టీబీజీకేఎస్ విజయం సాధించింది. అయి తే ఆగస్టు 6న ఆ సంఘానికి అధికారికంగా లేఖ అందజేశారు. దీంతో నాలుగేళ్ల కాలపరిమితితో ఈ ఏడాది ఆగ స్టు 6వరకు టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సింగరేణిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సంస్థ డెరైక్టర్ (పా) జె.పవిత్రన్‌కుమార్ సీఆర్పీ/పీఈఆర్/ఐఆర్/ఐ/270/1114 ద్వారా సెంట్ర ల్ డిప్యూటీ లేబర్ కమిషనర్‌కు లేఖ రాశారు. దీంతో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. సింగరేణిలో కొత్తగూడెం, రామగుండం-3, భూ పాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లలో టీబీజీకేఎస్ విజయం సా ధించి గుర్తింపు సంఘంగా వ్యవహరిస్తోంది. ఇల్లందు, బెల్లంపల్లి డివిజన్లలో ఏఐటీయూసీ, కొత్తగూడెం కార్పొరేట్, మణుగూర్‌లో ఐఎన్టీయూసీ, రామగుండం-1, రామగుండం-2 డివిజన్లలో హెచ్ ఎం ఎస్ యూనియన్ గెలిచి ప్రాతినిధ్య సంఘాలుగా పనిచేస్తున్నాయి. మార్చి 18వ తేదీనే యూజమాన్యానికి లేఖ.. సింగరేణి లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవచ్చా అనే విషయమై సెంట్రల్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ నుం చి ఈ ఏడాది మార్చి 18న సింగరేణి యాజమాన్యానికి లేఖ అందింది. దీంతో డెరైక్టర్ (పా) జె.పవిత్రన్ కుమా ర్ ఈనెల 7న తిరిగి సెంట్రల్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్‌కు లేఖ పంపించారు. సంస్థలో మే31 నాటికి 56,107 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ప్రస్తుత గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలతో పాటు ఇతర యూనియన వివరాలను సమీకరించాలని ఆ లేఖలో పొందుపర్చారు. ఏయే యూనియన్లు రిజిస్టర్ అయ్యా యి, ఏవి లేవు, ఏవి జాతీయ కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్నాయి అనే వివరాలను తెప్పించుకోవాలని ఆయన కోరారు. కాగా పలు సంఘాలకు చెందిన సభ్యత్వ వివరాలను కూడా డెరైక్టర్ (పా) లేబర్ కమిషనర్‌కు అందజేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో లేబర్ కమిషనర్ కార్మిక సంఘాల వివరాలను, ఆయా డివిజన్ల లో రహస్య ఓటిం గ్‌కు అవసరమైన ఏర్పాట్లను పరిశీ లిస్తున్నారని, అక్టోబర్‌లో ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారని సమాచారం. కాగా.. కాలయాపన జరగకుండా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ప్రాతినిధ్య సంఘాలు కూడా యాజమాన్యం, లేబర్ కమిషనర్‌పై ఒత్తిడి తీసుకొస్తుండడం గమనార్హం. -
ఈ నెలలోనే ఫేకర్ సమస్య పరిష్కరిస్తా..మంత్రి మృణాళిని
గరివిడి : ఈ నెలాకరుకల్లా ఫేకర్ లాకౌట్‌ను ఎత్తివేసే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణాశాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన మంత్రి మృణిళినిని ఫేకర్ కార్మికులు కుటుంబ సభ్యుల తో కలిశారు. ఏడు నెలల కిందట ఫేకర్ పరిశ్రమను లాకౌట్ చేయడంతో పస్తులుండాల్సి వస్తోందని కార్మికు లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంతి స్పందిస్తూ, ఈ నెలలో లేబర్ కమిషనర్, కార్మిక శాఖ మంత్రి, ఫేకర్ యాజమాన్యం, కార్మికుల సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అలాగే కార్మికులు కూడా పట్టు విడుపుతో వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల వైస్ ఎంపీపీ బలగం వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. ‘పెద్ద చెరువుకు శాశ్వత ర్యాంప్ నిర్మించాలి’ విజయనగరం మున్సిపాలిటీ : ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే పైడితల్లమ్మ తెప్పోత్సవానికి పెద్ద చెరువు వద్ద శాశ్వత ర్యాంప్ నిర్మించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పీవీ రమణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణా శాఖ మంత్రి కిమిడి మృణాళినికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, తెప్పోత్సవానికి సంబంధించి ప్రతి సం వత్సరం పెద్ద చెరువు వద్ద తాత్కాలిక ర్యాంప్ నిర్మించడానికి డబ్బులు ఖర్చు చేస్తున్నారని, అయితే అవసరం తీరాక పట్టించుకోకపోవడంతో ర్యాంప్ పాడవుతోందన్నారు. ఇప్పటికైనా శాశ్వత ర్యాంప్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల న్నారు. మినర్వా థియేటర్ నుంచి ఆలయం వరకు, అదేవిధంగా మూడు లాంతర్ల జంక్షన్ నుంచి అర్బన్ బ్యాంకు వరకు తాటాకుల పందిరి వేయాలని కోరారు. పండుగ రోజుల్లో మున్సిపల్ కుళాయిల ద్వారా ఆటం కం లేకుండా నీటి సరఫరా చేపట్టాలన్నారు. వీఐపీ పాస్ లు తగ్గించి సామన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.