డిప్యూటీ సీఎల్‌సీకి లేఖ రాసిన డెరైక్టర్ (పా)
గోదావరిఖని : సింగరేణి గుర్తింపు ఎన్నికలు వచ్చే అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది. 2012 జూన్ 28న ఎన్నికలు జరగగా టీబీజీకేఎస్ విజయం సాధించింది. అయి తే ఆగస్టు 6న ఆ సంఘానికి అధికారికంగా లేఖ అందజేశారు. దీంతో నాలుగేళ్ల కాలపరిమితితో ఈ ఏడాది ఆగ స్టు 6వరకు టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సింగరేణిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సంస్థ డెరైక్టర్ (పా) జె.పవిత్రన్‌కుమార్ సీఆర్‌పీ/పీఈఆర్/ఐఆర్/ఐ/270/1114 ద్వారా సెంట్ర ల్ డిప్యూటీ లేబర్ కమిషనర్‌కు లేఖ రాశారు. దీంతో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. సింగరేణిలో కొత్తగూడెం, రామగుండం-3, భూ పాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లలో టీబీజీకేఎస్ విజయం సా ధించి గుర్తింపు సంఘంగా వ్యవహరిస్తోంది. ఇల్లందు, బెల్లంపల్లి డివిజన్లలో ఏఐటీయూసీ, కొత్తగూడెం కార్పొరేట్, మణుగూర్‌లో ఐఎన్‌టీయూసీ, రామగుండం-1, రామగుండం-2 డివిజన్లలో హెచ్ ఎం ఎస్ యూనియన్ గెలిచి ప్రాతినిధ్య సంఘాలుగా పనిచేస్తున్నాయి.
మార్చి 18వ తేదీనే యూజమాన్యానికి లేఖ..
సింగరేణి లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవచ్చా అనే విషయమై సెంట్రల్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ నుం చి ఈ ఏడాది మార్చి 18న సింగరేణి యాజమాన్యానికి లేఖ అందింది. దీంతో డెరైక్టర్ (పా) జె.పవిత్రన్ కుమా ర్ ఈనెల 7న తిరిగి సెంట్రల్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్‌కు లేఖ పంపించారు. సంస్థలో మే31 నాటికి 56,107 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ప్రస్తుత గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలతో పాటు ఇతర యూనియన వివరాలను సమీకరించాలని ఆ లేఖలో పొందుపర్చారు. ఏయే యూనియన్లు రిజిస్టర్ అయ్యా యి, ఏవి లేవు, ఏవి జాతీయ కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్నాయి అనే వివరాలను తెప్పించుకోవాలని ఆయన కోరారు. కాగా పలు సంఘాలకు చెందిన సభ్యత్వ వివరాలను కూడా డెరైక్టర్ (పా) లేబర్ కమిషనర్‌కు అందజేసినట్టు తెలిసింది.
ఈ క్రమంలో లేబర్ కమిషనర్ కార్మిక సంఘాల వివరాలను, ఆయా డివిజన్ల లో రహస్య ఓటిం గ్‌కు అవసరమైన ఏర్పాట్లను పరిశీ లిస్తున్నారని, అక్టోబర్‌లో ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారని సమాచారం. కాగా.. కాలయాపన జరగకుండా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ప్రాతినిధ్య సంఘాలు కూడా యాజమాన్యం, లేబర్ కమిషనర్‌పై ఒత్తిడి తీసుకొస్తుండడం గమనార్హం.
అక్టోబర్‌లో గుర్తింపు ఎన్నికలు
Published Wed, Jul 13 2016 12:25 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement