
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ కింద ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
వివరాల ప్రకారం.. దత్తసాయి కాంప్లెక్స్‌లో కమర్షియల్‌లో కాసేపటి క్రితం మంటలు చెలరేగాయి. దీంతో, సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రెండు ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, దత్తసాయి కాంప్లెక్స్‌కు తపాడియా ఆసుపత్రి ఆనుకొని ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
అయితే, కాంప్లెక్స్ నుంచి మంటలు చెలరేగుతుండటంతో తపాడియా ఆసుపత్రి నుంచి రోగులను కిందకు దింపుతున్నారు అధికారులు. మరోవైపు.. ఆర్టీసీ క్రాస్ రోడ్‌వైపు వస్తున్న వాహనాలను ముషీరాబాద్‌లోనే నిలిపిస్తున్నారు. దీంతో, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment