సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పలుచోట్ల వాహనాలను దారి మళ్లించారు. వాహనాల దారి మళ్లింపులో పొరపాటు చోటుచేసుకోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు భారీగా వాహనాలు వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ముషీరాబాద్ వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ సంభవించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొనసాగుతున్న శోభాయాత్ర
మరోవైపు భారీ భద్రత నడుమ హనుమాన్ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఉదయం గౌలిగూడ నుంచి ప్రారంభమైన యాత్ర తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగనుంది. వందలాది వాహనాలు, వేలాదిమందితో భక్తుల నడుమ యాత్ర కొనసాగుతోంది. దారి పొడవునా భజనలు, డప్పు వాయిద్యాలు, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతున్నాయి.
శోభాయాత్ర సందర్భంగా సున్నిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది పోలీసులతో బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటరకు ఓ సీనియర్ పోలీస్ అధికారితో పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment