hanuman shobha yatra
-
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభాయాత్రలో గాడ్సే ఫోటో ప్రదర్శించారని మండిపడ్డారు. దేశంలో తొలి టెర్రరిస్టు నాథురామ్ గాడ్సేనేనని.. ఆయన ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాము లాడెన్, హజరీ ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో శ్రీరామనవమి రోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభాయాత్రలో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఫొటో దర్శనం ఇవ్వడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ స్పందిస్తూ...హనుమాన్ శోభయాత్రలో గాడ్సే ఫొటోలు ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు. చదవండి: వీడిన సస్పెన్స్.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డి -
హనుమాన్ శోభాయాత్రలో హింస
న్యూఢిల్లీ: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో శనివారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటిదాకా 21 మందిని అరెస్టు చేసినట్లు, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు అన్సర్‌తోపాటు ఎస్సైపై కాల్పులు జరిపాడంటున్న మహ్మద్ అస్లాంను అరెస్టు చేశామన్నారు. అస్లాం నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నారు. ‘మసీదు సమీపంలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దాడులకు దిగాయి. 8 మంది పోలీసులు, ఒక స్థానికుడు గాయపడ్డారు. నిందితుల నుంచి మూడు తుపాకులు, ఐదు కత్తులు స్వాధీనం చేసుకున్నాం. ఇతర నిందితులనూ గుర్తిస్తాం. బులెట్ గాయాలైన ఎస్ఐ పరిస్థితి నిలకడగా ఉంది’ అని తెలిపారు. 2020 ఫిబ్రవరి తర్వాత ఢిల్లీలో మత ఘర్షణలు ఇదే మొదటిసారి. ఆదివారం జహంగీర్‌పూర్‌లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారు. ఒక వర్గంపైనే కేసులు సరి కాదని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా అన్నారు. బయటివారి కుట్రే శోభాయాత్ర సందర్భంగా ఓ వర్గానికి చెందిన ప్రార్థన మందిరంలోకి చొరబడి మతపరమైన జెండాలను ఎగురవేసేందుకు కొందరు ప్రయత్నించారని, రెచ్చగొట్టేలా నినాదాలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్లే ఘర్షణ జరిగిందని అంటున్నారు. సి–బ్లాక్ మసీదు వద్ద ఘర్షణకు దిగినవారు ఇక్కడివారు కాదని, బయటి నుంచి వచ్చినవారేనని స్థానికులు చెబుతున్నారు. జహంగీర్‌పూర్‌లో హిందువులు, ముస్లింలు దశాబ్దాలుగా కలసిమెలిసి జీవిస్తున్నారని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంటున్నారు. బయటి శక్తులు తమ మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయని మండిపడుతున్నారు. వారిపైనా ఎఫ్ఐఆర్: ఎన్సీపీసీఆర్ ఢిల్లీ మతఘర్షణల్లో చిన్నారులు భాగస్వాములై రాళ్లు విసరడం పట్ల జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆదివారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణల్లో పిల్లలను వాడుకున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను అదేశించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది. హింస కోసం పిల్లలను వాడుకోవడం జువెనైల్ జస్టిస్ చట్టం కింద నేరమేనని గుర్తుచేసింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారిపై కేసులు పెట్టాలని పేర్కొంది. నిందితులపై చేపట్టిన చర్యలపై వారంలోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. ఉత్తరాఖండ్‌లోనూ.. హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో భగవాన్‌పూర్ ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా శనివారం ఘర్షణ జరిగింది. ప్రదర్శనలో పాల్గొంటున్నవారిపై మరోవర్గం ప్రజలు రాళ్లు రువ్వారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారని చెప్పారు. ఘర్షణకు కారణమైన 9 మంది నిందితులను అరెస్టు చేశామని, 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు. -
కోవిడ్ ఎఫెక్ట్: హనుమాన్ శోభాయాత్ర రద్దు
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఏటా నిర్వహించే ‘హనుమాన్ శోభాయాత్ర’ రద్దు అయింది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు నిర్వహించే హనుమాన్ శోభాయాత్రను రద్దు చేసినట్లు భజరంగ్‌దళ్ ప్రకటించింది. కరోనా పెరగుతున్న నేపథ్యంలో శోభాయాత్రకు భారీగా భక్తులు తరలిరావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హనుమాన్ శోభాయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 21 మందితో మాత్రమే శోభాయాత్ర నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. శోభాయాత్రలో 21 మందికి మించి పాల్గొనకూడదని ఆదేశించింది. శోభాయాత్రను వీడియో తీసి నివేదిక సమర్పించాలని తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటించాలని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే భక్తుల తాకిడి ఎక్కువ కావటం వల్ల శోభాయాత్రను రద్దు చేసినట్లు భజరంగ్‌దళ్ తెలిపింది. చదవండి: Kamareddy District: కరోనాతో ఎస్ఐ గణపతి మృతి -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
-
అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. శుక్రవారం గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర తాడ్‌బండ్ ఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగనుంది. ప్రస్తుతం శోభాయాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు చేరుకుంది. శోభాయాత్రలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం 15 ప్రాంతాల నుంచి వచ్చే ఊరేగింపులు ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి. సైబరాబాద్‌తో పాటు నగరంలోని తూర్పు, మధ్య, ఉత్తర మండలాల్లో మొత్తం 27 కి.మీ మేర ఊరేగింపు జరగనుంది. హనుమాన్ ఊరేగింపు కోసం పోలీసులు 12 వేల మందితో బందోబస్తు, 450 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు.. శోభాయాత్రలో పాల్గొంటున్నారు. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
-
శోభాయాత్ర: నగరంలో భారీగా ట్రాఫిక్‌జాం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పలుచోట్ల వాహనాలను దారి మళ్లించారు. వాహనాల దారి మళ్లింపులో పొరపాటు చోటుచేసుకోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు భారీగా వాహనాలు వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ముషీరాబాద్ వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ సంభవించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనసాగుతున్న శోభాయాత్ర మరోవైపు భారీ భద్రత నడుమ హనుమాన్ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఉదయం గౌలిగూడ నుంచి ప్రారంభమైన యాత్ర తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగనుంది. వందలాది వాహనాలు, వేలాదిమందితో భక్తుల నడుమ యాత్ర కొనసాగుతోంది. దారి పొడవునా భజనలు, డప్పు వాయిద్యాలు, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతున్నాయి. శోభాయాత్ర సందర్భంగా సున్నిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది పోలీసులతో బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటరకు ఓ సీనియర్ పోలీస్ అధికారితో పర్యవేక్షిస్తున్నారు. -
ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర
-
పోలీసులతో భజరంగ్‌దళ్ కార్యకర్తల వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్ : హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భజరంగ్‌దళ్ కార్యకర్తల మధ్య శనివారం వాగ్వాదం చోటు చేసుకుంది. శోభాయాత్రలో సౌండ్ సిస్టంను వినియోగించడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఈ వివాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది. గౌలిగూడలో యాత్ర ప్రారంభానికి ముందు పాటలతో సౌండ్ సిస్టంను పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. యాత్రలో సౌండ్ సిస్టం వినియోగించడానికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. భజరంగ్‌దళ్ ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టంను తీసుకెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన భజరంగ్‌దళ్ కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదాలతో పోలీసులను నిలువరించారు. వెనక్కు తగ్గిన పోలీసులు సౌండ్ సిస్టమ్‌కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. -
హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు
-
యాదాద్రిలో హనుమాన్ శోభాయాత్ర
యాదాద్రి: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో శోభాయాత్ర నిర్వహించారు. రెండు వేల మందితో గుండ్లపల్లి నుంచి వైకుంఠ ద్వారం వరకు మూడు గంటలపాటు శోభాయాత్ర జరిగింది. ఈ యాత్రలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. శోభాయాత్రను తిలకించడానికి వచ్చిన భక్తులతో యాదాద్రి పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. -
ఘనంగా ముగిసిన హనుమాన్ శోభా యాత్ర