
సాక్షి, హైదరాబాద్ : హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భజరంగ్‌దళ్ కార్యకర్తల మధ్య శనివారం వాగ్వాదం చోటు చేసుకుంది. శోభాయాత్రలో సౌండ్ సిస్టంను వినియోగించడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఈ వివాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది.
గౌలిగూడలో యాత్ర ప్రారంభానికి ముందు పాటలతో సౌండ్ సిస్టంను పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. యాత్రలో సౌండ్ సిస్టం వినియోగించడానికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. భజరంగ్‌దళ్ ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టంను తీసుకెళ్లిపోయారు.
దీంతో ఆగ్రహించిన భజరంగ్‌దళ్ కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదాలతో పోలీసులను నిలువరించారు. వెనక్కు తగ్గిన పోలీసులు సౌండ్ సిస్టమ్‌కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment