bhajarang dal
-
ఆగ్రహించిన విశ్వహిందూ పరిషత్
సాక్షి, విజయవాడ : పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయటాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తున్నాయి. గురువారం విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద వీహెచ్‌పీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు, హిందుత్వ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామవరప్పాడు వరకు వారు ర్యాలీని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. రామవరప్పాడుకు ర్యాలీగా వస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ.. గురువారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌లు నగర దిగ్భందం చేశాయి. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. పెద్దపల్లి : తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విశ్వసిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను వారు తప్పు పట్టారు. గురువారం గోదావరిఖనిలో రాజీవ్ రహదారిపై వీహెచ్‌పీ రాస్తారోకో చేపట్టింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆయనపై ఉన్న బహిష్కరణను రద్దు చేయాలంటూ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు కూకట్పల్లి జాతీయ రహదారిపై బైఠాయించారు. -
విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని అమెరికా రాయబార కార్యలయ ముట్టడికి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ పిలుపు నిచ్చాయి. అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ సీఐఏ హిందూ ధార్మిక సంస్థలైన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్లను మిలిటెంట్లుగా పేర్కొనటాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ.. సోమవారం బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాయి. దీంతో అమెరికా రాయబార కార్యాలయం ఎదుట భారీగా భద్రతా దళాలు మోహరించాయి. అమెరికాకు చెందిన ‘‘సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ’’(సీఐఏ) ప్రతి సంవత్సరం ‘‘వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ ’’ పేరిట ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తుంటుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన పుస్తకంలో హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మిలిటెంట్లుగా పేర్కొంది. వాటిని రాజకీయ ఒత్తుడులకు పాల్పడే సంస్థలుగానూ, ఆర్ఎస్ఎస్ను జాతీయ సంస్థగా పేర్కొంది. -
‘ఆ ఘర్షణల వెనుక బీజేపీ, బజరంగ్దళ్’
పట్నా : గత నెల 25న జరిగిన శ్రీరామ నవమి ర్యాలీలలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు భారతీయ జనతా పార్టీ, బజరంగ్ దళ్ కారణంగానే జరిగినట్టు ఓ నివేదిక పేర్కొంది. ఈ నెల 9న ‘యునైటెడ్ ఏజెంట్ హేట్’ అనే సంస్థ ఘర్షణలు జరగడానికి గల కారణాలను మీడియాకు వివరిస్తూ.. ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్స్ అనే రిపోర్టును విడుదల చేసింది. ఈ సంస్థకు చెందిన కొంతమంది ఏప్రిల్ 3 నుంచి 7 తేదీ వరకు బిహార్‌లో ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో పర్యటించారు. నివేదిక ప్రకారం, వారు పర్యటించిన జిల్లాల్లో ఘర్షణల వెనుక కొన్ని సారూప్యతలు కనుగొన్నట్టు తెలిపారు. ఈ ఘర్షణల వెనుక బీజేపీ, బజరంగ్ దళ్ హస్తం ఉన్నట్టు నివేదికలో తెలిపారు. చాలావరకు ఘర్షణలు జరిగిన తీరు ఒకే రీతిలో ఉందని అన్నారు. కొత్తగా ఏర్పాటైన కొన్ని సంఘాలు జిల్లా అధికారుల నుంచి రామ నవమి ర్యాలీల కోసం అనుమతి పొందాయని, ఘర్షణలు జరిగిన జిల్లాల్లో అప్పటికప్పుడు కొన్ని కొత్త సంఘాలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. ర్యాలీ నిర్వహించేటప్పుడు యువకులు వందల సంఖ్యలో ద్విచక్రవాహనాలపై రావడం, కత్తులతో, తుపాకులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవిధంగా ప్రదర్శనలు నిర్వహించాయని పేర్కొన్నారు. ఇతర మతస్తులు అధికంగా నివాసముండే ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించడం కూడా ఘర్షణలకు దారితీసిందని తెలిపారు. గత కొన్ని సంత్సరాలుగా సంప్రదాయబద్ధంగా ర్యాలీలను నిర్వహిస్తున్న సంస్థలు ఇటువంటి పనులకు దూరంగా ఉన్నాయని వెల్లడించారు. దురుద్దేశంతో కొంతమంది కావాలనే కొన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారని, వారి దుకాణాలను తగలబెట్టడం, ఇళ్లపై రాళ్లు విసరడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. -
పోలీసులతో భజరంగ్‌దళ్ కార్యకర్తల వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్ : హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భజరంగ్‌దళ్ కార్యకర్తల మధ్య శనివారం వాగ్వాదం చోటు చేసుకుంది. శోభాయాత్రలో సౌండ్ సిస్టంను వినియోగించడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఈ వివాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది. గౌలిగూడలో యాత్ర ప్రారంభానికి ముందు పాటలతో సౌండ్ సిస్టంను పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. యాత్రలో సౌండ్ సిస్టం వినియోగించడానికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. భజరంగ్‌దళ్ ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టంను తీసుకెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన భజరంగ్‌దళ్ కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదాలతో పోలీసులను నిలువరించారు. వెనక్కు తగ్గిన పోలీసులు సౌండ్ సిస్టమ్‌కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. -
న్యాయం గుడ్డిదేగానీ మరీ ఇంతగా......
-
న్యాయం గుడ్డిదేగానీ మరీ ఇంతా......
సాక్షి, బెంగళూరు: మంగళూరులోని ఓ పబ్‌లో ఓ యువకుల బృందం దౌర్జన్యంగా యువతుల జుట్టు పట్టుకొని కొట్టడం, వారు కింద పడిపోవడం, పారిపోయేందుకు ప్రయత్నించడం లాంటి దశ్యాలు 2009, జనవరి 24వ తేదీన దేశవ్యాప్తంగా టీవీ ఛానళ్లలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. దెబ్బలు తిన్న మహిళలు పబ్‌కు మద్యం సేవించేందుకు వచ్చిన వినియోగదారులని, దౌర్జన్యంగా దెబ్బలు కొట్టిన వారంతా కర్ణాటకలో హిందూ సంస్థగా పేరుపొందిన ‘శ్రీరామ్ సేన’ సభ్యులని పోలీసులతోపాటు సమాజమూ గుర్తించింది. మహిళలు పబ్‌లకు వెళ్లడమంటే సంస్కృతిపై దాడి చేయడమేనని, అందుకనే వారికి తగిన శాస్తి జరిగిందంటూ శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ నాడు సంఘటనను సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. ఈ దాడికి పాల్పడిందీ తామేనంటూ ఇటు శ్రీరామ్ సేన, అంటూ భజరంగ్ దళ్ సంస్థలు పోటా పోటీగా ప్రకటించుకున్నాయి. తమ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని, ఇందులో భజరంగ్ దళ్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ శ్రీరామ్ సేన జిల్లా కన్వీనర్ కుమార్ మాలేమర్ బహిరంగ ప్రకటన చేశారు. ఈ సంఘటనను జాతీయ మహిళా కమిషన్‌కు కూడా తీవ్రంగా పరిగణించడంతో పోలీసులు కేసు నమోదు చేసి 30 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ప్రమోద్ ముతాలిక్ కూడా ఉన్నారు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఆయన్ని పార్టీలోకి ఎలా తీసుకుంటారని బీజేపీ జాతీయ నాయకత్వం ప్రశ్నించడంతో బీజేపీ కర్ణాటక శాఖ వెంటనే ఆయన్ని పార్టీ నుంచి తొలగించింది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ఈ సంఘటనపై మంగళూరులోని ఫస్ట్‌క్లాస్ కోర్టుకు చెందిన థర్డ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (12.03.18) సోమవారం నాడు తీర్పు చెప్పారు. నిందితులు నిర్దోషులంటూ 30 పేజీల తీర్పును చదివారు. ‘ఈ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు దర్యాప్తు అధికారులు మహిళా వినియోగదారులను కోర్టు ముందు ప్రవేశపెట్టలేక పోయారు. చార్జిషీటులో వారిని సాక్షులుగా చూపలేదు. ఈ కేసులో మహిళా వినియోగదారులే బాధితులు. వారే మంచి సాక్షులు కూడా అవుతారు. వారిని దర్యాప్తు అధికారులు విచారించి ఉంటే నిజం బయటకు వచ్చేది. ఈ కేసులో ఫొటోలు, వీడియోలు చాలా ముఖ్యమైన సాక్ష్యాధారాలు. వాటిని దర్యాప్తు అధికారులు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టలేక పోయారు. ఇలాంటి సాక్ష్యాధారలు చూపక పోవడం ఈ కేసుకు ప్రాణాంతకంగా మారింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో చాలా జాప్యం జరిగింది. జాప్యానికి కారణాలు కూడా వివరించలేదు. ఓ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ జడ్జిమెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగే జాప్యం కూడా కేసు మరణానికి కారణం అవుతుంది. నేరం రుజువు కానందున ఈ కేసులో నిందితులంతా నిర్ధోషులే’ అంటూ కోర్టు తీర్పు చెప్పింది. ‘మమ్మల్ని వ్యతిరేకించిన వారికి, మమ్మల్ని గూండాలని దూషించిన వారికి ఈ తీర్పు ఓ సమాధానం’ అని తీర్పు పట్ల ప్రమాద్ ముతాలిక్ వ్యాఖ్యానించగా, న్యాయం గుడ్డిదని తెలుసుకానీ, మరింత గుడ్డిదని తెలియదని కొందర సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు పాఠం చదివితే చాలు, ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేకుండానే న్యాయం ఏమిటో పాఠకులకు బోధపడుతుంది. దర్యాప్తులో ఘోరంగా విఫలమైన దర్యాప్తు అధికారులను దోషిగా ఎందుకు ప్రకటించలేదో ఎందరికి అర్థం అవుతుంది? -
హైదరాబాద్ లో పార్కులు మూసివేత
సాక్షి, హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్స్ డే) సందర్భంగా హైదరాబాద్‌లో పార్కులు మూసివేశారు. ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని భజరంగ్ దళ్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో భజరంగ్ దళ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా మారువేశాల్లో షీ టీమ్స్ నిఘా పెట్టాయి. అంతేకాక పార్కులు, హోటల్స్, పబ్బులు, బార్ల వద్ద పోలీస్ బందోబస్తు పెరిగిపోయింది. నగరంలో హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డులో పోలీసులు బందోబస్తును పెంచారు. మరోవైపు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వాలంటైన్ వేడుకలను నిషేధించిన లక్నో వర్సిటీ లక్నో: వాలంటైన్స్ డే వేడుకలను లక్నో యూనివర్సిటీ నిషేధించింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని అధికారులు బుధవారం వర్సిటీకి సెలవు ప్రకటించారు. వాలంటైన్స్ డే కూడా కావటంతో విద్యార్థులెవరైనా క్యాంపస్‌లో తిరిగినా, కూర్చున్నట్లు కనిపించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈనెల 14వ తేదీన తమ పిల్లలను వర్సిటీకి పంపవద్దంటూ తల్లిదండ్రులకు కూడా సమాచారం పంపారు. విదేశీ సంస్కృతి మోజులో పడిన కొందరు గత ఏడాది వర్సిటీ క్యాంపస్‌లో వాలంటైన్స్‌డే జరిపినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
గుండు కొట్టించి, గాడిదపై ఊరేగించారు
లక్నో: బలవంతంగా మతమార్పిడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని దారుణంగా అవమానించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఒరాయ్ జిల్లాలో ప్రకంపనలు రేపింది. జలౌన్ జిల్లాకు చెందిన ఆద్వేష్ అనే వ్యక్తికి గుండు గీసి, చెప్పుల దండ మెడలో వేసి పట్టపగలు, నడి వీధుల్లో ఊరేగించారు. వివరాల్లోకి వెళితే ముగ్గురు హిందువులను క్రైస్తవ మతం లోకి మార్చి, వారితో బీఫ్ తినిపించారనే ఆరోపణలతో భజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ చేసి వారిని సత్సంగ్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడంటూ వీరంగం సృష్టించారు. దాదాపు 200 మంది కార్యకర్తలు జలౌన్ జిల్లాలోని ఆద్వేష్ సవిత ఇంటిపై దాడి చేశారు. అతడిని బలవంతంగా బయటికి లాక్కొచ్చి, గుండు కొట్టించారు. కనుబొమ్మలు, మీసాన్ని సైతం తీసివేయించారు. అనంతరం గాడిదపై ఊరేగిస్తూ ఒరాయ్ జిల్లాకు తీసుకొచ్చారు. మరోవైపు బాధితుల ఫిర్యాదు మేరకు ఈ సంఘటపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం.