ప్రేమికులు (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్స్ డే) సందర్భంగా హైదరాబాద్‌లో పార్కులు మూసివేశారు. ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని భజరంగ్ దళ్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో భజరంగ్ దళ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా మారువేశాల్లో షీ టీమ్స్ నిఘా పెట్టాయి. అంతేకాక పార్కులు, హోటల్స్, పబ్బులు, బార్ల వద్ద పోలీస్ బందోబస్తు పెరిగిపోయింది. నగరంలో హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డులో పోలీసులు బందోబస్తును పెంచారు. మరోవైపు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వాలంటైన్ వేడుకలను నిషేధించిన లక్నో వర్సిటీ
లక్నో: వాలంటైన్స్ డే వేడుకలను లక్నో యూనివర్సిటీ నిషేధించింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని అధికారులు బుధవారం వర్సిటీకి సెలవు ప్రకటించారు. వాలంటైన్స్ డే కూడా కావటంతో విద్యార్థులెవరైనా క్యాంపస్‌లో తిరిగినా, కూర్చున్నట్లు కనిపించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈనెల 14వ తేదీన తమ పిల్లలను వర్సిటీకి పంపవద్దంటూ తల్లిదండ్రులకు కూడా సమాచారం పంపారు. విదేశీ సంస్కృతి మోజులో పడిన కొందరు గత ఏడాది వర్సిటీ క్యాంపస్‌లో వాలంటైన్స్‌డే జరిపినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment