
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. శుక్రవారం గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర తాడ్‌బండ్ ఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగనుంది. ప్రస్తుతం శోభాయాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు చేరుకుంది. శోభాయాత్రలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం 15 ప్రాంతాల నుంచి వచ్చే ఊరేగింపులు ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి. సైబరాబాద్‌తో పాటు నగరంలోని తూర్పు, మధ్య, ఉత్తర మండలాల్లో మొత్తం 27 కి.మీ మేర ఊరేగింపు జరగనుంది.
హనుమాన్ ఊరేగింపు కోసం పోలీసులు 12 వేల మందితో బందోబస్తు, 450 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు.. శోభాయాత్రలో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment