
(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఏటా నిర్వహించే ‘హనుమాన్ శోభాయాత్ర’ రద్దు అయింది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు నిర్వహించే హనుమాన్ శోభాయాత్రను రద్దు చేసినట్లు భజరంగ్‌దళ్ ప్రకటించింది. కరోనా పెరగుతున్న నేపథ్యంలో శోభాయాత్రకు భారీగా భక్తులు తరలిరావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హనుమాన్ శోభాయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
21 మందితో మాత్రమే శోభాయాత్ర నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. శోభాయాత్రలో 21 మందికి మించి పాల్గొనకూడదని ఆదేశించింది. శోభాయాత్రను వీడియో తీసి నివేదిక సమర్పించాలని తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటించాలని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే భక్తుల తాకిడి ఎక్కువ కావటం వల్ల శోభాయాత్రను రద్దు చేసినట్లు భజరంగ్‌దళ్ తెలిపింది.
చదవండి: Kamareddy District: కరోనాతో ఎస్‌ఐ గణపతి మృతి