
యాదాద్రిలో హనుమాన్ శోభాయాత్ర
యాదాద్రి: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో శోభాయాత్ర నిర్వహించారు. రెండు వేల మందితో గుండ్లపల్లి నుంచి వైకుంఠ ద్వారం వరకు మూడు గంటలపాటు శోభాయాత్ర జరిగింది. ఈ యాత్రలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. శోభాయాత్రను తిలకించడానికి వచ్చిన భక్తులతో యాదాద్రి పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.