కోల్‌కతా: ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఆ జట్టు ఖాతాలో గెలుపు చేరింది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పాక్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. బంగ్లాకు ఇది ఆరో పరాజయం కాగా...తాజా ఫలితంతో సెమీస్ అవకాశాలు కోల్పోయి టోర్నీనుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా బంగ్లా నిలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మహ్ముదుల్లా (70 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్), లిటన్ దాస్ (64 బంతుల్లో 45; 6 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (64 బంతుల్లో 43; 4 ఫోర్లు) రాణించారు. షాహిన్ అఫ్రిది 3 కీలక వికెట్లతో బంగ్లాను దెబ్బ తీశాడు. అనంతరం పాక్ 32.3 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫఖర్ జమాన్ (74 బంతుల్లో 81; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్ (69 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 21.1 ఓవర్లలో 160 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మరో 17.3 ఓవర్లు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యం చేరిన పాక్ టోర్నీలో తమ ఆశలు నిలబెట్టుకుంది. వరుసగా భారత్, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన తర్వాత పాకిస్తాన్‌కు ఈ విజయం దక్కింది.
స్కోరు వివరాలు:
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్‌జీద్ (ఎల్బీ) (బి) షాహిన్ 0; దాస్ (సి) సల్మాన్ (బి) ఇఫ్తికార్ 45; నజు్మల్ (సి) ఉసామా (బి) షాహిన్ 4; ముష్ఫికర్ (సి) రిజ్వాన్ (బి) రవూఫ్ 5; మహ్ముదుల్లా (బి) షాహిన్ 56; షకీబ్ (సి) సల్మాన్ (బి) రవూఫ్ 43; తౌహీద్ (సి) ఇఫ్తికార్ (బి) ఉసామా 7; మిరాజ్ (బి) వసీమ్ 25; తస్కీన్ (బి) వసీమ్ 6; ముస్తఫిజుర్ (బి) వసీమ్ 3; షరీఫుల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 204. వికెట్ల పతనం: 1–0, 2–6, 3–23, 4–102, 5–130, 6–140, 7–185, 8–200, 9–201, 10–204. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 9–1–23–3, ఇఫ్తికార్ 10–0–44–1, రవూఫ్ 8–0–36–2, వసీమ్ 8.1–1–31–3, ఉసామా 10–0–66–1.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (ఎల్బీ) (బి) మిరాజ్ 68; ఫఖర్ (సి) తౌహీద్ (బి) మిరాజ్ 81; బాబర్ (సి) మహ్మదుల్లా (బి) మిరాజ్ 9; రిజ్వాన్ (నాటౌట్) 26; ఇఫ్తికార్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (32.3 ఓవర్లలో 3 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–128, 2–160, 3–169. బౌలింగ్: తస్కీన్ 6–1–36–0, షరీఫుల్ 4–1–25–0, మిరాజ్ 9–0–60–3, ముస్తఫిజుర్ 7–0–47–0, షకీబ్ 5.3–0–30–0, నజు్మల్ 1–0–5–0.
ప్రపంచకప్‌లో నేడు
న్యూజిలాండ్ X దక్షిణాఫ్రికా
వేదిక: పుణే
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment