టీమిండియాకు బోణీయే కరువాయె | india losses in fifth oneday against newzealand | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 31 2014 3:01 PM | Last Updated on Wed, Mar 20 2024 12:42 PM

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భారత బోణీ కల నెరవేరలేదు. ధోనీసేన మరోసారి చిత్తుగా ఓడింది. సిరీస్‌ పోయింది.. పరువూ పోయింది.. నంబర్‌ వన్‌ ర్యాంకూ గల్లంతైంది. వెల్లింగ్టన్‌లో జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియా ఓడింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ మరోసారి కలిసికట్టుగా విఫలమై.. టీమ్‌ కొంప ముంచారు. శుక్రవారమిక్కడ జరిగిన చివరి, ఐదో వన్డేలో భారత్ 87 పరుగులతో కివీస్ చేతిలో పరాజయం మూటగట్టుకుంది. ఇంతకుముందు సిరీస్ ను సొంతం చేసుకున్న కివీస్ ఆధిక్యాన్ని 4-0కు పెంచుకుంది. మూడో వన్డే టైగా ముగియగా, మిగిలిన మ్యాచ్ ల్లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement