Cricket ODI Series
-
Ind Vs Aus: ‘ఆఖరి’ పంచ్ కోసం.. వరల్డ్ కప్‌కు ముందు చివరి పోరు!
రాజ్‌కోట్: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాంటి స్టార్ బ్యాటర్లు లేకుండానే భారత జట్టు ఆ్రస్టేలియాపై ఇప్పటికే వన్డే సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు వీరిద్దరు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం మైదానంలోకి దిగబోతున్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో మరో 11 రోజుల్లో ఇదే ఆసీస్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో దాని కోసం చివరి ట్రయల్‌గా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. మరో నలుగురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి టీమిండియా తమ సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధం కాగా, ఆసీస్ మాత్రం ప్రధాన ఆటగాళ్లందరినీ ఆడించనుంది. ఆసీస్‌పై తొలిసారి వన్డేల్లో క్లీన్‌స్వీప్ కోసం భారత్ సిద్ధం కాగా, మరోవైపు వరుసగా ఆరో వన్డేలో ఓడిపోకుండా పరువు కాపాడుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఇరు జట్ల మధ్య సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. రాజ్‌కోట్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ కావడంతో భారీ స్కోరు నమోదు కావడం ఖాయం. జోరు కొనసాగిస్తారా..? ఈ మ్యాచ్ నుంచి భారత జట్టు గిల్, హార్దిక్, శార్దుల్, షమీలకు విశ్రాంతినిచి్చంది. తొలి రెండు మ్యాచ్‌లు ఆడని రోహిత్, కోహ్లి, సిరాజ్, కుల్దీప్, గత మ్యాచ్‌కు దూరమైన బుమ్రా బుధవారం పోరుకు సిద్ధమయ్యారు. ఆటగాళ్లు మారినా ఓవరాల్‌గా భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఆటగాళ్ల తాజా ఫామ్‌ను బట్టి చూస్తే చివరి వన్డేలోనూ భారత్ పైచేయి సాధించేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయి. ఆసియా కప్ ఫైనల్ తర్వాత సిరాజ్ మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. బుమ్రా పదునైన బంతులతో ఆసీస్‌ను కట్టడి చేయగలడు. రాహుల్, శ్రేయస్, సూర్యలతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్‌తో భారత్ మరోసారి భారీ స్కోరు సాధించగలదు. అనుభవజు్ఞడిగా తన విలువేంటో అశి్వన్ గత రెండు మ్యాచ్‌లలో చూపించి తన వరల్డ్ కప్ అవకాశాలు మెరుగుపర్చుకున్నాడు. రోహిత్‌తో పాటు ఇషాన్ ఓపెనర్‌గా ఆడతాడు. -
నెంబర్ వన్ పోయె.. పరువూ పోయె..!
వన్డే క్రికెట్లో టీమిండియా ప్రపంచ చాంపియన్. న్యూజిలాండ్ పర్యటనకు ముందు ర్యాంకింగ్స్ లోనూ నెంబర్ వన్. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ప్రపంచ కప్ కు ఆతిథ్యమివ్వనుండటంతో.. ధోనీసేన కివీస్ గడ్డపై సత్తాచాటాలనే లక్ష్యంతో వెళ్లింది. అయితే సీన్ రివర్సయింది. విదేశీ గడ్డపై తడబడే బలహీనత టీమిండియాను మరోసారి వెంటాడింది. బౌలర్లు ఘోరంగా విఫలమవ్వగా, బ్యాట్స్ మెన్ దీ దాదాపు అదే పరిస్థితి. ధోనీసేన అన్ని విభాగాల్లో విఫలమైంది. ఫలితంగా వన్డే సిరీస్ లో చిత్తుగా ఓడిపోయింది. సిరీస్ సంగతి అటుంచి వరుస పరాజయాలతో నెంబర్ వన్ ర్యాంక్ చేజార్చుకుంది. చివరి వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ధోనీసేన ఆరాటపడినా బోణీయే కొట్టకుండా సిరీస్ ముగించింది. సొంతగడ్డపై సత్తాచాటిన కివీస్ 4-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది. మూడో వన్డేలో మాత్రం రాణించిన భారత్ అతికష్టమ్మీద టైగా ముగించింది. భారత్ ఉపఖండంలోనే పులి అన్న విమర్శను ధోనీసేన మరోసారి చెత్తప్రదర్శనతో నిజం చేసింది. విదేశీ పరిస్థితులు, అక్కడి పిచ్ లపై తడబడటం భారత ఆటగాళ్ల బలహీనత. న్యూజిలాండ్ తో పోలీస్తే టీమిండియా అన్ని విధాల పటిష్టమైన జట్టు. అయితే కివీస్ స్వదేశంలో సానుకూల పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోగా.. భారత ఆటగాళ్లు తేలిపోయారు. ఓపెనర్లు విఫలమవడం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపించింది. బ్యాటింగ్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ, ధోనీ మాత్రమే నిలకడగా రాణించారు. జడేజా రెండు మ్యాచ్ ల్లో మెరుపులు మెరిపించాడు. అయితే ఇతర ఆటగాళ్లు బ్యాట్లెత్తేయడంతో విజయం అందని ద్రాక్షగానే మిగిలింది. ఓపెనర్లను మార్చినా, జట్టుకు భారంగా మారిన రైనాను తప్పించి అంబటి రాయుడుకు చాన్స్ ఇచ్చినా ఫలితం దక్కలేదు. ఇక బౌలర్లయితే ఘోరంగా విఫలమయ్యారు. షమీ ఆకట్టుకున్నా కీలక ఓవర్లలో పరుగులు కట్టడి చేయలేకపోయాడు. మరోవైపు న్యూజిలాండ్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి సత్తాచాటారు. వన్డే సిరీస్ లో దారుణంగా ఓడిన ధోనీసేనకు కివీస్ గడ్డపై మరో సవాల్ ఎదురవుతోంది. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్ లో ఓడి నిరుత్సాహంగా ఉన్న టీమిండియా పుంజుకుంటుందా? టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. -
టీమిండియాకు బోణీయే కరువాయె
-
టీమిండియాకు బోణీయే కరువాయె
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భారత బోణీ కల నెరవేరలేదు. ధోనీసేన మరోసారి చిత్తుగా ఓడింది. సిరీస్ పోయింది.. పరువూ పోయింది.. నంబర్ వన్ ర్యాంకూ గల్లంతైంది. వెల్లింగ్టన్లో జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియా ఓడింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ మరోసారి కలిసికట్టుగా విఫలమై.. టీమ్ కొంప ముంచారు. శుక్రవారమిక్కడ జరిగిన చివరి, ఐదో వన్డేలో భారత్ 87 పరుగులతో కివీస్ చేతిలో పరాజయం మూటగట్టుకుంది. ఇంతకుముందు సిరీస్ ను సొంతం చేసుకున్న కివీస్ ఆధిక్యాన్ని 4-0కు పెంచుకుంది. మూడో వన్డే టైగా ముగియగా, మిగిలిన మ్యాచ్ ల్లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ లో 304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన మరో రెండు బంతులు మిగులుండగా 216 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ (82), ధోనీ (47) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. తెలుగుతేజం అంబటి రాయుడు 20, భువనేశ్వర్ కుమార్ 20 పరుగులు చేశారు. కివీస్ బౌలర్ హెన్నీ నాలుగు వికెట్లు తీశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను విలియమ్సన్, రాస్ టేలర్ ఆదుకున్నారు. టేలర్(102) సెంచరీ, విలియమ్సన్(88) అర్థ సెంచరీ సాధించారు. నీషమ్ 34, గుప్తిల్ 16, రైడర్ 17, రోంచి 11 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆరోన్ 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి తలో వికెట్ తీశారు. -
టేలర్ సెంచరీ; కివీస్ భారీ స్కోరు