రాజ్‌కోట్: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాంటి స్టార్ బ్యాటర్లు లేకుండానే భారత జట్టు ఆ్రస్టేలియాపై ఇప్పటికే వన్డే సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు వీరిద్దరు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం మైదానంలోకి దిగబోతున్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో మరో 11 రోజుల్లో ఇదే ఆసీస్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో దాని కోసం చివరి ట్రయల్‌గా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. మరో నలుగురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి టీమిండియా తమ సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధం కాగా, ఆసీస్ మాత్రం ప్రధాన ఆటగాళ్లందరినీ ఆడించనుంది.
ఆసీస్‌పై తొలిసారి వన్డేల్లో క్లీన్‌స్వీప్ కోసం భారత్ సిద్ధం కాగా, మరోవైపు వరుసగా ఆరో వన్డేలో ఓడిపోకుండా పరువు కాపాడుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఇరు జట్ల మధ్య సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. రాజ్‌కోట్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ కావడంతో భారీ స్కోరు నమోదు కావడం ఖాయం.
జోరు కొనసాగిస్తారా..?
ఈ మ్యాచ్ నుంచి భారత జట్టు గిల్, హార్దిక్, శార్దుల్, షమీలకు విశ్రాంతినిచి్చంది. తొలి రెండు మ్యాచ్‌లు ఆడని రోహిత్, కోహ్లి, సిరాజ్, కుల్దీప్, గత మ్యాచ్‌కు దూరమైన బుమ్రా బుధవారం పోరుకు సిద్ధమయ్యారు. ఆటగాళ్లు మారినా ఓవరాల్‌గా భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఆటగాళ్ల తాజా ఫామ్‌ను బట్టి చూస్తే చివరి వన్డేలోనూ భారత్ పైచేయి సాధించేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయి.
ఆసియా కప్ ఫైనల్ తర్వాత సిరాజ్ మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. బుమ్రా పదునైన బంతులతో ఆసీస్‌ను కట్టడి చేయగలడు. రాహుల్, శ్రేయస్, సూర్యలతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్‌తో భారత్ మరోసారి భారీ స్కోరు సాధించగలదు. అనుభవజు్ఞడిగా తన విలువేంటో అశి్వన్ గత రెండు మ్యాచ్‌లలో చూపించి తన వరల్డ్ కప్ అవకాశాలు మెరుగుపర్చుకున్నాడు. రోహిత్‌తో పాటు ఇషాన్ ఓపెనర్‌గా ఆడతాడు.
Comments
Please login to add a commentAdd a comment