CT 2025: అతడి కంటే బెటర్‌!.. నాకు చోటు దక్కాలి కదా! | Dinesh Karthik Justifies Siraj's Champions Trophy Snub | Sakshi
Sakshi News home page

CT 2025: అతడి కంటే బెటర్‌!.. నాకు చోటు దక్కాలి కదా!

Published Fri, Jan 24 2025 8:01 PM | Last Updated on Fri, Jan 24 2025 8:06 PM

Dinesh Karthik Justifies Siraj's Champions Trophy Snub

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025కు ఎంపిక చేసిన భార‌త జ‌ట్టులో స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు చోటు ద‌క్క‌పోయిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా వ‌న్డే ఫార్మాట్‌లో అద్బుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నప్ప‌టికి సిరాజ్‌ను ప‌క్క‌న పెట్ట‌డం క్రీడా వ‌ర్గాల్లో చర్చానీయాంశమైంది.

అత‌డి స్ధానంలో యువ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్‌కు సెల‌క్ట‌ర్లు అవ‌కాశ‌మిచ్చారు. క‌నీసం ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌కు కూడా ఈ హైద‌రాబాదీని సెల‌క్ట‌ర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. ఇంగ్లండ్‌తో వ‌న్డేల‌కు సిరాజ్ బ‌దులుగా మ‌రో యువ ఫాస్ట్ బౌల‌ర్ హ‌ర్షిత్ రానాను ఎంపిక చేశారు.

సెల‌క్ట‌ర్ల తీసుకున్న ఈ నిర్ణ‌యంపై భిన్న‌భిప్రాయాలు వ్య‌క్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్‌ను తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని కార్తీక​ సమర్ధించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి కోసం వెళ్లే జట్టులో లేకపోవడం కొంతవరకు బాధకారమనే చెప్పాలి. ఈ నిర్ణయం సిరాజ్‌ను నిరాశపరిచుండొచ్చు. కానీ  జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. బుమ్రా, షమీ, అర్ష్‌దీప్‌లకు ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఛాన్స్ ఇచ్చారు.

వీరు ముగ్గురు వైట్‌బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు తనను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడం సిరాజ్‌ను మరింత బాధ కలిగించుంటుంది. ఈ సమయంలో సిరాజ్.. రాణా కంటే తన ఎంతో బెటర్ అని భావిస్తుండవచ్చు. ఇది అతడిని తనను తాను మరింత నిరూపించుకోవడానికి ప్రేరేపిస్తుంది.

కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక విషయంలో అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం సరైనదే అని ​‍క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన సిరాజ్ 71 వికెట్లు పడగొట్టాడు. ఆసియాకప్‌-2023ను భారత్ కైవసం చేసుకోవడంలో సిరాజ్‌ది కీలక పాత్ర. కాగా ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: వరుణ్‌ చక్రవర్తి, ఆవేశ్‌ ఖాన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి
చదవండి: #Shardul Thakur: ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌.. క‌ట్‌చేస్తే! సూప‌ర్ సెంచ‌రీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement