![Shubman Gill, Virat Kohlis efforts take India to 3-0 series win](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Teamindia1.jpg.webp?itok=Jnst2vMa)
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో భారత్(Teamindia) ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 355 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది.
లక్ష్య చేధనలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్(23), డకెట్(34) తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్ బాంటన్(38) కూడా కాసేపు దూకుడగా ఆడాడు. కానీ సాల్ట్, బాంటన్ ఔటయ్యాక ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. వరుస క్రమంలో వికెట్ల కోల్పోయి ఇంగ్లీష్ జట్టు వైట్ వాష్‌కు గురైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుందర్, కుల్దీప్ చెరో వికెట్ సాధించారు.
శతక్కొట్టిన శుబ్‌మన్..
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్ (102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్, ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు రెండూ శుబ్‌మన్ గిల్‌కే దక్కాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి సై..
ఇక ఇంగ్లండ్‌ను స్వదేశంలో ఊడ్చేచిన భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో కఠిన సవాలు ఎదురు కానుంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు ఫిబ్రవరి 15న దుబాయ్‌కు పయనం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: SA vs PAK: పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. సఫారీలు ఇచ్చిపడేశారుగా! వీడియో
Comments
Please login to add a commentAdd a comment