ODI Seris
-
అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రెండు వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. పాక్ పేసర్లు అద్భుతంగా పోరాడినప్పటకి విజయం మాత్రం వరించలేదు.తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించి పాక్‌ను దెబ్బతీశారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్(44), ఇంగ్లీష్(49) నిలకడగా ఆడటంతో ఆసీస్ సునాయసంగా లక్ష్యాన్ని చేధిస్తుందని అంతా భావించారు.కానీ పాక్ హ్యారీస్ రవూఫ్ మాత్రం మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టేశాడు. ఒక్కసారిగా పాక్ జట్టు మ్యాచ్‌ను తమవైపు మలుపు తిప్పుకుంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(32 నాటౌట్) ఆఖరివరకు క్రీజులో నిలుచోని తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఇక ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందిచాడు. తమ జట్టు పేస్ బౌలర్లపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ ఓటమి మాకు ఎటువంటి నిరాశ కలిగించలేదు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆఖరి వరకు పోరాడాలని ముందే నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్‌లో అదే చేశాము. చివర వరకు పోరాడి ఓడిపోయాం. ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మేము బ్యాటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాలి. హ్యారీస్ రవూఫ్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. మా నలుగురు పేసర్లు కూడా తమ పని తాము చేశారు. తర్వాతి మ్యాచ్‌లో కూడా నలుగురు పేసర్లతోనే ఆడనున్నాం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు కాస్త ఆదృష్టం కలిసొచ్చింది అని పోస్ట్ మ్యాచ్ప్రేజేంటేషన్లో రిజ్వాన్ పేర్కొన్నాడు. -
గర్వంగా ఉంది.. చాలా కష్టపడ్డాను! అతడొక అద్భుతం: సంజూ
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. పార్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. బ్యాటింగ్‌కు కొంచెం కష్టంగా ఉన్న పిచ్‌పై సంజూ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ మ్యాచ్‌లో 114 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో సంజూకు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. కీలక ఇన్నింగ్స్ ఆడిన సంజూకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ క్రమంలో పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో శాంసన్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా నా ప్రదర్శన పట్ల కూడా సంతృప్తిగా ఉన్నాను. గత కొంత కాలంగా నేను కష్టపడి పని చేస్తున్నాను. అందుకు తగ్గ ప్రతి ఫలం ఈరోజు దక్కింది. టీ20లతో పోలిస్తే వన్డే ఫార్మాట్లో పిచ్‌ను, బౌలర్ మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడానికి మనకు కొంత సమయం ఉంటుంది. అంతేకాకుండా బ్యాటింగ్‌కు టాపర్డర్‌లో వస్తే క్రీజులో సెటిల్ కావడానికి 10 నుంచి 20 బంతులు వరకు సమయం తీసుకోవచ్చు. ఇక తిలక్ వర్మ ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడి ఆటతీరు పట్ల దేశం మొత్తం గర్విస్తోంది. భవిష్యత్తులో అతడి నుంచి మరిన్ని మంచి ఇన్నింగ్స్‌లు వస్తాయి. సీనియర్లు భారత క్రికెట్ అత్యున్నత స్దాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు జూనియర్లు కూడా తమ పని తాము చేసుకుపోతున్నారు" అని చెప్పుకొచ్చాడు. Superb century by #SanjuSamson on a bouncy pitch with some breathtaking shots🔥 Nothing is more sweeter than proving your haters wrong 🔥 #INDvsSA pic.twitter.com/6rX4pslBc1 — Achilles (@Searching4ligh1) December 21, 2023 -
Ind Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్! ఇతర వివరాలు
South Africa tour of India, 2022- September- T20, ODI Series: స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య బుధవారం(సెప్టెంబరు 28) నుంచి ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడే నిమిత్తం ప్రొటిస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇక ఈ ఏడాది భారత్- సౌతాఫ్రికా మధ్య ఇది మూడో సిరీస్. జనవరిలో టీమిండియా దక్షిణాఫ్రికాకు వెళ్లగా.. జూన్‌లో ప్రొటిస్ జట్టు భారత్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు 2-2తో సిరీస్(వర్షం కారణంగా మరో మ్యాచ్ రద్దు)ను సమం చేసింది. ఇదిలా ఉంటే.. తాజా సిరీస్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్, వేదికలు, జట్ల వివరాలు, లైవ్ స్ట్రీమింగ్ తదితర అంశాలు పరిశీలిద్దాం. భారత్‌లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటన భారత్ వర్సెస్ సౌతాఫ్రికా పూర్తి షెడ్యూల్ టీ20 సిరీస్ ►మొదటి టీ20: సెప్టెంబరు 28- బుధవారం- గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం- తిరువనంతపురం- కేరళ ►రెండో టీ20: అక్టోబరు 2- ఆదివారం- బర్సపర క్రికెట్ స్టేడియం- గువాహటి- అసోం ►మూడో టీ20: అక్టోబరు 4- మంగళవారం-హోల్కర్ క్రికెట్ స్టేడియం- ఇండోర్- మధ్యప్రదేశ్ మ్యాచ్ ఆరంభం సమయం: అన్ని టీ20 మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభం వన్డే సిరీస్ ►తొలి వన్డే: అక్టోబరు 6- గురువారం- భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం- లక్నో- ఉత్తరప్రదేశ్ ►రెండో వన్డే: అక్టోబరు 9- ఆదివారం- జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్- రాంచి- జార్ఖండ్ ►మూడో వన్డే: అక్టోబరు 11- మంగళవారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ మ్యాచ్ సమయం: అన్ని వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆరంభం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. వన్డే సిరీస్‌కు ఇంకా జట్టు(వార్తా కథనం రాసే సమయానికి)ను ప్రకటించలేదు. అయితే, టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న కారణంగా ప్రపంచకప్ ఈవెంట్‌కు సెలక్ట్ అయిన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వనున్నారు. భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దక్షిణాఫ్రికా జట్టు: వన్డే జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెన్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, పెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రేజ్ షంసీ. టీ20 జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెన్నిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, రీలీ రోసోవ్, తబ్రేజ్ షంసీ, జోర్న్ ఫార్చూన్, పెహ్లుక్వాయో, మార్కో జాన్సేన్, ట్రిస్టన్ స్టబ్స్. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం. చదవండి: Ind Vs Aus: జడ్డూ లేకుంటే టీమిండియా బలహీనపడుతుందనుకుంటే.. అతడేమో ఇలా: ఆసీస్ కోచ్ -
కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ .. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం
చెన్నై వేదికగా న్యూజిలాండ్- ఏ జరిగిన రెండో వన్డేలో భారత్-ఏ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శాంసన్ సేన కివీస్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 47 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో జో కార్టర్(72), రచిన్ రవీంద్ర(61) పరుగులో రాణించారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో కివీస్‌ను దెబ్బ కొట్టాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో కుల్దీప్ హాట్రిక్ వికెట్లు కూడా సాధించాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు లోగన్ వాన్ బీక్, జో వాకర్, జాకబ్ డఫీ వికెట్లను వరుసగా పడగొట్టి కుల్దీప్ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6 వికెట్లు కోల్పోయి 34 ఓవర్లలోనే చేధించింది. భారత బ్యాటర్లలో పృథ్వీ షా(77), సంజూ శాంసన్(37) పరుగులతో అదరగొట్టారు. కివీస్ బౌలర్లలో వాన్ బీక్ మూడు వికెట్లు, డఫీ రెండు వికెట్లు సాధించారు. చదవండి: Duleep Trophy 2022: 294 పరుగులతో సౌత్‌జోన్ ఓటమి.. దులీప్ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్ -
పుజారా, రహానేలపై వేటు.. సాకుతో కాదు అధికారికంగానే
అనూహ్యమేమీ కాదు... గత కొంత కాలంగా వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్లు పుజారా, రహానేలను ‘విశ్రాంతి’ సాకుతో కాకుండా అధికారికంగా సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ మార్పు ఒక్క శ్రీలంక సిరీస్‌కే పరిమితమని చెబుతున్నా... ఈ ఇద్దరు సీనియర్లు మళ్లీ ఎప్పుడు జట్టులోకి తిరిగొస్తారో చెప్పలేని పరిస్థితి... మరోవైపు కోహ్లి తప్పుకోవడంతో ఖాళీగా ఉన్న టెస్టు కెప్టెన్సీ స్థానాన్ని కూడా రోహిత్ శర్మకే అప్పగించిన సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లలో ఒకే ఒక నాయకుడిగా అతనికి గుర్తింపునిచ్చింది. న్యూఢిల్లీ: స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల కోసం 18 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు ఈ జట్టులో చోటు దక్కలేదు. మరో ఇద్దరు సీనియర్లు పేసర్ ఇషాంత్ శర్మ, కీపర్ వృద్ధిమాన్ సాహాలను కూడా లంకతో సిరీస్‌కు ఎంపిక చేయలేదు. లంకతో సిరీస్‌కు ఈ నలుగురి పేర్లను పరిశీలించడం లేదని దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే స్వయంగా వారికే సమాచారమిచ్చామని చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వెల్లడించారు. గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా జట్టులోకి పునరాగమనం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్‌ను మాత్రం ఫిట్నెస్ షరతులకు లోబడి ఎంపిక చేశారు. తొలి టెస్టుకు ముందు అతనికి ఫిట్నెస్ టెస్టు నిర్వహిస్తారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా టెస్టుల్లో మరో అవకాశం లభించింది. శార్దూల్ ఠాకూర్‌కు విశ్రాంతినిచ్చినట్లు ప్రకటించిన సెలక్టర్లు... కేఎల్ రాహుల్, సుందర్ ఇంకా గాయాల నుంచి కోలుకోలేదని స్పష్టం చేశారు. మరో మాట లేకుండా... భారత వన్డే, టి20 కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ను టెస్టు కెప్టెన్‌గా కూడా అధికారికంగా ప్రకటించారు. దక్షిణాఫ్రికా చేతిలో 1–2తో సిరీస్ ఓడిన తర్వాత కోహ్లి తాను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు మరో టెస్టు సిరీస్‌కు ముందు సెలక్టర్లు రోహిత్‌పై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చూస్తే 35 ఏళ్ల రోహిత్‌కు టెస్టు సారథ్యం అప్పగించడంపై కొంత చర్చ జరిగినా ప్రస్తుతానికి అతనికి మించిన మరో ప్రత్యామ్నాయం లేదని సెలక్టర్లు తేల్చారు. మూడు ఫార్మాట్లలో ఆడే రోహిత్ ఫిట్నెస్ విషయంలో సందేహాలు ఉన్నా... ఎప్పటికప్పుడు తాము పర్యవేక్షిస్తామని చేతన్ స్పష్టం చేశారు. కోహ్లి, పంత్‌లకు విశ్రాంతి శ్రీలంకతో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం కూడా టీమ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. విండీస్‌తో సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి జట్టులోకి రాగా... విరామం లేకుండా ఆడుతున్న కోహ్లి, రిషభ్ పంత్‌లకు విశ్రాంతినిచ్చారు. కోహ్లి, పంత్ విండీస్‌తో రెండో టి20 ముగిసిన వెంటనే ‘బయో బబుల్’ నుంచి బయటకు వచ్చి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్‌కు కూడా విశ్రాంతినిచ్చినట్లు సెలక్టర్లు వెల్లడించారు. గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజాను ఎంపిక చేయగా... వికెట్ కీపర్ సంజు సామ్సన్‌కు మరో అవకాశం దక్కింది. భారత్, శ్రీలంక మధ్య మూడు టి20 మ్యాచ్‌లు ఈనెల 24, 26, 27వ తేదీల్లో జరుగుతాయి. ఎవరీ సౌరభ్... ఉత్తరప్రదేశ్‌కు (యూపీ) చెందిన 28 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ భారత టెస్టు జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. దేశవాళీ కెరీర్ ఆరంభంలో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను ఆ తర్వాతి నుంచి యూపీకి ఆడుతున్నాడు. గత రెండు రంజీ సీజన్లలో వరుసగా 51, 44 వికెట్ల చొప్పున పడగొట్టిన అతను ఇటీవల భారత ‘ఎ’ తరఫున దక్షిణాఫ్రికాలో రాణించాడు. అనంతరం టెస్టు సిరీస్ కోసం స్టాండ్‌బై ప్లేయర్‌గా అక్కడే ఉండి టీమిండియాతో పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. 46 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 24.15 సగటుతో సౌరభ్ 196 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ అతని ఖాతాలో 2 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆట ముగిసినట్లేనా! డిసెంబర్ 2020... మెల్బోర్న్లో అద్భుత సెంచరీతో రహానే భారత్‌ను గెలిపించాడు. అతని కెప్టెన్సీలో సిరీస్ కూడా సొంతమైంది. అయితే ఆ టెస్టు తర్వాతి నుంచి రహానే పేలవ ప్రదర్శన మొదలైంది. నాటినుంచి ఇప్పటి వరకు ఆడిన 15 టెస్టుల్లో రహానే 20.25 సగటుతో 547 పరుగులు మాత్రమే సాధించాడు. 2018–19 ఆస్ట్రేలియా సిరీస్‌లో పుజారా 193 పరుగులు సాధించాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆడిన 27 టెస్టుల్లో కేవలం 27.38 సగటుతో అతను 1,287 పరుగులు చేశాడు. టీమిండియాకు చాలా వరకు విదేశీ గడ్డపైనే ఈ ఇద్దరు బ్యాటర్ల అవసరం ఉంది. సుమారు మరో ఏడాది పాటు భారత్ విదేశాల్లో టెస్టులు ఆడటం లేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లను ప్రభావితం చేసే ఆటతో వీరిద్దరు మళ్లీ ఎప్పుడు అవకాశం దక్కించుకుంటారో చూడాలి. మరోవైపు ప్రధాన పేసర్లంతా అందుబాటులో ఉన్న సమయంలో తుది జట్టులో స్థానం పొందలేకపోతున్న ఇషాంత్ శర్మపై వేటు ఆశ్చర్యం కలిగించలేదు. వికెట్ కీపర్‌గా కూడా పంత్ తన స్థానం పటిష్టం చేసుకోగా, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న సెల క్టర్లు 37 ఏళ్ల సాహాను పక్కన పెట్టక తప్పలేదు. భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్, ప్రియాంక్ పాంచల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, విహారి, గిల్, పంత్, కేఎస్ భరత్, అశ్విన్, జడేజా, జయంత్, కుల్దీప్, షమీ, సిరాజ్, ఉమేశ్, సౌరభ్ కుమార్. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), రుతురాజ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్, సిరాజ్, సామ్సన్, జడేజా, చహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్, అవేశ్ ఖాన్. -
Ind Vs Sa: కోహ్లి సెంచరీ కొడతాడు... ఇండియాదే సిరీస్: ప్రొటిస్ మాజీ బౌలర్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కచ్చితంగా సెంచరీ సాధిస్తాడని ప్రొటిస్ మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. సౌతాఫ్రికా పిచ్‌లు అతడికి అనుకూలిస్తాయని... కోహ్లి శతక్కొట్టడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా రన్‌మెషీన్‌గా పేరొందిన కోహ్లి... సెంచరీ కొట్టి రెండేళ్లు అవుతోంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఈ ఆశ తీరుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. పట్టుదలగా నిలబడిన కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే అవుట్ కావడంతో భంగపాటు తప్పలేదు. ఇక టెస్టు సిరీస్‌లో పరాజయం తర్వాత టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో భారత జట్టు సారథిగా కోహ్లి ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో కోహ్లికి ఇదే తొలి మ్యాచ్. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షో లో మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు... ‘‘విరాట్ కోహ్లి కచ్చితంగా వంద కొడతాడు. ముఖ్యంగా కేప్‌టౌన్‌లో బ్యాటింగ్ చేయడాన్ని అతడు ఆస్వాదిస్తాడు. ఇక్కడి న్యూలాండ్స్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం తనకిష్టమని కోహ్లి ఎన్నోసార్లు చెప్పాడు. సెంచరీ లేకుండా ఈ సిరీస్ ముగించడు అని గట్టిగా నమ్ముతున్నా’’ అని మోర్కెల్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందన్న ఈ ప్రొటిస్ మాజీ పేసర్... 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని అంచనా వేశాడు. మొదటి రెండు మ్యాచ్‌లకు వేదిక అయిన పర్ల్ వారికి అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs Sa ODI Series: రుతురాజ్‌కు నో ఛాన్స్.. ధావన్, చహల్‌కు అవకాశం! Guided #TeamIndia with courage & fearlessness 👍 Led the side to historic wins 🔝 Let's relive some of the finest moments from @imVkohli's tenure as India's Test captain. 👏 👏 Watch this special feature 🎥 🔽https://t.co/eiy9R35O4Q pic.twitter.com/4FMCLstZu3 — BCCI (@BCCI) January 17, 2022 -
దెబ్బకు దెబ్బ తీసిన విండీస్; పూరన్ కెప్టెన్ ఇన్నింగ్స్
బ్రిడ్జ్‌టౌన్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో వెస్డిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కరోనా కేసు నేపథ్యంలో ఒకరోజుకు వాయిదా పడిన మ్యాచ్ శనివారం జరిగింది. ఇక తొలి వన్డేలో దారుణ పరాజయం చవిచూసిన విండీస్ రెండో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. లోస్కోరింగ్గా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విండీస్ స్పిన్నర్లు దాటికి 47.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. 100 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను వేస్ అగర్ 41, ఆడమ్ జంపా 36 , మాధ్యూ వేడ్ 36 పరుగులతో ఆదుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ , అకియల్ హోసెన్ చెరో 3 వికెట్లు తీయగా.. కాట్రెల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో క్రీజ్‌లోకి దిగిన వెస్టిండీస్ టీమ్ తడబడింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ డారెన్ బ్రావో ఖాతా తెరవలేకపోయాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జేసన్ మహమ్మద్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. పించ్ హిట్టర్ కీరన్ పొల్లార్డ్ సైతం రెండు పరుగులకే అవుట్ కావడంతో సొంతగడ్డపై వెస్టిండీస్‌కు మరో పరాభవం తప్పదనిపించింది. అప్పటికే క్రీజ్‌లో ఉన్న నికొలస్ పూరన్ సమయస్ఫూర్తితో ఆడాడు. 43 బంతుల్లో ఆరు ఫోర్లతో 38 పరుగులు చేసిన హోప్ అవుటైన తరువాత మళ్లీ కష్టాల్లో పడినట్టు కనిపించినప్పటికీ.. జేసన్ హోల్డర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 69 బంతుల్లో 52 పరుగులు చేసిన హోల్డర్ స్టార్క్‌కు ఎల్బీగా వికెట్‌ను సమర్పించుకున్నాడు. అప్పటికే లక్ష్యానికి సమీపించడం, రిక్వైర్డ్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో విండీస్ నింపాదిగా లక్ష్యాన్ని అందుకుంది. 38 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 191 పరుగులు చేసింది. నికొలస్ పూరన్ 75 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేసి.. నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు మిఛెల్ స్టార్క్ 3, ఆడమ్ జంపా 2, టర్నర్ ఒక వికెట్ తీసుకున్నారు. నికొలస్ పూరన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే సోమవారం జరగనుంది. -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్: సూర్య కుమార్‌కు పిలుపు
ముంబై: ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ శుక్రవారం టీమిండియాను జట్టును ప్రకటించింది. 18 మందితో కూడిన ప్రాబబుల్స్‌లో సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి వన్డేల్లో చాన్స్ దక్కింది. షమీ, జడేజాలు గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిగణలోకి తీసుకోలేదు. ఇక స్వింగ్ బౌలర్ భువీ మళ్లీ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు జట్టులో ఉన్న మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, సంజూ శామ్సన్‌లు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు చోటు కోల్పోయారు. టీ20 సిరీస్‌కు దూరమైన నటరాజన్ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఇది మినహా మిగిలిన జట్టులో మార్పులు ఏమిలేవు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న కృనాల్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌కు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో ఆడిన నాలుగో టీ20లో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సూర్యకుమార్ వన్డేల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా అన్ని మ్యాచ్‌లో పుణే వేదికగా జరగనున్నాయి. ఇరు జట్ల మధ్య తొలి వన్డే మార్చి 23న జరగనుంది. టీమిండియా జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, చాహల్, కుల్దీప్, కృనాల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ చదవండి: థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు.. సెహ్వాగ్ ఫన్నీ ట్రోల్ -
టీమిండియాపై స్మిత్ అరుదైన రికార్డు
సిడ్నీ : ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ టీమిండియాపై అరుదైన రికార్డు సాధించాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో స్టీవ్ స్మిత్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. మొదటి వన్డేలో 66 బంతుల్లో 105 పరుగులు చేసిన స్మిత్ రెండో వన్డేలో మరింత దూకుడుగా ఆడాడు. కేవలం 62 బంతుల్లోనే 100 పరుగులు సాధించిన స్మిత్ 104 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి 50 పరుగులను 38 బంతులు తీసుకున్న స్మిత్ మలి 50 పరుగులను కేవలం 24 బంతుల్లోనే సాధించడం విశేషం. ఓవరాల్‌గా వన్డేల్లో స్మిత్ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. అందులో టీమిండియాపైనే 5 సెంచరీలు సాధించాడు. భారత్‌పై 5 కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఆసీస్ ఆటగాళ్లలో రికీ పాంటింగ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా పాంటింగ్ వన్డేల్లో టీమిండియాపై ఆరు సెంచరీలు సాధించి మొదటిస్థానంలో ఉన్నాడు. అయితే పాంటింగ్ 6 సెంచరీలు సాధించడానికి 59 మ్యాచ్‌లు అవసరం కాగా.. స్మిత్ మాత్రం 20 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును సాధించడం విశేషం. (చదవండి : రానున్న రోజుల్లో స్మిత్‌తో టీమిండియాకు కష్టమే) కాగా స్మిత్ ఇన్నింగ్స్ దాటికి భారత బౌలర్లలో ఏ ఒక్కరు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. ఇక రెండో వన్డేలో ఆసీస్ 50 ఓవర్లలో 389 పరుగులు చేసింది. చివర్లో మ్యాక్స్‌వెల్ 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేయగా.. మార్నస్ లబుషేన్ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగనున్న భారత్ లక్ష్యాన్ని చేరుకుంటుందో.. లేక చతికిలపడుతుందో చూడాలి. (చదవండి : వారెవ్వా అయ్యర్.. వాట్ ఏ త్రో) -
వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం
-
జోరు కొనసాగిస్తాం
ముంబై: సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్ జట్టు భారత గడ్డపై వన్డే సిరీస్‌లో తలపడింది. ఆ సిరీస్‌ను భారత్ 3–2తో సొంతం చేసుకుంది. ఇప్పుడు సంవత్సరం తర్వాత దాదాపుగా ఆ ఆటగాళ్లతోనే ఇరు జట్లు మళ్లీ పోరుకు సిద్ధమయ్యాయి. కాబట్టి వ్యూహాల్లో కూడా కొత్తగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదని భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్ ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం రోహిత్ మీడియాతో మాట్లాడాడు. ‘గత ఏడాది ఇదే సమయంలో న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్నాం. ఆ సిరీస్‌లో ఆడిన ఎక్కువ మంది ఆటగాళ్లు రెండు జట్లలోనూ ఇప్పుడూ ఉన్నారు. కాబట్టి నా దృష్టిలో వ్యూహాలు, ప్రణాళికలకు సంబంధించి మరీ పెద్దగా మార్పేమీ రాదని నేను భావిస్తున్నా. బౌల్ట్‌తో సహా వారి బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అయితే ఆయా బౌలర్ల గురించి మాకు మంచి అవగాహన ఉండటం కలిసొచ్చే అంశం. సంవత్సరం వ్యవధిలో నా ఆటలోనూ మార్పేమీ రాలేదు కానీ వైస్ కెప్టెన్‌గా కాస్త బాధ్యత మాత్రం పెరిగింది. లెఫ్టార్మ్ పేస్ బౌలర్లను ఎదుర్కోవడంలో మేం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అదే తరహా బౌలరైన ట్రెంట్ బౌల్ట్‌ను సమర్థంగా ఆడటం మాకు సవాల్‌లాంటిదే. ఈ విషయంలో కివీస్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. భారత్ తరఫున ఒక లెఫ్టార్మ్ పేసర్ (జహీర్) ఆడి చాలా ఏళ్లు గడిచిపోయిన విషయం మరచిపోవద్దు’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో... ఆసీస్‌తో చివరి టి20 మ్యాచ్ రద్దయిన తర్వాత భారత ఆటగాళ్లకు ఆరు రోజుల పాటు విశ్రాంతి లభించింది. విరామం తర్వాత కివీస్‌తో తొలి మ్యాచ్‌కు ముందు శుక్రవారం జట్టు సభ్యులంతా వాంఖడే మైదానంలో ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. హెడ్ కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో సుదీర్ఘ సమయం పాటు సాధన చేశారు. భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలింగ్ విభాగంలో క్రికెట్ దిగ్గజం సచిన్ కుమారుడు, 18 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. గతంలోనూ లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల ప్రాక్టీస్ సెషన్లలో నెట్ బౌలర్‌గా అతను అనేక సార్లు బంతులు వేశాడు. అయితే ముంబైలో భారత జట్టుతో కలిసి సాధన చేయడం మాత్రం ఇదే తొలిసారి. -
ఎట్టకేలకు మనోళ్లు వికెట్ తీశారు
కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో భారత బౌలర్లు ఎట్టకేలకు ఓ వికెట్ తీశారు. సెంచరీకి చేరువైన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (93)ను భారత పేసర్ ఇషాంత్ శర్మ బౌల్డ్ చేశాడు. దీంతో 187 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరో ఓపెనర్ ఫించ్ (88) సెంచరీకి చేరువలో ఉన్నాడు. మార్ష్ బ్యాటింగ్‌కు దిగాడు. బుధవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారూలు 31 ఓవర్లలో వికెట్ నష్టానికి 190 పరుగులు చేశారు. ఆసీస్ ఓపెనర్లు వార్నర్, ఫించ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడగా, వీరిని కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. -
బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
కాన్బెర్రా: భారత్ తో బుధవారమిక్కడ జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విజయం కోసం టీమిండియా ఆరాటపడుతుండగా, క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆసీస్ బరిలోకి దిగుతోంది. భారత్ టీమ్ లో ఒక మార్పు చోటుచేసుకుంది. బరీందర్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ను తీసుకున్నారు. ఆసీస్ టీమ్ లో రెండు మార్పులు జరిగాయి. బొలాండ్, షాన్ మార్ష్ స్థానంలో లియాన్, వార్నర్ జట్టులోకి వచ్చారు. ఐదు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0తో గెల్చుకుంది. -
జైజై నాయకా!
బురద చల్లించుకున్న చోట పన్నీరు పూయించుకుంటున్నాడు టీమిండియా నాయకుడు మహేంద్ర సింగ్ ధోని. విఫలమైన చోటే విజయాలు సాధించి జేజేలు అందుకుంటున్నాడు. ఎంతలో ఎంత మార్పు. పొడుగు ఫార్మాట్ లో ఘోరంగా విఫలమయిన గడ్డపైనే పొట్టి ఫార్మాట్ లో సత్తా చాటి విజయవంతమైన నాయకుడిగా ఖ్యాతిని ఆర్జించడం మహేంద్రుడికే చెల్లింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా కైవసం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచి సిరీస్ సాధించింది. టెస్టుల్లో చతికిలపడిన జట్టేనా ఈ విజయం సాధించింది అన్న అనుమానం కలిగేలా వన్డేల్లో విజృంభించింది. టెస్టుల్లో ఎంత దారుణంగా ఓడిపోయారో, వన్డేల్లో అంతగా రెచ్చిపోయారు. ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో భారత్ జట్టు 1-3 తేడాతో ఓడిపోయినప్పుడు ధోని నాయకత్వంపై దుమ్మెత్తిపోశారు. అతడు టెస్టు నాయకత్వానికి పనికిరాడని అన్నారు. టెస్టు కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఫార్మాట్ మారడంతో టీమిండియా మళ్లీ గాడిలో పడింది. వన్డేల్లో టాప్ ర్యాంకు కూడా సాధించింది. అంతేకాదు భారత్ కు అత్యధిక వన్డే విజయాలు అందించిన నాయకుడిగా ధోని కొత్త రికార్డు లిఖించాడు. దీంతో ధోనిపై విమర్శలు ఆగిపోయాయి. అయితే టెస్టుల్లో ఓటమి అతడు ఇంకా సమాధానం చెప్పలేదు. ఆటలో గెలుపోటములు సహజం. అగ్రశ్రేణి జట్టు కనీస పోరాట పటిమ కనబరచకుండా కుదేలవడాన్ని క్రికెట్ అభిమానులు కాదు ఎవరూ జీర్ణించుకోలేరు. 'హ్యాట్రిక్' ఘోర పరాజయాలతో టెస్టు సిరీస్ లో ఇంగ్లీషు గడ్డపై టీమిండియా చతికిలపడడం మామూలు విషయం కాదు. సిసలైన క్రికెట్ కు పర్యాయపదంగా నిలుస్తున్న టెస్టుల్లో ఇప్పుడు ధోని సేన నిరూపించుకోవాల్సింది. దిగ్గజాల స్థానంలో వచ్చిన వారితో టెస్టు విజయాలు సాధిస్తేనే ధోని నిజమైన నాయకుడిగా నిరూపితమవుతాడు.