ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో భారత బౌలర్లు ఎట్టకేలకు ఓ వికెట్ తీశారు.
కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో భారత బౌలర్లు ఎట్టకేలకు ఓ వికెట్ తీశారు. సెంచరీకి చేరువైన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (93)ను భారత పేసర్ ఇషాంత్ శర్మ బౌల్డ్ చేశాడు. దీంతో 187 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరో ఓపెనర్ ఫించ్ (88) సెంచరీకి చేరువలో ఉన్నాడు. మార్ష్ బ్యాటింగ్కు దిగాడు.
బుధవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కంగారూలు 31 ఓవర్లలో వికెట్ నష్టానికి 190 పరుగులు చేశారు. ఆసీస్ ఓపెనర్లు వార్నర్, ఫించ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడగా, వీరిని కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.