T20 వరల్డ్‌కప్‌లో సూపర్‌-8 బెర్త్‌లు ఖారారు.. షెడ్యూల్‌ ఇదే | T20 World Cup Super 8 Schedule: Opponents, Dates, Match Timing, Venues | Sakshi
Sakshi News home page

T20 వరల్డ్‌కప్‌లో సూపర్‌-8 బెర్త్‌లు ఖారారు.. షెడ్యూల్‌ ఇదే

Published Mon, Jun 17 2024 10:02 AM | Last Updated on Mon, Jun 17 2024 11:12 AM

T20 World Cup Super 8 Schedule: Opponents, Dates, Match Timing, Venues

టీ20 వరల్డ్‌కప్‌-2024లో సూపర్‌-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈసారి పొట్టి వరల్డ్‌కప్‌లో మొత్తంగా 20 జట్లు పాల్గొన్న విషయం తెలిసిందే. వీటిలో 12 టీమ్స్ లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టగా.. 8 జట్లు తదుపరి రౌండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించాయి.

ప్రతీ గ్రూపులో టాప్‌ 2లో నిలిచిన టీమ్స్‌ సూపర్‌-8లో అడుగుపెట్టాయి.  గ్రూపు-ఎ నుంచి భారత్‌, యూఎస్‌ఎ గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, అఫ్గానిస్తాన్‌.. గ్రూప్ డి నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ క్వాలిఫై అయ్యాయి. చివరగా నేపాల్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్‌ తమ సూపర్‌-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది.

మొత్తం రెండు గ్రూపులు
ఇక సూపర్‌-8 స్టేజిలో 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-1లో భారత్‌, అఫ్గానిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ ఉండగా.. గ్రూపు-2లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, యూఎస్ఏఉన్నాయి. 

బుధవారం (జూన్ 19) యూఎస్ఏ, సౌతాఫ్రికా మధ్య ఆంటిగ్వాలో మ్యాచ్ తో సూపర్ 8 స్టేజ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సూపర్‌-8 షెడ్యూల్‌ను ఓసారి పరిశీలిద్దాం.

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 షెడ్యూల్

జూన్‌ 19: అమెరికా వర్సెస్‌ దక్షిణాఫ్రికా, ఆంటిగ్వా(భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)

జూన్ 19: ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌, సెయింట్‌ లూసియా(భారత కాలమానం ప్రకారం జూన్‌ 20వ తేదీ ఉదయం 6:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)

జూన్‌ 20: భారత్‌ వర్సెస్‌ అఫ్గానిస్తాన్‌ బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్(భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)

జూన్ 20: ఆస్ట్రేలియా వర్సెస్‌ బంగ్లాదేశ్, ఆంటిగ్వా(భారత కాలమానం ప్రకారం జూన్‌ 21వ తేదీ ఉదయం 6:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)

జూన్ 21: ఇంగ్లండ్ వర్సెస్‌ సౌతాఫ్రికా, సెయింట్ లూసియా(భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)

జూన్ 21: యూఎస్ఏ వర్సెస్‌ వెస్టిండీస్, బార్బడోస్(భారత కాలమానం ప్రకారం జూన్‌ 22వ తేదీ ఉదయం 6:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)

జూన్‌ 22: ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌, ఆంటిగ్వా (భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)

జూన్‌ 22: అఫ్గానిస్తాన్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, కింగ్స్‌ టౌన్‌ (భారత కాలమానం ప్రకారం జూన్‌ 23వ తేదీ ఉదయం 6:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)

జూన్‌ 23: యూఎస్ఏ వర్సెస్‌ ఇంగ్లండ్‌,  బార్బడోస్( భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)

జూన్‌ 23: వెస్టిండీస్ వర్సెస్‌ సౌతాఫ్రికా, ఆంటిగ్వా (భారత కాలమానం ప్రకారం జూన్‌ 24వ తేదీ ఉదయం 6:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)

జూన్‌ 24: ఆస్ట్రేలియా వర్సెస్‌ భారత్‌, సెయింట్‌ లూసియా (భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)

జూన్‌ 24: అఫ్గానిస్తాన్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌, కింగ్స్‌ టౌన్‌( భారత కాలమానం ప్రకారం జూన్‌ 25 వ తేదీ ఉదయం 6:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement