ఆస్ట్రేలియా విజయం.. సూపర్‌-8లో ఇంగ్లండ్‌ | T20 World Cup 2024: Australia Beat Scotland By 5 Wickets, England Qualified To Super 8s | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ఆస్ట్రేలియా విజయం.. సూపర్‌-8లో ఇంగ్లండ్‌

Published Sun, Jun 16 2024 10:27 AM | Last Updated on Sun, Jun 16 2024 11:25 AM

T20 World Cup 2024: Australia Beat Scotland By 5 Wickets, England Qualified To Super 8s

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా స్కాట్లాండ్‌తో ఇవాళ (జూన్‌ 16) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. ఛేదనలో ఆస్ట్రేలియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో స్కాట్లాండ్‌ వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమించింది.

గ్రూప్‌-బిలో స్కాట్లాండ్‌తో సమానంగా ఐదు పాయింట్లు ఉన్న ఇంగ్లండ్‌ నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా సూపర్‌-8కు అర్హత సాధించింది. ఆసీస్‌-స్కాట్లాండ్‌ మ్యాచ్‌కు ముందు నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3.611 రన్‌రేట్‌తో ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 

స్కాట్లాండ్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రాతో 1.255 రన్‌రేట్‌ చొప్పున ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. గ్రూప్‌-బి నుంచి ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆస్ట్రేలియా ఎనిమిది పాయింట్లతో (2.791 రన్‌రేట్‌తో) అగ్రస్థానంలో ఉంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (60), బెర్రింగ్టన్‌ (42 నాటౌట్‌), మున్సే (35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో మ్యాక్స్‌వెల్‌ 2, ఆస్టన్‌ అగర్‌, నాథన్‌ ఇల్లిస్‌, ఆడమ్‌ జంపా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. ట్రవిస్‌ హెడ్‌ (68), మార్కస్‌ స్టోయినిస్‌ (59), టిమ్‌ డేవిడ్‌ (24 నాటౌట్‌) చెలరేగడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. స్కాట్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ వాట్‌, షరీఫ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్‌ వీల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement