టీ20 వరల్డ్‌కప్-2024 తుది అంకానికి చేరుకుంది. మంగళవారం జరిగిన బంగ్లాదేశ్-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌తో సూపర్-8 దశ ముగిసింది. గ్రూప్ ఏ నుండి భారత్,అఫ్ఘానిస్థాన్ జట్లు సెమిస్ కు చేరగా..గ్రూప్ బినుండి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమిస్ కు చేరాయి.
భారత కాలమానం ప్రకారం గురువారం(జూన్ 27) నుంచి నాకౌట్స్ దశ షూరూ కానుంది. తొలి సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్- దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోగా.. రెండో సెమీఫైనల్లో భారత్- ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. తొలి సెమీఫైనల్ గురువారం ఉదయం 6:00 గంటలకు ప్రారంభం కాగా.. రెండో సెమీఫైనల్ రాత్రి 8:00 గంటలకు మొదలు కానుంది.
ఇక సెకెండ్ సెమీఫైనల్ విషయానికి వస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను ఎలాగైనా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని భారత్ భావిస్తోంది. ఇరు జట్లు బలబలాల పరంగా సమంగా ఉన్నాయి. కాబట్టి ఈ పోరులో ఎవరిది పైచేయి అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ కీలక మ్యాచ్‌లో భారత జట్టు మెనెజ్‌మెంట్ తమ తుది జట్టులో ఒకే మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై వేటు వేయాలని మెనెజ్‌మెంట్ నిర్ణయించకున్నట్లు సమచారం.
గయనా వికెట్‌కు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశమున్నందన జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జట్టులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉండడంతో జడ్డూను పక్కన పెట్టాలని ఫిక్స్ అయినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇక ప్రధాన జట్టులో ఉన్న సంజూ శాంసన్ ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: T20 WC: వారసుడిని ప్రకటించిన డేవిడ్ వార్నర్.. ఆసీస్ కొత్త ఓపెనర్ ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment