బ్రిడ్జ్‌టౌన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికా జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్–2 ‘సూపర్–8’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కోరె అండర్సన్ (28 బంతుల్లో 29; 1 సిక్స్) రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. జోర్డాన్ 2.5 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో జోర్డాన్ 5 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. 19వ ఓవర్ తొలి బంతికి అండర్సన్‌ను అవుట్ చేసిన జోర్డాన్... మూడో బంతికి అలీఖాన్‌ను, నాలుగో బంతికి కెనిజిగెను, ఐదో బంతికి నేత్రావల్కర్‌ను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకున్నాడు.
బట్లర్ మెరుపులు
116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ జోస్ బట్లర్ (38 బంతుల్లో 83 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు) మెరిపించారు. అమెరికా బౌలర్ హర్మీత్ సింగ్ వేసిన తొమ్మిదో ఓవర్లో బట్లర్ ఏకంగా 5 సిక్స్‌లు కొట్టాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 4 పాయింట్లతో సెమీఫైనల్ చేరుకుంది. నేడు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్–2 నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్ చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment