'భారత్‌, పాక్‌, ఇంగ్లండ్‌ కాదు.. టీ20 వరల్డ్‌కప్‌ విజేత ఆ జట్టే' | Vaughan Picks World No. 3 Team As Favourites To Win T20 World Cup 2024 | Sakshi
Sakshi News home page

T20 WC 2024: 'భారత్‌, పాక్‌, ఇంగ్లండ్‌ కాదు.. టీ20 వరల్డ్‌కప్‌ విజేత ఆ జట్టే'

Published Tue, Mar 5 2024 1:29 PM | Last Updated on Tue, Mar 5 2024 1:43 PM

Vaughan Picks World No. 3 Team As Favourites To Win T20 World Cup 2024 - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2024కు అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఐసీసీ ప్రకటించింది. జాన్‌ 1 నుంచి ఈ పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌ కోసం ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన టీ20 వరల్డ్‌కప్‌ టైటిల్‌ ఫేవరేట్‌ జట్టును ఎంచుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌-2023ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియానే టీ20 వరల్డ్‌కప్‌ విజేతగా నిలుస్తుందని వాన్‌ జోస్యం చెప్పాడు.

షఆసీస్‌ మరోసారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటుందని నేను భావిస్తున్నాను. నాకు వారిపై 100 శాతం నమ్మకం ఉంది. అదేవిధంగా ఇటీవలే వన్డే వరల్డ్‌కప్‌ను కూడా కైవసం చేసుకున్నారు. అదే ఆత్మవిశ్వాసంతో ఈ టోర్నీలో కూడా బరిలోకి దిగుతారు. వారు బ్యాటింగ్‌ లైనప్‌ అద్బుతం. జట్టులో హెడ్, వార్నర్, మార్ష్, మాక్స్‌వెల్, ఇంగ్లిస్, డేవిడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.

బౌలింగ్‌ పరంగా కూడా ఆసీస్‌ పటిష్టంగా ఉంది. పేస్‌, స్పిన్‌తో సమతూకంగా ఆస్ట్రేలియా కన్పిస్తోంది. అందుకే ఆసీస్‌ను ఫేవరేట్‌గా ఎంచుకున్నానని" వాన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా వాన్‌ తమ జట్టు ఇంగ్లండ్‌ను కానీ, టీమిండియాను ఎంచుకోపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement