కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ .. న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం | India A wrap up series win with 4 wicket win Against New Zealand A | Sakshi
Sakshi News home page

Ind A vs NZ A 2nd ODI: కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ .. న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం

Published Sun, Sep 25 2022 5:54 PM | Last Updated on Sun, Sep 25 2022 6:03 PM

India A wrap up series win with 4 wicket win Against New Zealand A - Sakshi

చెన్నై వేదికగా న్యూజిలాండ్‌- ఏ జరిగిన రెండో వన్డేలో భారత్‌-ఏ  ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శాంసన్‌ సేన కివీస్‌ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 47 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది.  కివీస్‌ బ్యాటర్లలో జో కార్టర్‌(72), రచిన్‌ రవీంద్ర(61) పరుగులో రాణించారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 4 వికెట్లతో కివీస్‌ను దెబ్బ కొట్టాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ హాట్రిక్‌ వికెట్లు కూడా సాధించాడు.

న్యూజిలాండ్‌ బ్యాటర్లు  లోగన్ వాన్ బీక్‌, జో వాకర్, జాకబ్ డఫీ వికెట్లను వరుసగా పడగొట్టి కుల్దీప్‌ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 6 వికెట్లు కోల్పోయి 34 ఓవర్లలోనే చేధించింది. భారత బ్యాటర్లలో పృథ్వీ షా(77), సంజూ శాంసన్‌(37) పరుగులతో అదరగొట్టారు. కివీస్‌ బౌలర్లలో వాన్ బీక్‌ మూడు వికెట్లు, డఫీ రెండు వికెట్లు సాధించారు.
చదవండి: Duleep Trophy 2022: 294 పరుగులతో సౌత్‌జోన్‌ ఓటమి.. దులీప్‌ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement