BCCI Announces India's squad For ODI Series Against England, Suryakumar Yadav Name In India's ODI Squad - Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌: సూర్య కుమార్‌కు పిలుపు

Mar 19 2021 11:28 AM | Updated on Mar 19 2021 2:21 PM

BCCI Announces India Squad For ODI Series Against England - Sakshi

ముంబై: ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వ‌న్డేల సిరీస్ కోసం బీసీసీఐ శుక్రవారం టీమిండియాను జట్టును ప్ర‌క‌టించింది. 18 మందితో కూడిన ప్రాబబుల్స్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌కు తొలిసారి వన్డేల్లో చాన్స్‌ దక్కింది. షమీ, జడేజాలు గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిగణలోకి తీసుకోలేదు. ఇక స్వింగ్‌ బౌలర్‌ భువీ మళ్లీ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు.

ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు జట్టులో ఉన్న మయాంక్‌ అగర్వాల్‌, మనీష్‌ పాండే, సంజూ శామ్సన్‌లు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు చోటు కోల్పోయారు. టీ20 సిరీస్‌కు దూరమైన నటరాజన్‌ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఇది మినహా మిగిలిన జట్టులో మార్పులు ఏమిలేవు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న కృనాల్‌ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌కు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. రోహిత్‌ శర్మ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో ఆడిన నాలుగో టీ20లో సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సూర్య‌కుమార్ వ‌న్డేల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా అన్ని మ్యాచ్‌లో పుణే వేదికగా జరగనున్నాయి. ఇరు జట్ల​ మధ్య తొలి వన్డే మార్చి 23న జరగనుంది.

టీమిండియా జట్టు:  విరాట్ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ(వైస్‌ కెప్టెన్‌)‌, ధావ‌న్‌, శుభ్‌మ‌న్ గిల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సూర్యకుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్‌, కేఎల్ రాహుల్‌, చాహ‌ల్‌, కుల్‌దీప్‌, కృనాల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, న‌ట‌రాజ‌న్‌, భువ‌నేశ్వ‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, శార్దూల్ ఠాకూర్

చదవండి:
థర్డ్‌ అంపైర్‌ కళ్లకు గంతలు.. సెహ్వాగ్‌ ఫన్నీ ట్రోల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement