శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా జమ్మూ-కాశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ సెంచరీతో మెరిశాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్ధూల్ వన్డే తరహాలో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ, జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, రహానే వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. లార్డ్ శార్థూల్ విరోచిత పోరాటంతో తన జట్టును అదుకున్నాడు.
శార్దూల్ 119 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. దీంతో 188 పరుగుల ఆధిక్యంలో ముంబై కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో శార్థూల్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ తనీష్ కొటియన్(58 నాటౌట్) ఉన్నారు.
జమ్మూ బౌలర్లలో ఔకిబ్ నబీ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమర్ నజీర్ మీర్, యుధ్‌వీర్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా పదేళ్ల తర్వాత రంజీ ఆడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లలోనూ తీవ్రనిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
అతడితోపాటు జైశ్వాల్(4, 26), రహానే(12, 16) విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్‌లో ముంబై 120 పరుగులకు ఆలౌట్ కాగా.. జమ్మూ అండ్ కాశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు చేసింది. ఇక శార్దూల్ తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. లార్డ్ ఠాకూర్ గత 14 నెలలగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికి భారత జట్టులోకి పునరాగమనం చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో శార్ధూల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతడికి టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై అద్బుతమైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే ఠాకూర్‌కు సెలక్లర్లు రీకాల్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
చదవండి: భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
Comments
Please login to add a commentAdd a comment