కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు చెన్నై వేదికగా రెండో మ్యాచ్‌కు సిద్దమైంది. శనివారం చెన్నైలోని ఐకానిక్ ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు రెండో టీ20లో తలపడనున్నాయి.
రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సిరీస్ అధిక్యాన్ని పెంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లీష్ జట్టు చెన్నై టీ20లో ఎలాగైనా తిరిగిపుంజుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే చెన్నై చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి.
మహ్మద్ షమీ రీ ఎంట్రీ ఇస్తాడా?
అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో అందరి అందరి కళ్లు సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీపైనే ఉన్నాయి. గాయం కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరమై, ఎట్టకేలకు భారత జట్టులోకి పునరాగమనం చేసిన షమీ.. కోల్‌కతా వేదికగా జరిగిన టీ20లో ఆడుతాడని అంతా భావించారు. కానీ తుది జట్టులో మాత్రం షమీకి చోటు దక్కలేదు.
అతడిని ఎందుకు పక్కన పెట్టారన్న విషయంపై జట్టు మెనెజ్‌మెంట్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. షమీ మళ్లీ గాయపడ్డాడా లేదా కావాలనే పక్కన పెట్టారన్న అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రెండో టీ20లో కూడా షమీ ఆడేది అనుమానంగానే మారింది. ఎందుకంటే చెపాక్ స్టేడియం సాధరణంగా స్పిన్‌కు అనుకూలిస్తోంది.
దీంతో రెండో టీ20లో కూడా భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవిబిష్ణోయ్‌లు చెపాక్ టీ20లో కూడా ఆడే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ తుది జట్టులో షమీకి ఛాన్స్ ఇవ్వాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిపై వేటు వేసే ఛాన్స్ ఉంది. ఇక రెండో టీ20లో ఇంగ్లండ్ తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. గాస్ అట్కిన్సన్ స్ధానంలో బ్రైడన్ కార్సేకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుదక్కింది.
టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు:
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
భారత్ తుది జట్టు(అంచనా): సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి/మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment