ట్రెంట్ బౌల్ట్
అబుదాబి: న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ‘హ్యాట్రిక్’తో జట్టుకు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో అతడు ఈ ఘనత సాధించాడు. ఫలితంగా పాక్ 47 పరుగులతో పరాజయం పాలైంది. హ్యాట్రిక్‌తో టాప్ ఆర్డర్‌ను కూల్చి పాక్ పతనాన్ని బౌల్ట్ శాసించాడు. ఫఖర్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్‌లను వరుస బంతుల్లో పెలివియన్‌కు పంపాడు. బౌల్ట్ దెబ్బకు పాక్ కోలుకోలేకపోయింది. 267 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక 47.2 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ అహ్మద్(64), ఇమాద్ వాసిం(50) అర్థ సెంచరీలతో పోరాడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ 3, గ్రాండ్‌హోమె 2 వికెట్లు పడగొట్టారు. సోధి ఒక వికెట్ దక్కించుకున్నాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. టేలర్(80) లాంథమ్ (68) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో షహీన్ షా ఆఫ్రిది, షదబ్ ఖాన్ నాలుగేసి వికెట్లు నేలకూల్చారు. ఇమాద్ వాసిం ఒక వికెట్ తీశాడు. ‘బౌల్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
మూడోవాడు!
న్యూజిలాండ్ తరపున వన్డేల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన మూడో పురుష బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు డానీ మోరిసన్, షేన్ బాండ్ ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment