రావల్పిండి: బంతి బౌండరీ దాటిందని రిలాక్స్ అవడమో, క్రీజులోకి వచ్చామనే భ్రమలో ఉండటంతోనో లేక అతితొందరతోనో బ్యాట్స్‌మన్ రనౌట్ అవుతుంటారు. నిర్లక్ష్యంతో కూడా బ్యాట్స్‌మన్ కూడా రనౌట్లు అవుతూ ఉండటం చాలానే చూశాం. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పరుగు తీయడానికి నాన్‌స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు పిలుపు ఇవ్వడం, ఆపై వెంటనే నిర్ణయాన్ని మార్చుకుని స్టైకింగ్ బ్యాట్స్‌మన్ వెనక్కి వెళ్లిపోవడం ఆ క్రమంలోనే ఎవరో ఒకరు బలి అయిపోవడం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఇదే తరహా రనౌట్ సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది జింబాబ్వే జట్టు. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం పాక్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే వీరిమధ్య శుక్రవారం తొలి వన్డే జరుగుతోంది. కాగా, ఇక్కడ ఓపెనర్ ఇమాముల్ హక్ రనౌట్‌గా నిష్క్రమించాడు. ఇమాముల్(58) హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పరుగు కోసం యత్నించి తనకు తానే మూల్యం చెల్లించుకున్నాడు. జింబాబ్వే బౌలర్ రాజా వేసిన 26 ఓవర్ ఐదో బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్లోకి ఆడి నాన్‌స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న సొహైల్ హారిస్‌ను పరుగుకోసం రమ్మన్నాడు. దాంతో ఒక్క ఉదుటున పరుగు అందుకున్న సొహైల్.. స్టైకర్స్ ఎండ్‌లోకి వెళ్లిపోయాడు. కాగా, బాల్ సమీపంలో ఉండటంతో ఆ బంతిని మాద్‌వేరె.. రాజా చేతికి ఇవ్వడంతో ఇమాముల్ ఔటయ్యాడు. స్టైకింగ్ ఎండ్ నుంచి కాల్‌ను ఇమాముల్ వెనక్కి తీసుకుని మళ్లీ క్రీజ్‌లోకి పరుగెత్తే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.అప్పటికే స్టైకింగ్ ఎండ్‌లోకి చేరుకున్న సొహైల్ ముందుగా బ్యాట్‌ను క్రీజ్‌లో పెట్టడంతో ఇమాముల్ రనౌట్ అయ్యాడు. అయితే ‘నువ్వు రమ్మన్నావ్.. వచ్చేశా’ అనే ఫీలింగ్ కనబడింది సొహైల్ మోములో. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. హారిస్ సొహైల్ 71 పరుగులు చేశాడు.
— Sandybatsman (@sandybatsman) October 30, 2020
Comments
Please login to add a commentAdd a comment